Karthika Deepam మోనిత లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టిన దీప.. కార్తీక్ ముందే అవమానం!

యాక్సిడెంట్ కారణంగా గతం మరిచిపోయిన కార్తీక్‌ మళ్లీ మామూలు మనిషి కావడంతో తన పిల్లలు, భార్య దీప గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. రోడ్డుపై బొమ్మలు అమ్ముతున్న కూతురు శౌర్య గురించి వెతికాడు. కానీ దొరకకపోవడంతో నేరుగా దీప ఇంటికి వచ్చి రాత్రంతా ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఉదయం నిద్రలేచిన దీప.. ఎదురుగా కార్తీక్ ఉండటంతో కంగారుపడిపోయింది. అయితే దీపతో మాట్లాడుతూ... నీకు పిల్లలు ఉన్నారని చెప్పావు కదా అని కార్తీక్ అడిగితే.. వాళ్లు అమెరికా వెళ్లిపోయారు అని దీప చెప్పింది. అయితే శౌర్య ఇక్కడే ఉంది. మన కోసం వెతుకుతున్నది. అది నీకు తెలియదు అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు. నాకు గతం గుర్తుకు వచ్చిందని చెబితే నిన్ను మోనిత ఏం చేస్తుందో అనే భయంతో ఉన్నాను అని ఆలోచనల్లో పడిపోయాడు. అయితే కార్తీక్ ఆలోచిస్తుండటంతో ఏంటి డాక్టర్ బాబు ఆలోచిస్తున్నావు అంటే తలనొప్పిగా ఉందంటూ కార్తీక్ చెప్పాడు. ఇంకా కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1486 లో ఇంకా ఏం జరిగిందంటే..

మోనితను చెంపపై కొట్టిన దీప

మోనితను చెంపపై కొట్టిన దీప

కార్తీక్‌ తనకు తల నొప్పిగా ఉందంటే.. వెంటనే కాఫీ కలిపిస్తాను అని లోనికి వెళ్లి కాఫీ తెచ్చి ఇచ్చింది. కార్తీక్ కాఫీ తాగుతుంటే.. మోనిత అక్కడికి వచ్చి.. వంటలక్క.. రాత్రంతా నా భర్తను అని అనగానే.. మోనితను దీప చెంపపై లాగి కొట్టింది. రాత్రంతా ఒంటరిగా కార్తీక్ ఉంటే.. నేను ఉదయం చూశాను. కాఫీ అడిగితే ఇచ్చాను అని దీప చెప్పింది. అయితే కార్తీక్‌ను నిలదీస్తూ.. నీ భార్యను కొడితే.. నీవు రియాక్ట్ కావా? అంటే.. ఎవరు నాకు భార్య అని అమాయకంగా ప్రశ్నించాడు.

 రాత్రంతా దీపతో అంటూ మోనిత

రాత్రంతా దీపతో అంటూ మోనిత


నా భార్య ఎవరు అని కార్తీక్ అనగానే.. నేను నీ భార్యను అనే విషయం తెలియదా? మోనిత అంటే.. నాకు మతి మరుపు. ఇప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తుకు ఉండదు. ఇంతకు నీవు ఏమన్నావు.. రాత్రంతా దీపతో అని అన్నావు కదా.. ఆ మాటను మరో మహిళతో అంటే నీ చెంప పగలకపోతే.. నేను దీపను అడుగుతాను అని కార్తీక్ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత మోనితను తీసుకొని కార్తీక్ ఇంటికి వెళ్లిపోయారు.

 భార్యను కొడితే ఊరుకొంటారా?

భార్యను కొడితే ఊరుకొంటారా?


ఇక ఇంటికి వచ్చిన మోనిత.. దీప చేతిలో పరాభవాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇంటికి వచ్చి దీప కొట్టిన చెంపపై రాసుకొంటుంటే.. కార్తీక్ వచ్చి.. ఏంటి చెంప రాసుకొంటున్నావు అంటే.. ఇప్పుడు జరిగింది.. నీవు మరిచిపోతే ఎలా.. నీ భార్యను ఎవరైనా కొడితే ఊరుకొంటారా అని మోనిత అంది. అయితే అంతలోనే దుర్గ వచ్చి.. బంగారం.. నీ కోసం, నా కోసం దోశెలు తెచ్చాను. కార్తీక్ సార్ రాత్రి లేడు కాదా.. అందుకే నేను రెండు దోశెలే తెచ్చాను అని దుర్గ అనడంతో.. మోనిత కోపంతో ఊగిపోయింది. నేనెప్పుడు చెప్పానురా.. అంటూ కోపంతో అరిచింది. అంతలోనే దీప అక్కడికి వచ్చి.. నీ కోసం టిఫిన్ తెచ్చాను అంటూ చెప్పింది.

ఆనంద్ నా బిడ్డేనా? కార్తీక్

ఆనంద్ నా బిడ్డేనా? కార్తీక్


తన కోసం టిఫిన్ తీసుకు రావడంతో కార్తీక్ వెళ్లిపోతుంటే.. ఏంటి కార్తీక్ వెళ్లిపోతున్నావా? అంటే.. మీరు దోశెలు తెచ్చుకొన్నారుగా.. అని సమాధానం చెప్పాడు. దాంతో కార్తీక్‌ను ఇంటిలోకి తీసుకెళ్లి టిఫిన్ పెట్టింది. అంతలోనే ఆనంద్ ఏడవడంతో దీప ఎత్తుకొన్నది. అంతలోనే మోనిత వచ్చి.. ఎత్తుకొమని పనిమనిషికి చెప్పింది. దాంతో అవసరం లేదు. దీపనే చూసుకొంటుంది అని అంటే.. అవసరం లేదు మోనిత చెప్పింది. అయితే మోనిత మాటలను అడ్డుకొంటూ.. ఆనంద్ నా బిడ్డేనా? నాకు హక్కు లేదా? ఇక నుంచి ఏడిస్తే.. దీప చూసుకొంటుంది అని కార్తీక్ గట్టిగా మోనితకు అక్షింతలు వేశాడు. అంతలోనే ఫోన్ వస్తే.. వస్తున్నా అంటూ లేచివెళ్లిపోయాడు. దాంతో ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది? ఎక్కడకు వెళ్తున్నాడని దీప, మోనిత కంగారుపడ్డారు.

 వారణాసి నాకు కావాల్సిన వ్యక్తి..

వారణాసి నాకు కావాల్సిన వ్యక్తి..


ఫోన్‌లో మాట్లాడిన కార్తీక్.. నేరుగా వారణాసి చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు వెళ్లాడు. వారణాసి దీన పరిస్థితి చూసి బాధపడ్డాడు. డాక్టర్‌ను కలిసి.. వారణాసి పరిస్థితి ఎలా ఉందని అడిగాడు. చికిత్సకు స్పందిస్తున్నాడు అని డాక్టర్ చెప్పాడు. దాంతో వారణాసి నాకు బాగా కావాల్సిన వాడు. వైద్యం విషయంలో కాస్త చొరవ చూపండి అని కార్తీక్ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X