టీవీ నటి ఆత్మహత్య.. సీసీటీవీ ఫుటేజ్ ట్విస్టు తెరపైకి.. మాట మారుస్తున్న మాజీ ప్రియుడు!

టెలివిజన్ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఘటన తర్వాత పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అలీబాబా: దస్తాన్ ఏ కాబుల్ షో షూటింగ్ సందర్బంగా తునీషా శర్మ తన సహచర నటుడి మేకప్ రూమ్‌లో ఉరి వేసుకొని మరణించడం బాలీవుడ్, టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. అయితే మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ ప్రవర్తన ఆమె మరణానికి దారి తీసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే తునీషా శర్మను షీజాన్ ఖాన్ హాస్పిటల్‌కు తీసికెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు రావడం ఈ కేసు దర్యాప్తులో భారీ ట్విస్టుగా మారింది. తునీషా శర్మ మరణానికి సంబంధించిన వివాదాల వివరాల్లోకి వెళితే..

4 రోజులపాటు పోలీస్ రిమాండ్

4 రోజులపాటు పోలీస్ రిమాండ్

ఇటీవల టెలివిజన్ నటి తునీషా శర్మ మరణానికి సంబంధించిన కేసు విచారణ వేగంగా జరుగుతున్నది. తన కూతురు ఆత్మహత్యకు కారణం షీజాన్ ఖాన్ అంటూ తునీషా తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుగుతున్నది. షీజాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసి 4 రోజలపాటు పోలీస్ కస్టడీకి తరలించారు. అయితే విచారణ సందర్భంగా పలుమార్లు భోరున విలపించాడు. తునీషా అంత్యక్రియలకు హాజరుకావాలని ఉందని అని షీజాన్ కోరాడు అని పోలీసులు తెలిపారు.

శ్రద్దా వాకర్ హత్య తర్వాత అంటూ

శ్రద్దా వాకర్ హత్య తర్వాత అంటూ

తునీషా శర్మ మరణానికి సంబంధించి గత రెండు, మూడు రోజులుగా జరుగుతున్న విచారణలో పలుమార్లు తన మాటలను మార్చాడు. రకరకాల వాదనలు వినిపించడం అనేక సందేహాలకు దారి తీసింది. శ్రద్దావాకర్ హత్య తర్వాత మా రిలేషన్‌షిప్‌లో కలతలు ఏర్పడ్డాయి. మా కుటుంబ సభ్యులు మా బంధంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో మా మధ్య బ్రేకప్ జరిగింది. మత, కులం సంబంధిత అభ్యంతరాలు వచ్చాయని షీజాన్ చెప్పాడు. ఒకసారి చెప్పిన మాట మరోసారి కన్ఫర్మ్ చేయడం లేదు అని పోలీసులు పేర్కొన్నారు.

తునీషా శర్మను షీజాన్ హాస్పిటల్‌కు

తునీషా శర్మను షీజాన్ హాస్పిటల్‌కు

ఇదిలా ఉండగా, తునీషా శర్మ గదిలో బంధించుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన తర్వాత డోర్ పగలగొట్టి ఆమెను బయటకు తీశారు. అయితే ఆమెను షూటింగ్ స్పాట్ నుంచి హాస్పిటల్‌కు తరలించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అయితే తునీషాను కేవలం షీజాన్, మరొకరు మాత్రమే హాస్పిటల్‌కు తరలించారు. షూటింగులో ఉన్న నిర్వాహకులు వారి వెంట వచ్చిన దాఖలాలు కనిపించలేదు. అయితే సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.

సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా

సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా

అయితే హస్పిటల్ గేటు వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో షీజాన్ ఖాన్ తన చేతుల్లో తునీషా శర్మను ఎత్తుకొని వెళ్లినట్టు దృశ్యాలు రికార్డు అయ్యాయి. షీజాన్, మరో వ్యక్తి ఇద్దరు కారు నుంచి ఆమెను దించుతున్న సన్నివేశాలు కనిపించాయి. అయితే హాస్పిటల్‌కు తీసుకెళ్లే వరకు ఆమె బతికి ఉందా? అంతకు ముందే మరణించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లవ్ జిహద్ ఆరోపణలతో బీజేపీ

లవ్ జిహద్ ఆరోపణలతో బీజేపీ

తునీషా శర్మ మరణానికి రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ కేసు దర్యాప్తు ఆసక్తికరంగా మారింది. లవ్ జిహద్ అంటూ బీజేపీ నేతలు ఆరోపణలు సంధిస్తుండటంతో ఈ కేసు విచారణ అనేక మలుపులు తిరుగుతున్నది. ప్రాథమిక విచారణ ప్రకారం.. తునీషా శర్మ మరణం వెనుక లవ్ జిహద్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏదైనా సంచలన విషయాలువ వెల్లడవుతాయా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X