Bigg Boss Voting : లాస్ట్ మినిట్‌లో బిగ్‌బాస్ షాకింగ్ ట్విస్ట్ .. ఈ వారం ఇద్దరు ఔట్?
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో భాగంగా మరో రెండ్రోజుల్లో 12వ వారం ముగియనుంది. మరికొద్దివారాల్లోనే ఈ మెగా రియాలిటీ షోకు కూడా ఎండ్ కార్డ్ పడనుంది. ఈ సీజన్‌కే చివరి మెగా చీఫ్ టాస్క్ ప్రస్తుతం హౌస్‌లో జరుగుతోంది. మరి లాస్ట్ మెగా చీఫ్ ఎవరు? ఈ సీజన్ విజేత ఎవరు కాబోతున్నారు? అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. గత వారం ఎవరూ ఎలిమినేషన్ కాకపోవడంతో 12వ వారం ఎవరు హౌస్‌ను వీడనున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ వివరాల్లోకి వెళితే..
నిన్నటి ఎపిసోడ్‌లో మెగా చీఫ్ టాస్క్‌లో టేస్టీ తేజ విజయం సాధించగా.. ఇవాళ మరో గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. అదే ఆటో గేమ్.. ఆటో ఎక్కి చివరి వరకు అందులో ఎవరుంటారో వాళ్లే గెలిచినట్లు. ముందుగా తేజ, రోహిణి, యష్మిలు కిందపడిపోయారు. ఈ గేమ్‌లో రోహిణి - విష్ణుప్రియల మధ్య గొడవ జరిగింది. నువ్వు ఇన్ని రోజులు హౌస్‌లో ఉన్నది వేరే దాని వల్ల అంటూ రోహిణి రెచ్చగొట్టింది. ఫస్ట్ నిఖిల్‌కి ట్రై చేశావ్, తర్వాత పృథ్వీకి ట్రై చేశావ్ అంటూ విష్ణు బండారాన్ని బయటపెట్టింది. మొత్తానికి ఒక్కొక్కరిని ఆటోలో నుంచి తోసేసి పృథ్వీ ఎక్కువ పాయింట్లు సాధించాడు.

ఇక మెగా చీఫ్ ఎవరో తేల్చేందుకు చివరిగా కుండ జాగ్రత్త అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో రోహిణి, పృథ్వీ, తేజ ఆడారు. దీని ప్రకారం సీసా మీద కంటెస్టెంట్ నిలబడగా.. అవతలి వైపున కుండ పెడతారు. బజర్ మోగినప్పుడు ప్రతిసారి ప్రత్యర్ధి కంటెస్టెంట్ కుండలో ఇసుక పోయాలి. ముందే తేజ పడిపోగా.. పృథ్వీ, రోహిణి మాత్రం హోరాహోరీగా తలపడ్డారు. కానీ పృథ్వీ చివరికి చేతులెత్తేయగా.. రోహిణి మెగా చీఫ్ అయ్యింది. ఈ సీజన్‌కే చివరి మెగా చీఫ్‌గా రోహిణి చరిత్ర సృష్టించింది.
అయితే గెలిచిన వెంటనే ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది. చివరికి అంతా కలిసి రోహిణిని మెగా చీఫ్ గద్దెపై కూర్చోబెట్టారు. అయితే ఈ సీజన్‌లో ఒక్కసారిగా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ, టేస్టీ తేజలు బాధపడ్డారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ అంతా వచ్చి వారిని ఓదార్చారు. పృథ్వీ ఆటతీరును మెచ్చుకుంటూ బిగ్‌బాస్ కూడా నాలుగు మాటలు చెప్పాడు. మొత్తానికి జీరో అని అందరితో అనిపించుకున్న రోహిణి.. ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌కే ఆఖరి మెగా చీఫ్‌గా నిలిచింది.
ఇకపోతే.. మొత్తంగా 12వ వారం నామినేషన్స్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు నబీల్, యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ. ఆన్‌లైన్‌లో జరుగుతున్న అనధికారిక ఓటింగ్ ప్రకారం.. ప్రేరణ, నిఖిల్‌లు దాదాపు 24 శాతం ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచారు. తర్వాత యష్మి గౌడ (18 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో నిలిచారు. అనంతరం నబీల్ (16 శాతం), పృథ్వీరాజ్ శెట్టి (14 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈ వారం ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లు హౌస్‌ను వీడనున్నారట. వారెవరు? నిజంగానే ఇద్దరు ఎలిమినేట్ అవుతారా? అన్నది తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











