ఇద్దరు టీవీ తారల దుర్మరణం.. షూటింగ్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. మరో ఇద్దరికి గాయాలు
Recommended Video
తెలుగు టెలివిజన్ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ముత్యాల ముగ్గు సిరియల్‌కు సంబంధించిన ఇద్దరు వర్థమాన తారలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరు మృత్యువాత పడ్డారు. ఈ కారు ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కావడంతో ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ వార్తతో టెలివిజన్ నటులు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వివరాల్లోకి వెళితే...

షూటింగ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా
ముత్యాల ముగ్గు టెలివిజన్ సీరియల్ షూటింగ్ కోసం వికారాబాద్ జిల్లాలోని అడవులకు యూనిట్ వెళ్లింది. అనంతగిరి ప్రాంతంలో షూటింగ్ కోసం వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి అనంతగిరికి వెళ్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. హఠాత్తుగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోగా చెట్టును ఢీకొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకొన్నది.

ఇద్దరు టెలివిజన్ తారలు మృతి
కారు ప్రమాదంలో ముత్యాల ముగ్గు సీరియల్‌లో నటిస్తున్న టీవీ తారలు భార్గవి, అనుషారెడ్డి అక్కడికక్కడే మరణించారు. భార్గవి నిర్మల్‌కు చెందిన యువతిగా, అనుషారెడ్డి భూపాల్‌పల్లి జయశంకర్ జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. తమ యూనిట్‌కు చెందిన ఇద్దరు సభ్యులు మృత్యువాత పడటంతో వారంతా షాక్ గురయ్యారు.

లారీని తప్పించబోయి.. చెట్టుకు ఢీకొట్టి
కారు ప్రమాదం జరిగినప్పుడు అందులో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఎదురుగా రావడంతో లారీని తప్పించే ప్రయత్నం చేశారు. కానీ కారు అదుపు తప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన చేవెళ్ల సమీపంలోని అప్పారెడ్డి గూడ బస్టాప్ వద్ద జరిగింది అని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
గాయపడిన ఇద్దరిని హాస్పిటల్‌కు తరలింపు
కారు ప్రమాదంలో కారు డ్రైవర్ చక్రి, కారులో ప్రయాణిస్తున్న వినయ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వీరిని వెంటనే ప్రత్యేక వాహనంలో చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











