‘బిగ్ బాస్’ సెన్సేషన్: ఈ వారం ఒకరు కాదు ఇద్దరు ఔట్.. వాళ్లిద్దరికే తక్కువ ఓట్లు.!
వరుసగా రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'. ఈ ఉత్సాహంతోనే మూడో సీజన్‌ను కూడా ప్రారంభించింది. గత సీజన్ల మాదిరి కాకుండా ఈ సారి కొంచెం ముందుగానే ఇంట్లో గొడవలు ప్రారంభం అయ్యాయి. దానికితోడు, ఏడుపులు, పెడబొబ్బలతో హౌస్‌లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎలిమినేషన్ సమయంలో కొంచెం నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ తరణంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ఒక్కొక్కరిని పిలిచి
సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇందుకోసం ‘బిగ్ బాస్' ఒక్కో కంటెస్టెంట్‌ను కన్‌ఫెషన్ రూంకి పిలిచి.. నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరి పేర్లను, అందుకు కారణాలను వెల్లడించాలని ఆదేశించాడు. అయితే, ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తమన్నాను నామినేట్ చేయడానికి వీలు లేదని చెప్పాడు.

చరిత్రలో తొలిసారి
నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చే కంటెస్టెంట్లుగా శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు నామినేట్ అయ్యారు. ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ కావడం షో చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకపోవడంతో ఏమౌతుందా అన్న ఆసక్తి కనిపిస్తోంది.

ఈ వారం ఇద్దరు?
ఎనిమిది మంది నామినేషన్‌కు రావడంతో ఈ సారి రెండు ఎలిమినేషన్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఈ మేరకు ‘బిగ్ బాస్' యూనిట్ నిర్ణయం కూడా తీసుకుందని ఓ వార్త బయటకు వచ్చింది. గత సీజన్లలో ఇలాంటి పరిణామాలు చాలా జరిగాయి. అంటే శనివారం ఒకరు, ఆదివారం ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారని అంటున్నారు.

వాళ్లిద్దరే అని టాక్
శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లలో ఈ సారి ఇద్దరు వెళ్లిపోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరా ఇద్దరు అని అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పోలవుతున్న ఓట్లను బట్టి జాఫర్, వితికి ఈ సారి ఇంటి నుంచి బటయకు వెళ్లిపోతారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ
సీనియర్ నటి హేమ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఈ సారి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు. ఇందులో భాగంగానే ఓ హాట్ హీరోయిన్‌తో చర్చలు జరుపుతుందట స్టార్ మా యాజమాన్యం.


Click it and Unblock the Notifications











