భర్తతో టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్య వివాదంలో మరో ట్విస్ట్.. మసాజ్ సెంటర్ల వ్యవహారం తెరపైకి!
టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్య, ఆమె భర్త మధ్య వివాదంలో ట్విస్టు చోటుచేసుకొన్నది. తన భర్త భారీగా డబ్బు కాజేసీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకొందని ఆరోపణలు చేస్తున్న శ్యామ్ కుమార్
వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే తనపై భర్త శ్యామ్ కుమార్ చేస్తున్న ఆరోపణల్నీ మీడియాలో ఖండించింది. భర్త చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూ ప్రత్యారోపణలు చేసింది. అయితే ఈ ఫ్యామిలీ వివాదంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏమిటంటే?
టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్య గురించి మీడియాకు ఫిర్యాదు చేస్తూ.. మాకు మ్యాట్రిమోనీ ద్వారా వివాహం జరిగింది. అయితే సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకొన్నారని తెలిసి మంచి అమ్మాయి అనుకొన్నాం. తన కూతురుతో కలిసి మేము హైదరాబాద్‌లో ఉంటున్నామని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అలా మా ఇద్దరి మధ్య వివాహం జరిగింది అని శ్యామ్ కుమార్ తెలిపారు.

పెళ్లి తర్వాత అడ్డాల ఐశ్వర్యతో 15 రోజులు కాపురం చేశాను. ఆ తర్వాత ఆమె షూటింగ్స్ అంటూ హైదరాబాద్‌కు వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నేను హైదరాబాద్ వచ్చాను. ఇంటికి రాగానే ఆమెకు చెడు అలవాట్లు ఉన్నాయని తెలిసింది. ఆమె మద్యం, సిగరెట్లు తాగుతూ కనిపించింది. అది నాకు నచ్చలేదు. ఆ తర్వాత మరో స్నేహితురాలి ఇంటిలో డన్నర్‌కు వెళ్లాం. అక్కడ కూడా అలాగే మద్యం తాగుతూ కనిపించింది అని శ్యామ్ కుమార్ చెప్పారు.
అయితే నాకు ఐశ్వర్యపై పలు అనుమానాలు రావడంతో ఇంటికి వచ్చి లాకర్ చూశాను. అయితే అందులో రియల్టర్‌తో దిగిన ఫోటోలు ఉన్నాయి. అలాగే ఇంటిలో కండోమ్స్ కూడా లభించాయి. దాంతో మా మధ్య వాదనలు జరగడంతో విభేదాలు చోటుచేసుకొన్నాయి. 25 లక్షల రూపాయలు తీసుకొని ప్రస్తుతం వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొన్నది అని ఆయన ఆరోపించాడు.

అయితే భర్త శ్యామ్ రావు చేసున్న ఆరోపణలను టీవీ నటి ఐశ్వర్య తీవ్రంగా ఖండించింది. ఆయనకు మసాజ్ సెంటర్లు పెట్టి బిజినెస్ చేయాలనుకొంటున్నారు. ఆయనకు ఓ మసాజ్ సెంటర్ ఉంది. అక్కడ ఆయనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. నాకు చెడు అలవాట్లు లేవు. ఆయన తిరుగుబోతు. ఆయన చేసే పనులే మరో ఒకరు చేస్తారని ఆయనకు అనుమానాలు. అందుకే నాపై కక్ష సాధింపు చేస్తున్నారు అని అన్నారు.
నా భర్త శ్యామ్ కుమార్ మీడియాకు చెప్పిన విషయాలన్నీ అనుమానాలే. ఆయన తన కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోరు. తన చెల్లెలికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని చెబుతాడు. నాపై అతడు చేసే వ్యాఖ్యల్లో ఎలాంటి నిజాలు లేవు అని ఆమె చెప్పారు. ఇదిలా ఉండగా, అడ్డాల ఐశ్వర్య విషయానికి వస్తే.. అల వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది టెలివిజన్ సీరియల్స్‌తో గుర్తింపు పొందారు.


Click it and Unblock the Notifications











