For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam కార్తీక్‌కు విషం పెట్టిన వాల్తేరు వాణి.. దీప, దుర్గ ముందే..!

    |

    దీప, దుర్గను చంపేందుకు నియమించిన వాల్తేరు వాణి వారిద్దరిని నమ్మించే ప్రయత్నం చేసింది. మోనిత చేసిన కుట్రలను చెప్పిన దీప మాటలు విని.. కార్తీక్, మీరు భార్యభర్తలా? ఆస్తులను కొట్టేసినోళ్లను చూశాను. డబ్బులు కాజేసిన వాళ్లను చూశాను. కానీ భర్తను కాజేసిన ఆమెను ఇప్పుడే చూస్తున్నాను అని వాల్తేర్ వాణి అంది. అయితే 20 లక్షల ఆస్తిని కొట్టేసినందుకే ఇలా కోపం వస్తే.. నా జీవితాన్నినాశనం చేసిన దాన్ని ఏం చేయాలి? అని దీప అంటే.. చంపేయాలి అని వాల్తేర్ వాణి కోపంతో ఊగిపోయింది.

    మోనితను ఓడించడం అంత ఈజీ కాదు అని దీప అంటే.. దీపను చంపేందుకు ప్రయత్నించింది. నన్ను పోలీసులకు పట్టించేందుకు ప్లాన్ చేసింది అని దుర్గ అన్నాడు. అయితే మీరు నమ్మండి..మ సంగతి చూసుకొంటాను. అన్నను నిన్ను కలిపే బాధ్యత నాదే అని వాల్తేర్ వాణి అంది. అయితే మనసులో మాత్రం నీవు నమ్ము.. ఎంత గుడ్డిగా నమ్మితే నా పని అంత ఈజీ అవుతుంది అని వాల్తేర్ వాణి అంది. కార్తీకదీపం సీరియల్‌ 1492 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

     దీపతో నీవు చేస్తున్నదేంటి?

    దీపతో నీవు చేస్తున్నదేంటి?

    ఇక కార్తీక్ మాత్రం తన కూతురు శౌర్య గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతలోనే మోనిత వచ్చి.. భోజనం చేద్దామని అడిగితే.. నాకు తినే ఆలోచన లేదు అని కార్తీక్ చెప్పాడు. అయితే.. నేను తప్పు చేయలేదు. నిన్ను ప్రేమించడమే నా తప్పా? ఒకప్పుడు నీవు వంటలక్క ఇంటికి వస్తే.. మాట్లాడేవాడివి. ఇప్పుడు ఏకంగా ఇంటికి వెళ్లి మాట్లాడుతున్నావు. వంటలు కూడా చేసిపెడుతున్నావు. నన్ను దుర్గను కలిపి ఏదో అనుమానం పెట్టుకొన్నావు. నీవు, వంటలక్క చేసున్నదేమిటి అని మోనిత అంటే.. పచ్చ కామెర్ల వారికి అంతా పచ్చగానే కనిపిస్తుందని కార్తీక్ అన్నాడు.

    వంటలక్కకైనా సిగ్గు ఉండాలి కదా..

    వంటలక్కకైనా సిగ్గు ఉండాలి కదా..


    కార్తీక్‌పై ఆగ్రహం వ్యక్తం చూస్తూ.. వంటలక్కతో కారులో షికార్లు కొడుతున్నావు. దానికి ఎలా సిగ్గులేదు. నీకు ఏమైంది అని మోనిత అంటే.. వంటలక్కను ఒక్క మాట అనకూడదు అని కార్తీక్ హెచ్చరించాడు. అయితే నన్ను ఏది పడుతే అది అంటున్నావు. నీకు వంటలక్కనే ఎక్కువైందా? వంటలక్కతో తిరిగినా? దాని వద్ద ఉన్నా సహించను అని మోనిత అంటే.. నాకు ఎక్కడ ప్రశాంతత ఉంటే అక్కడ ఉంటాను అని కార్తీక్ అన్నాడు. దాంతో నా వద్ద ప్రశాంతత లేదా అని మోనిత అంది. అంతలోనే బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నావు అని మోనిత అడిగితే.. ప్రశాంతత వద్దకు అని కార్తీక్ చెప్పి వెళ్లిపోయాడు.

    దుర్గను బుట్టలోకి దించేందుకు వాణి

    దుర్గను బుట్టలోకి దించేందుకు వాణి


    ఇక దుర్గతో వాల్తేరు వాణి చనువుగా ఉంటూ.. నీకు నిజం చెప్పనా? నీవు మోనితను టార్చర్ పెట్టావని తెలిస్తే.. నేను చాలా హ్యాపీ అయ్యాను అని వాల్తేరు వాణి అంటే.. అవునా వాణి అంటే.. వాణి కాదు.. వాల్తేరు వాణి అని దుర్గకు సమాధానం ఇచ్చింది. నా పేరు పెట్టి పిలిస్తే.. కాస్త టార్చర్ తక్కువ పెడుతా. నిన్ను ఎలాగైనా బుట్టలో వేసుకొంటా అని మనసులో అనుకొంటుంటే.. ఏం ఆలోచిస్తున్నావు అని దుర్గ అంటే.. ఇందాక ఏదో నిజం చెబుతావని చెప్పావుగా.. ఏంటి అంటే.. నాకు ఆడవాళ్లతో మాట్లాడటం ఇష్టం ఉండదు. కానీ నీవు నాకు నచ్చావు ఎందుకంటే.. దీపమ్మకు సహాయం చేస్తున్నావు కదా.. అందుకే అని దుర్గ అన్నాడు. దాంతో నా లైన్‌లోకి వచ్చావు అంటూ వాణి మనసులో అనుకొన్నది.

    డిన్నర్‌కి వస్తావా? అంటూ

    డిన్నర్‌కి వస్తావా? అంటూ


    ఇక దుర్గను బుట్టలోకి లాగుతూ.. నీవు నాతో గంటకుపైగా మాట్లాడుతున్నావు. నేను ఆడదానిలా కనిపించడం లేదా అన్నాడు. రాత్రికి డిన్నర్‌కు వెళ్దామా? అని వాణి అడిగింది. డిన్నర్‌కా? నీతోనా? అని దుర్గ అంటే.. నాతో రావా? అని అంటే.. నేను ఎప్పుడు ఆడవాళ్లతో నేను డిన్నర్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైనా తినాలని అనిపిస్తే.. చెబుతా అని దుర్గ అన్నాడు. దాంతో వాల్తేర్ వాణి డిన్నర్ డేట్ ఇస్తే.. రాని మగాడు ఉంటాడా? నీ సంగతి తొందర్లోనే తేలుస్తా అని వాల్తేరు వాణి మనసులో అనుకొన్నది.

    వాణి డిన్నర్‌కు వెళ్దామా అంటూ

    వాణి డిన్నర్‌కు వెళ్దామా అంటూ


    దీప ఇంటి వద్ద ఉన్న వాల్తేర్ వాణి వద్దకు వచ్చిన మోనిత.. ప్లాన్ ఎంత వరకు వచ్చింది అని అడిగితే.. రెండు రోజుల్లో పని పూర్తి చేస్తాను అని మోనితకు వాణి చెప్పింది. అంతలోనే దుర్గ ఫోన్ చేసి.. డిన్నర్ డేట్‌కు వెళ్దామా? అంటే.. సరే... వెళ్దాం అని వాణి అంటే.. సరే రా.. అని దుర్గ అంటే.. ఈ విషయం దీపకు గానీ, మోనితకు గానీ చెప్పకు అని ఫోన్ పెట్టేసింది. అంతలోనే కార్తీక్, దీప రావడంతో.. పోవే.. ఇక్కడకు ఎందుకు వచ్చావు అని మోనితను తోసేసి వాణి డ్రామా ఆడింది. దాంతో అక్కడి నుంచి మోనిత వెళ్లిపోగా.. కార్తీక్ వచ్చి.. దీపను జాగ్రత్తగా చూసుకో అని కార్తీక్ చెప్పాడు. దాంతో కసాయి వాడినే నమ్ముతున్నావా పిచ్చోడా అని వాణి మనసులో అనుకొన్నది.

    టిఫిన్‌లో విషం పెట్టి

    టిఫిన్‌లో విషం పెట్టి


    దీప ఇంటి వద్ద ఉన్న వాణికి, దుర్గకు టిఫిన్లు సిద్దం చేసి తెచ్చింది. అప్పటికే టిఫిన్‌లో వాణి విషం పెట్టింది. దీప టిఫిన్ తినమంటే... నేను ఈ పూట టిఫిన్ చేయను. మీరు తినండి అని వాణి చెప్పింది అయితే ఆ టిఫిన్ తింటే.. పైకి పోతారు.. దీప, దుర్గ ఒకేసారి పైకి పోవాలి అని అనుకొన్నది. కానీ అంతలోనే కార్తీక్ రావడంతో కంగారు పడిపోయింది. కార్తీక్‌కు టిఫిన్ ప్లేట్ ఇవ్వడంతో మరింత కంగారుపడిపోయింది. దుర్గ తింటుంటే.. చేతిపై కొట్టింది. దుర్గ చేస్తే.. అనుమానంతో దీపకు కార్తీక్ మరింత దగ్గర అవుతాడు. కాబట్టి.. దీప, దుర్గ ఒక్కసారే చావాలి అని మనసులో అనుకొన్నది. అయితే తనను టిఫిన్ తిననివ్వకుండా చేయడం చూసి.. ఏంటి అలా కొట్టావంటే.. ఏం లేదు.. మీరిద్దరి ఒకేసారి తినాలని అని వాణి సర్ది చెప్పింది.

    English summary
    Karthika Deepam October 25th Episode number 1492.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X