Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షోలోకి రెండు జంటలు.. ఆ రూమ్స్‌లో రొమాన్స్ చేసేలా!

బుల్లితెరపైకి వచ్చిన కొత్తలోనే సెన్సేషన్ అయిన ఏకైక షోనే బిగ్ బాస్. వినూత్నమైన కాన్సెప్టుతో రూపొందిన ఇది.. చాలా తక్కువ సమయంలోనే అదిరిపోయే స్పందనను అందుకుంది. దీంతో చాలా భాషల్లోకి వచ్చింది. ముఖ్యంగా తెలుగులో ఇది సంచలనంగా మారిపోయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడింటిని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇందులో రెండు జంటలు పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

రికార్డులు బ్రేక్ చేసింది
తెలుగు ప్రేక్షకులు గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అయినా బిగ్ బాస్ ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఒక ఓటీటీ, ఏడు రెగ్యూలర్ సీజన్లను పూర్తి చేశారు. వీటన్నింటికి రికార్డు స్థాయిలో రేటింగ్ కూడా వచ్చి దేశంలోనే ఇది టాప్ షోగా నిలిచింది.

Two Celebrity Couples Likely Entry To Bigg Boss Telugu 8 Show

కొత్త కాన్సెప్టు సిద్ధంగానే
బిగ్ బాస్ షోలో వచ్చిన సీజన్లను ఒకే రకమైన కంటెంట్‌తో తీసుకు వచ్చారు. ఫలితంగా ఆరో సీజన్ నుంచి దీనికి రేటింగ్ పడిపోయింది. దీంతో ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తీసుకు వచ్చి సక్సెస్ చేసుకున్నారు. ఇదే ఊపులో ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం మరో కొత్త కాన్సెప్టును రెడీ చేస్తున్నారని తెలిసింది. దీంతో ఈ సీజన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ఎనిమిదో సీజన్ త్వరగా
బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ తర్వాత రెండో దాన్ని గత ఏడాది ప్రసారం చేయలేదు. దీంతో ఈ సంవత్సరం కచ్చితంగా దీన్ని ప్రసారం చేస్తారని అనుకున్నారు. కానీ, దీన్ని ఈ సారి కూడా రద్దు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఎనిమిదో సీజన్‌ను మరింత ముందుగానే తీసుకు రావాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ సీజన్‌ అప్పుడే హాట్ టాపిక్ అయిపోతోంది.

ఆ పనులపై ఫోకస్ చేసి
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై హైప్ క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని వీలైనంత త్వరగా మొదలు పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌ను ఆగస్టు మొదటి వారం నుంచే స్టార్ట్ చేయబోతున్నారట. ఇందులో భాగంగానే నిర్వహకులు కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్ వర్క్ గురించి ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా త్వరలోనే పనులు షురూ చేస్తారని టాక్.

అలా హైలైట్ చేయాలి
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కాంట్రవర్శీల్లో ఉన్న కొందరు సెలెబ్రిటీలను తీసుకు వస్తున్నారట. అందులోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న సోషల్ మీడియా ప్రముఖులపై ఎక్కువగా ఫోకస్ చేశారని తెలిసింది.

రెండు జంటలను పంపి
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లోకి ఏకంగా నిర్వహకులు రెండు జంటలను తీసుకు వస్తున్నారట. అందులో ఒకరు బుల్లితెరపై సందడి చేసిన జంట కాగా, మరొక జోడీ సినిమాలకు సంబంధించినది అని తెలిసింది. వీళ్ల రొమాన్స్ పండేలా వీళ్లకు స్పెషల్ రూమ్స్ కూడా కేటాయిస్తారని మరో న్యూస్ లీకైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X