For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నీ ఏకాంతానికి భంగం కలుగుతుందా? దుర్గ, మోనిత బంధాన్ని ప్రశ్నించిన కార్తీక్

    |

    శౌర్య అలియాస్ జ్వాలా కోసం కార్తీక్, దీప వెతుకుతుంటే.. మోనిత ఫోన్ చేసింది. అయితే కార్తీక్ ఎత్తకపోవడంతో.. ఏంటి వంటలక్కతో లేచిపోయాడా? అనే అనుమానం వ్యక్తం చేసింది. ఒకవేళ దుర్గకు నాకు సంబంధం ఉందనే అనుమానంతో వంటలక్కతో వెళ్లిపోయాడా? వంటలక్క కూడా ఇదే అవకాశంగా తీసుకొని కార్తీక్‌తో వెళ్లిపోయి ఉంటుంది. ఇన్నాళ్లు ఇంత కష్టపడి.. వంటలక్కకు అప్పగించడానికేనా? అని మనసులో అనుకొంటుండగా.. ఇంట్లోకి వచ్చిన కార్తీక్‌ను చూసి.. మోనిత మురిసిపోయింది. కార్తీక్ అంటూ ప్రేమను ఒలకబోయడం చూసి. దుర్గ ఇంట్లో లేడా? అంత ప్రేమను చూపిస్తున్నావు. ఒకసారి మన ప్రేమ నటన అని తెలిసిపోయిన తర్వాత నటించకూడదు మోనిత.. అసహ్యంగా ఉంటుంది అంటూ కార్తీక్ వెళ్లిపోయాడు. ఇక కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1504లో ఇంకా ఏం జరిగిందంటే..

    నా ప్రేమను మాత్రమే చూశావు..

    నా ప్రేమను మాత్రమే చూశావు..

    నా ప్రేమ నాటకం అంటావా? నీ ప్రేమ కోసం ఏ ఆడపిల్ల వెంటపడని విధంగా వెంటపడ్డాను. ఏ ఆడ పిల్ల తెగించని విధంగా తెగించా? ఎన్నో సాహసాలు చేశాను. నా ప్రేమ నాటకంగా కనిపిస్తుందా? ఇప్పటి వరకు నా ప్రేమను మాత్రమే చూశావు. నా పంతాన్ని చూడలేదు. నీ గతం గుర్తుకు వచ్చిందా? లేదా? నీవు నా వద్ద ఏదో దాచేస్తున్నావు. అడ్డు వస్తే.. నేను స్వయంగా అడ్డు తొలగిస్తా అంటూ మోనిత శపథం చేసింది.

    ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిన ఇంద్రుడు

    ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిన ఇంద్రుడు

    శౌర్య కోసం ఇంద్రుడి ఇంటికి కార్తీక్, దీప వెళ్లారు. అయితే ఇంటి ముందు టూలెట్ బోర్డు కనిపించడంతో దీప షాక్ తిన్నది. ఇంటిలో నుంచి యజమాని వచ్చి. ఇళ్లు అద్దెకు కావాలా? రాత్రే ఖాళీ చేసి వెళ్లారు. తలుపులు తెరిచే ఉన్నాయి.. ఇళ్లు చూడండి అని చెప్పాడు. దాంతో రాత్రి ఉన్నారు కదా.. రాత్రికి రాత్రే వెళ్లిపోయారంటే.. శౌర్య వాళ్ల వద్దే ఉండి ఉంటుంది అని దీప అంది. ఇంట్లోకి వెళ్లి చూద్దాం అని దీపను కార్తీక్ లోపలికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో శౌర్య, ఇంద్రుడు, చంద్రుడు ఉన్న ఫోటో పడి ఉండటంతో దానిని తీసుకొని డాక్టర్ బాబు అంటూ అరిచింది. దాంతో ఏమైందంటూ వచ్చి ఆ ఫోటోను చూసి.. కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు. దాంతో నా శౌర్య, నా అత్తమ్మ అంటూ దీప భోరున విలపించింది.

    శౌర్య ఇక్కడే ఉందని గుర్తించలేకపోయాం

    శౌర్య ఇక్కడే ఉందని గుర్తించలేకపోయాం

    శౌర్య ఫోటోను చూపించి.. మనం కొనిచ్చిన నగలు, బట్టలు అని ఏడ్చింది. అయితే మనం బట్టలు, నగలు ఇవ్వడంతో అనుమానం వచ్చి.. వేరే అమ్మాయిని చూపించారు అని కార్తీక్ అన్నాడు. శౌర్య ఇంట్లో ఉంటే.. గుర్తించలేకపోవడంతో నేను తప్పు చేశాను డాక్టర్ బాబు అంటూ ఏడ్చింది. మనకు తెలియకపోవడంతో శౌర్య ఇక్కడే ఉందని గ్రహించలేకపోయాం. నా శౌర్య నాకు కావాలి.. నా బిడ్డ నాకు కావాలి.. నా బిడ్డను ఎక్కడికి తీసుకెళ్లారు అని దీప అంది.. దాంతో శౌర్య ఎక్కడ ఉన్న తీసుకొచ్చి.. అప్పగించే బాధ్యత నాది అని కార్తీక్ అన్నాడు.

    గుడిలో దీప ఎమోషనల్ కావడంతో

    గుడిలో దీప ఎమోషనల్ కావడంతో

    ఆ తర్వాత గుడిలోక వెళ్లి దీప, కార్తీక్ దేవుడికి పూజలు చేశారు. అయితే దేవుడు ముందు నేను ఏం పాపం చేశానననిద దీప ఎమోషనల్ అయింది. దాంతో కార్తీక్ ఊరడించే ప్రయత్నం చేశాడు. శౌర్యను గుర్తించడానికి ఎన్నో అవకాశాలను ఉన్నా.. నేను వృథా చేసుకొన్నాను. నీకు నేను ద్రోహం చేశాను అని దీప విలపించింది. అయితే ఇన్నాళ్లు శౌర్య ఉందో లేదో అనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఇంద్రుడి వద్దే ఉందనే విషయం తెలిసిందని దీపను తీసుకెళ్లాడు.

    ఇంద్రుడిపై తొలిసారి శౌర్య అనుమానం

    ఇంద్రుడిపై తొలిసారి శౌర్య అనుమానం

    శౌర్యను తీసుకొని వేరే గ్రామానికి వెళ్లిన ఇంద్రుడు, చంద్రుడు గుడికి వెళ్లారు. అయితే గోత్రం చెప్పమంటే.. భరద్వాజ గోత్రం అని జ్వాలా చెప్పింది. అయితే తల్లిదండ్రులు పేరు అంటే.. శౌర్య చెప్పడానికి ప్రయత్నించగా.. పక్క నుంచి ఇంద్రుడు,చంద్రుడు అంటూ ఇంద్రుడు చెప్పాడు. దాంతో ఏంటి అమ్మ, నాన్న పేర్లు అడిగితే వారి పేర్లు చెప్పాడు అని శౌర్య అనుమానంగా చూసింది. అయితే ముభావంగా ఉండటంతో ఏం అలా ఉన్నావు అని చంద్రుడు అడిగితే.. ఏం లేదని సమాధానం చెప్పింది. దాంతో మీ అమ్మ నాన్నల పేర్లు అడిగితే.. మా పేర్లు చెప్పాననేగా అని చంద్రుడు అన్నాడు.

    నీ ఏకాంతానికి భంగం కలుగుతుందని అంటూ కార్తీక్

    నీ ఏకాంతానికి భంగం కలుగుతుందని అంటూ కార్తీక్

    ఇక శౌర్యను వెతికి వెతికి అలిసిపోయి కార్తీక్, దీప ఇంటికి చేరారు. వంటలక్క ఇంటిలో నుంచి దుర్గ, మోనిత రావడం చూసి.. ఇంట్లో పనిమనుషులు ఉన్నారని.. నీ ఏకాంతానికి భంగం కలుగుతుందని..తాళాలు బద్దలు కొట్టి ఇక్కడికి వచ్చారా అంటూ దుర్గను, మోనితను చూసి కార్తీక్ అన్నాడు. దాంతో నేను మిమ్మల్ని అదే ప్రశ్న వేస్తున్నాను అని మోనిత అంటే.. నాకు గొడవ పడే ఓపిక లేదు. వెళ్లమని చెప్పు అని దీప అంది.. అయితే నా కార్తీక్‌ను తీసుకొని.. ఊరు తిరిగి వస్తే.. ఓపిక ఉంటుందా? డాక్టర్ బాబు.. డాక్టర్ బాబు అంటూ నిన్నే పట్టుకొని వేళాడుతున్నది. నీకు సిగ్గు లేదా అంటూ మోనిత కడిగిపడేసింది. దాంతో ఎవరు పట్టుకొని వేళాడుతున్నారు అంటూ కార్తీక్ ప్రశ్నించడంతో.. నీకు గతం గుర్తుకు వచ్చిందా? అంటూ మోనిత షాక్ తిన్నది.

    English summary
    Karthika Deepam November 8th Episode number 1504.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X