Bigg Boss Wild Cards: బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీల ట్విస్ట్.. ఇంట్లోకి ఇద్దరు మాజీ టాప్ కంటెస్టెంట్లు?

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఆసక్తికరంగా సాగడమే కాకుండా రికార్డు స్థాయి టెలివిజన్ రేటింగ్‌ (TRP) ను నమోదు చేస్తున్నది. గత రెండు సీజన్లను ప్రేక్షకులను నిరాశకు గురి చేయడంతో తాజా సీజన్ అంటే.. బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్‌ను జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారు. డబుల్ హౌస్, డబుల్ డోస్ అనే కాన్సెప్ట్‌తో కామన్ మ్యాన్స్, సెలబ్రిటీలకు మధ్య వార్ క్రియేట్ చేశారు. అయితే ఈ షోను కంటెస్టెంట్లు తమదైన శైలిలో రక్తి కట్టిస్తున్నారు. ఈ గేమ్‌ను మరింత క్రేజీగా మలిచేందుకు వైల్డ్ కార్డులను సిద్దం చేశారు. వైల్డ్ కార్డులో ఎవరు వస్తున్నారు? బిగ్ బాస్ 2.0 ఎప్పుడు ఉంటుంది అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 9 రియాలిటీ షోకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభ్యమవుతున్నది అని హోస్ట్ నాగార్జున వెల్లడించారు. కంటెస్టెంట్ సంజన గల్రానీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బిగ్‌బాస్ తెలుగు 9 షో మొదలైన తర్వాత స్టార్ మా ఛానెల్ దేశంలోనే నంబర్ వన్ ఛానెల్‌గా మారింది. దానిని బట్టి ఈ షోకు ఎంత పాపులారిటీ ఉందో మీరే ఊహించుకోండి అంటూ హోస్ట్ క్లారిటీ ఇచ్చారు. దాంతో కంటెస్టెంట్లందరూ తమ ఆటకు మంచి గుర్తింపు వస్తుందనే ఆనందంలో మునిగిపోయారు.

twist of Wild Card Entries into Bigg Boss Telugu 9

ఇక బిగ్‌బాస్ తెలుగు తాజా సీజన్‌లో 2.0 ఈవెంట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్‌ను అక్టోబర్ రెండో వారంలో గానీ.. మూడో వారంలో గానీ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మరో 5 గురు కంటెస్టెంట్లను ఇంటిలోకి వైల్డ్ కార్డు ద్వారా పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ వైల్డ్ కార్డుల ద్వారా ఇంట్లోకి వెళ్లే వారి పేర్లు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్లుగా మారే యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేర్లు ఇప్పటికే భారీగా ప్రచారంలో ఉన్నాయి. వారిలో అలేఖ్య చిట్టి పికిల్స్, దివ్వెల మాధురి, టీవీ యాక్టర్ సుహాసిని, కావ్య, గత సీజన్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ బాయ్‌ఫ్రెండ్ శివ పేరు కూడా వినిపిస్తున్నది. కామన్ మ్యాన్ కేటగిరి నుంచి నాగ ప్రశాంత్ పేరు కూడా వినిపిస్తున్నది. వీరిలో ఐదుగురు ఇంట్లోకి రావోచ్చని తెలిపారు.

ఇదిలా ఉండగా, గత సీజన్లలో టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్లను కూడా మరోసారి షోలోకి ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇంటిలోకి వచ్చిన హీరో తనీష్.. టెలివిజన్ యాక్టర్ అమర్ దీప్‌ను మరోసారి ఇంట్లోకి పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏది ఏమైనా వైల్డ్ కార్డు ఎంట్రీలు షోను మరింత ఆసక్తికరంగా మార్చే అవకాశం ఏర్పడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X