Karthika Deepam హిమ, శౌర్యకు షాక్.. డాక్టర్ శోభ, స్వప్న మాస్టర్ ప్లాన్ ఏమిటంటే?
తనను చెంపదెబ్బ కొట్టిన జ్వాలా అలియాస్ శౌర్యను అవమానించేందుకు ఏర్పాటు చేసిన పార్టీలో హిమ చాతుర్యం, తెలివితేటల కారణంగా తనకే ఎదురు దెబ్బ తగలడంతో డాక్టర్ శోభ షాక్ తిన్నది. అయితే తన బాబాయ్, పిన్నిలపై దొంగతనం మోపడంపై జ్వాలా మనస్తాపం చెంది ఓ పక్కన నిలుచొని ఉండగా.. నిరుపమ్ వచ్చి సారీ చెప్పేందుకు ప్రయత్నించాడు. నా బాబాయ్, పిన్ని దొంగతనం చేయడం మానేశారని జ్వాలా చెప్పడం.. అందుకు ఆ మాట వినడానికే సిగ్గుగా ఉంది అంటూ నిరుపమ్ కోపగించుకోవడాన్ని డాక్టర్ నిరుపమ్ గుర్తు చేసుకొన్నాడు. అది గుర్తు చేసుకొని.. కోపంలో ఏదో అన్నాను అంటే.. డాక్టర్ సాబ్.. దానిని లైట్ తీసుకోండి అంటూ జ్వాలా సమాధానం చెప్పింది. అయితే నాపై కోపం లేదా? అని నిరుపమ్ అడిగితే.. డాక్టర్ సాబ్.. మీరు నాకు సారీ చెప్పడం ఏమిటి? అవన్నీ మరిచిపోండి. నన్ను ఏదైనా అనే హక్కు మీకు ఉంది. మీరు ఏమన్నా నేను పడుతాను అంటూ జ్వాలా చెప్పడంతో నిరుపమ్ హ్యాపీగా ఫీలయ్యాడు. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1372 లో ఇంకా ఏం జరిగిందంటే...

హిమ నీ తెలివి తేటలు
నిరుపమ్, జ్వాలా మాట్లాడుకొంటుండగా.. అంతలోనే హిమ అక్కడకు వచ్చింది. దొంగతనం ఆరోపణలు డాక్టర్ శోభ చేసిన సమయంలో హిమ సమయస్పూర్తిని ప్రదర్శించడమే కాకుండా శోభ దుష్టబుద్దిని బయటపెట్టడాన్ని జ్వాలా అభినందించింది. తింగరి అదరగొట్టేశావు. థ్యాంక్స్ యూ అంటూ జ్వాలా అంటే.. చివరి నిమిషంలో చాలా బాగా బిహేవ్ చేశావు అని నిరుపమ్ అన్నాడు. నీ తెలివితేటలు భేష్ అని జ్వాలా అంటే.. ఇన్ని తెలివితేటలు ఉన్న హిమ తనను ఎందుకు వద్దనుకొంటుందో అని నిరుపమ్ ఆవేదన చెందాడు.

నా పరువు పోయిందంటూ
తమ ప్లాన్‌ను హిమ ఫెయిల్ చేయడంతో నిరుపమ్ తల్లి స్వప్న ఆవేశంతో ఊగిపోయింది. ఎక్కడో పొరపాటు జరిగిందని శోభ చెప్పుకొనేందుకు సర్ది చెప్పుకొనేందుకు ప్రయత్నించగా.. నాకేం చెప్పకు శోభ అంటూ స్వప్న చిరాకు పడింది. నా పరువు తీశావు. తలచుకొంటేనే కంపరగా ఉంది. నీ పరువుతోపాటు నా పరువు పోయింది అని స్వప్న అంటే.. హిమ ఇలా చేస్తుందని అనుకోలేదు అని శోభ సమాధానం ఇచ్చింది. దాంతో హిమ ఇంకా మన పరువు కాపాడింది. అందరి ముందు అరువలేదు. పద్దతిగా దగ్గరికి వచ్చి చెప్పింది. రచ్చ చేసే అవకాశం ఉన్నా చేయలేదు. అందుకు సంతోషించు అంటూ స్వప్న సర్ధిపుచ్చుకొనే ప్రయత్నం చేసింది.

తల్లికి షాకిచ్చిన నిరుపమ్
డాక్టర్ శోభను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ తల్లి స్వప్న బలవంతం చేయడంతో డాక్టర్ నిరుపమ్ ఎదురు తిరిగాడు. నా పెళ్లి నా ఇష్టం. నా జీవితం గురించి నేను నిర్ణయం తీసుకొంటాను. డాక్టర్ శోభను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. హిమను తప్ప మరొకరిని ఊహించుకోలేను అని నిరుపమ్ అంటే.. హిమ గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? అని తల్లి స్వప్న సమాధానం చెప్పింది. పెళ్లి విషయంలో మీరు మీ అభిప్రాయాలను రుద్ద వద్దు అంటూ తల్లికి నిరుపమ్ తెగేసి చెప్పాడు. దాంతో పక్కనే ఉన్న భర్తను చూసి.. మీకు బాధ్యత లేదా అంటే.. భర్తగా నా బాధ్యతను నీవు ఎప్పుడో తెంపేశావు. సమాజం దృష్టిలో నన్ను తండ్రిగానే చేశావు. ఇప్పుడు నన్ను తండ్రి అని గుర్తు చేస్తున్నావా అని సత్యం ఘాటుగా స్పందించాడు. పెళ్లి విషయంలో వారి నిర్ణయాలను వారికే వదిలి వేద్దాం అంటూ భార్య స్వప్నకు సత్యం చురకలు అంటించాడు.

డాక్టర్ శోభతో నిరుపమ్ నిశ్చితార్థం
డాక్టర్ శోభతో నీకు నిశ్చితార్థం ఫిక్స్ చేశాను. ఎవరు ఏ నిర్ణయం తీసుకొన్నా నేను హిమనే పెళ్లి చేసుకొంటాను. నీకు నచ్చిన షర్ట్ నాకు నచ్చకొన్న నేను వేసుకొంటాను. కానీ నాకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకొంటాను. హిమను తప్ప మరొకరిని నేను ఊహించుకోలేను అని నిరుపమ్ తెగేసి చెప్పాడు. దాంతో డాక్టర్ శోభతో నిశ్చితార్థం జరగకపోతే.. నేను బతికి ఉండను అంటూ నిరుపమ్‌తో స్వప్న బెదిరింపులకు పాల్పడింది. దాంతో కోపంతో ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్‌ను నేలకేసి కొట్టాడు.

అమ్మకు దూరం అయ్యాను అంటూ
ఇంటి నుంచి కోపంతో బయటకు వచ్చిన నిరుపమ్ నేరుగా సత్యం ఇంట్లో ఉన్న జ్వాలా వద్దకు వెళ్లాడు. కొందరికి దగ్గరవ్వాలంటే.. కొందరికి దూరం కావాల్సి ఉంటుంది. నేను మా అమ్మకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. నాన్న వద్దనే ఉండాలని నిర్ణయించుకొన్నాను అని నిరుపమ్ అంటే.. నీవు నా వద్దకు రావడం హ్యాపీగానే ఉంది. కానీ అమ్మకు దూరం కావడం ఇష్టంగా లేదు అని సత్యం అంటే.. ఇక్కడే ఉండనివ్వండి.. రోజు ఆంటీ వద్దకు వెళ్లి రమ్మని చెప్పండి అంటూ జ్వాలా సలహా ఇచ్చింది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్.. తన సోదరుడు ఇంటికి రావడం చూసి హ్యాపీగా ఫీలయ్యాడు.

అందరం ఫ్యామిలీగా కలిసి ఉందాం
అమ్మను వదిలేసి రావడం బాధగానే ఉంది అని నిరుపమ్ అంటే.. అమ్మ అక్కడ.. మనం ఇక్కడ ఉండటం బాగా లేదు అని అనుకొంటుండగా.. ఇక నుంచి అలాంటి బాధ పడనక్కర్లేదు. ఫ్యామిలీ అంతా కలిసే ఉంటారు అని డాక్టర్ శోభ ఎంట్రీ ఇచ్చింది. ఇక నుంచి మీరు వేరుగా.. నేను వేరుగా ఉండటం కుదరదు. అందరం కలిసి ఉందా అంటూ స్వప్న అక్కడికి వచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు తలబిరుసుతనం, పెంకితనంతో నేను మొండిగా వ్యవహారించాను. నిరుపమ్ వెళ్లిపోయిన తర్వాత శోభ చెప్పిన మాటలకు రియలైజ్ అయ్యాను అంటే.. నమ్మలేకపోతున్నాం అని అందరూ ఆశ్చర్యపోయారు. అందర్ని దూరం చేసుకొని నేను ఏం బాగుపడుతాను. మీ వద్దకు నేను వచ్చేశాను అని స్వప్న అంది.

జ్వాలాను కించపరిచిన స్వప్న, శోభ
అయితే అందరం స్వప్న ఆంటీ ఇంటికి షిఫ్ట్ అవుదాం. ఇక్కడ ఉన్న ఫర్నీచర్, వస్తువులు అమ్మేద్దాం లేదా పేదవాళ్లకు పంచిపెడుదాం అని జ్వాలాను చూస్తూ హేళన చేసింది. దాంతో సత్యం, ప్రేమ్ ఇబ్బంది పడ్డారు. శోభ మాటలకు అడ్డుపడుతూ.. ఇప్పుడే ఏం తొందర. కొద్ది రోజులు ఆగి వెళ్దాం అంటే.. లేదు.. లేదు.. మంచి పనులకు ఆలస్యం చేయవద్దని డాక్టర్ శోభ తొందరపెట్టింది. ఇక జ్వాలాను చూస్తూ.. నీకు ఎంత డబ్బు రావాలో లెక్క చేసి.. తీసుకో.. క్యారేజ్, మాటలు మోయడం ఇక ఆపేయ్ అంటూ జ్వాలాను స్వప్న కించపరిచేలా మాట్లాడింది.

తాజా కార్తీకదీపం ప్రోమోలో
ఇక తాజా ప్రోమోలో మరో ట్విస్టు ఇచ్చారు. ఇక నుంచి నీ టిఫిన్, క్యారేజ్ కట్.. అలాగే.. నిరుపమ్‌తో నీ కనెక్షన్ కట్. ఇది మా ప్లాన్ అంటూ శోభ అనగానే.. జ్వాలా ఆమె మీదకు ఉరికింది. దాంతో హిమ ఆపింది. అంతలోనే.. స్వప్న ఎంట్రీ ఇచ్చి.. డాక్టర్ శోభాదేవి నాకు నచ్చింది. ఇక ముందు మా ఇంట్లోకి వస్తుంది అంటూ స్వప్న తమ ప్లాన్స్ చెప్పేందుకు ప్రయత్నించింది. ఇక చెప్పండి అమ్మాయిలు.. వాట్ టు డూ.. వాట్ నాట్ టూ డూ అని హిమ, జ్వాలాపై సెటైర్ వేసింది.


Click it and Unblock the Notifications











