For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ఆ విషయం నిజమైతే.. నాలో రాక్షసుడిని చూస్తావు.. మోనితకు కార్తీక్ వార్నింగ్

    |

    దీప, దుర్గను చంపేందుకు టిఫిన్‌లో విషం కలిపిన వాల్తేరు వాణి.. కార్తీక్ వచ్చి టిఫిన్ తినేందుకు సిద్దం అవడంతో టెన్షన్ పండింది. విషంతో కూడిన టిఫిన్‌ను కార్తీక్ తినకుండా ఆపడం ఎలా అని కంగారుపడుతున్న సమయంలో మోనిత వచ్చి.. టిఫిన్ ప్లేట్‌ను విసిరికొట్టింది. దాంతో మోనిత చేసిన పని నచ్చనట్టు నాటకం ఆడుతూ వాణి గొడవకు దిగింది. మోనిత, వాల్తేర్ వాణి గొడవ పడుతుంటే.. కార్తీక్ ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే గొడవ పెద్దగా జరుతుండటంతో మోనితను తీసుకెళ్లమని కార్తీక్‌కు దీప చెప్పింది. అయితే నీ సలహా ఎవరికి అవసరం.. నా మొగుడు నా ఇంట్లో టిఫిన్ తినాలి అంటూ మోనిత గొడవకు దిగడంతో కార్తీక్ ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1493 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    పెద్దమనిషి అయిన శౌర్య

    పెద్దమనిషి అయిన శౌర్య


    శౌర్య పెద్ద మనిషి కావడంతో ఇంద్రుడు, చంద్రుడు దంపతులు ఆనందంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. శౌర్య ఎక్కడ? ఎన్ని కష్టాలు పడుతున్నదో అనే బాధలో కార్తీక్, దీప మునిగిపోయారు. గణేష్ పండుగ సమయంలో బొమ్మలు అమ్ముతున్న శౌర్య.. ఇప్పుడు దీపావళీ పండుగ సమయంలో పటాసులు అమ్ముతుందా? అని కార్తీక్ ఆలోచనల్లో పడిపోయారు. శౌర్య, తమ కుటుంబం మొత్తం విడిపోవడానికి కారణం మోనితనే అని దీప, కార్తీక్ అనుకొన్నారు. ఎలాగైనా నిజం చెప్పించి మోనితను వదులుకోవాలని కార్తీక్ అంటే.. నా భర్తను ఎలాగైనా మోనిత నుంచి తెచ్చుకోవాలని దీప మనసులో అనుకొన్నారు.

     ప్రియమణి ఎవరు అంటూ కార్తీక్

    ప్రియమణి ఎవరు అంటూ కార్తీక్


    టిఫిన్‌లో వాల్తేరు వాణి విషం పెట్టిన తీరుపై మోనిత కంగారుపడింది. ఇలాంటి ప్లాన్స్ నేను చేయలేకనా? నా చేతికి మట్టి అంటించు కోకూడదని వాల్తేరు వాణిని తెప్పించుకొన్నాను. కానీ ఈ టిఫిన్లలో విషం పెట్టడం ఏమిటి? ఒకవేళ కార్తీక్ తిని ఉంటే.. దారుణం జరిగిపోయి ఉండేదని మోనిత అనుకొంటుండగా.. కార్తీక్ వచ్చి.. ప్రియమణి ఎవరు అని కార్తీక్ అడిగాడు. దాంతో నాకు ఎవరో తెలియదని ప్రియమణి చెప్పడంతో.. నీ వద్ద పనిచేసిందని చెప్పిందని కార్తీక్ అంటే.. ఏమో నా వద్ద చాలా మంది పనిచేసి ఉంటారు కదా.. నేను మరిచిపోయి ఉంటానేమో అని మోనిత సమాధానం ఇచ్చింది. దాంతో గతం మరిచిపోయింది నేను కదా... అని కార్తీక్ అనడంతో మోనిత ఏం చెప్పాలో తెలియక బిక్కముఖం వేసింది.

    మన పెళ్లి ఎప్పుడైంది అంటూ

    మన పెళ్లి ఎప్పుడైంది అంటూ


    అయితే మోనితను కార్తీక్ ప్రశ్నిస్తూ.. మోనితతో నీ పెళ్లి ఎప్పుడు జరిగిందని ప్రియమణి అడిగిందని కార్తీక్ అన్నాడు. ఇంతకు మనకు పెళ్లి ఎప్పుడైంది? ఆనంద్‌ను చూస్తే.. ఒక సంవత్సరం వాడిలా కనిపిస్తున్నాడు. మనకు కరెక్ట్‌గా పెళ్లి జరిగితే.. పది, పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉండేవారు కదా... మన పెళ్లికి మా పేరెంట్స్ ఒప్పుకోలేదా? అని కార్తీక్ ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే అందరి మాదిరిగా 21 ఏళ్లకే మన పెళ్లి కావాలానా? కార్తీక్.. మనకు ఆలస్యమైంది అంటూ మోనిత కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతో నేను ఏది అడిగినా ప్రశ్నలకు ప్రిపేర్ వచ్చింది అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు

     నిజం దాస్తున్నావని తెలిస్తే..

    నిజం దాస్తున్నావని తెలిస్తే..


    మోనితను మళ్లీ ప్రశ్నిస్తూ.. ప్రియమణికి దీప గురించి తెలుసా? అని అడిగితే.. ఆమె నీకు ఎప్పుడు కలిసిందని ఎదురు ప్రశ్న వేసింది. రాత్రి వాకింగ్‌కు వెళ్లినప్పుడు ప్రియమణి కలిసింది. రాత్రి చెబుదామని అనుకొన్నాను. కానీ కుదర్లేదు అని కార్తీక్ చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య దీప గురించి డిస్కషన్ రాలేదన్నమాట అని మోనిత ఊపిరిపిల్చుకొన్నది. ప్రియమణి గురించి నా వద్ద ఏదో దాచేస్తున్నావు. నా గతం గురించి నీవు చెప్పింది వేరు.. అప్పడప్పుడు నాకు తెలుస్తుంది వేరు. అందుకే నాకు అనుమానం అని కార్తీక్ అన్నాడు. దాంతో నేను ఏమీ దాయడం లేదు అని మోనిత చెప్పింది. దాంతో లేదా నీవేమైనా అబద్దం చెబుతున్నావని, నిజం దాస్తున్నావనే విషయం తెలిస్తే.. నాలో రాక్షసుడిని చూస్తావు.. జాగ్రత్త అని మోనితకు కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తూ వెనక్కి తిరిగి చూసి.. ఇది శాంపిల్ మాత్రమే.. నిజం నీ నుంచే చెప్పిస్తాను అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు.

    వాణిపై దుర్గకు అనుమానం

    వాణిపై దుర్గకు అనుమానం


    మోనిత గురించిన విషయాలు చెబుతూ వాణి, దుర్గ వెళ్తుంటే.. అంతలోనే పోలీసులు వచ్చారు. పోలీసులను చూడగానే దుర్గ పక్కకు వెళ్లి చెట్టు చాటున దాక్కొన్నాడు. అదే పోలీసులను చూసి వాణి కూడా కారు చాటున నక్కింది. పోలీసులు వెళ్లిన తర్వాత వెంటనే ..నేను చిన్న క్రిమినల్‌ను..నేను దాక్కొన్నానంటే కారణం ఉంది. కానీ వాణి ఎందుకు దాక్కున్నది? అనే అనుమానం దుర్గలో కలిగింది. అదే అడిగితే.. నీవు దాక్కొన్నావని .. నేను దాక్కొన్నాను అని వాణి చెప్పింది. అయితే వాణి ఏదో దాచేస్తున్నదనే అనుమానం దుర్గలో బలంగా కలిగింది.

     శౌర్య వద్దకు దీప, కార్తీక్

    శౌర్య వద్దకు దీప, కార్తీక్


    ఇక శౌర్య కోసం వెతుకుతూ వెళ్తున్న కార్తీక్, దీపకు ఇంద్రుడు ఎదురు పడ్డాడు. ఇంద్రుడిని చూసి మనం వెతుకుతున్నది ఇతనే.. ఒకరోజు ఆటోలో వెళ్తుంటే.. ఇతని ఫోన్‌లోనే అమ్మాయితో మాట్లాడాను డాక్టరు బాబు అని దీప చెప్పింది. దాంతో డాక్టర్ బాబు, వంటలక్క అంటే.. శౌర్య తల్లిదండ్రులు వీరే అన్నమాట అని ఇంద్రుడు అనుకొన్నాడు. దాంతో మరి అమ్మాయి ఎక్కడ అంటే.. మొన్ననే పెద్ద మనిషి అయింది. రేపు స్నానం చేయిస్తున్నాం. మీరు రండి అని ఇంద్రుడు చెప్పాడు. దాంతో సరే.. ఇప్పడే మీ ఇంటికి వెళ్దాం పద అని ఇంద్రుడిని తీసుకొని దీప, కార్తీక్ బయలు దేరారు.

     కార్తీకదీపం రేటింగ్ ఇలా..

    కార్తీకదీపం రేటింగ్ ఇలా..


    కార్తీకదీపం సీరియల్‌లో ఇంకా టాప్ స్థానంలోనే కొనసాగుతున్నది. లేటెస్ట్ ర్యాంకింగుల విషయంలోకి వెళితే.. కార్తీకదీపం 11.56 రేటింగ్‌తో టాప్‌లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో గుప్పెడంత మనసు 10.35 రేటింగ్‌తో రెండో స్థానంలో, గృహలక్ష్మి సీరియల్ 9.65తో మూడో స్థానంలో ఉంది.

    English summary
    Karthika Deepam October 26th Episode number 1493.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X