‘నారీ నారీ నడుమ మురారి’అంటున్న ఉదయ భాను

By Srikanya

Nari Nari Naduma Murari
హైదరాబాద్: శేఖర్ కమ్ముల "లీడర్ " లో రాజశేఖరా అంటూ.. రాజకీయ నాయకుల రంగసానిగా ఉదయభాను చేసినది. ఐటం సాంగ్ చేసింది. అదే రీతిలో మొన్నీ మధ్య అల్లు అర్జున్ తో జులాయి లోనూ ఓ ఐటం సాంగ్ చేసి పారేసింది. ఓ ప్రక్క ఇలా సినిమా తెరను వేడిక్కిస్తున్న ఈమె బుల్లి తెరపై మహా రాణి అని చెప్ప వచ్చు. ఆమె పోగ్రాంకి యాంకరింగ్ చేసిదంటే ఆ పోగ్రాంకి టీఆర్పీలు ఓ రేంజిలో ఉంటాయని ఛానెల్స్ వారు,పోగ్రాం డిజైనర్స్ ఫిక్సై పోతున్నారు.

తన హొయిలుతో,మాటకారితనంతో అదరకొట్టే ఉదయభాను తో తాజాగా 'నారీ నారీ నడుమ మురారి' అనే వినూత్న కార్యక్రమానికి జీ తెలుగు చానల్ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. దీనికి సంబంధించిన ప్రతి ఎపిసోడ్‌లోనూ ఒక మేల్ సెలబ్రిటీ, ఇద్దరు ఫిమేల్ సెలబ్రిటీలు పాల్గొంటారు. మేల్ సెలబ్రిటీ కోసం ఫిమేల్ సెలబ్రిటీస్ పోటీపడటం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

ఆటపాటల అల్లరితో ఆద్యంతం సరదాగా సాగిపోయే విధంగా ఈ కార్యక్రమం మలచబడిందని జీ తెలుగువారు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉదయభాను వ్యాఖ్యానం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ పోగ్రాంని ఆమె తనదైన శైలిలో రక్తి కట్టిస్తుందని పోగ్రాం డైరక్టర్స్ నమ్మకంగా ఉన్నారు. అన్ని హంగులతో, ఆకర్షణలతో బుల్లితెర వీక్షకులను ఆకట్టుకునే విధంగా పూర్తి వినోదభరితంగా రూపొందుతోన్న ఈ కార్యక్రమం తప్పకుండా అందరికీ నచ్చుతుందని జీ యాజమాన్యం నమ్మకం వ్యక్తం చేశారు.

ఇక నారీ నారి నడుమ మురారి టైటిల్ తో బాలకృష్ణ ఓ చిత్రం చేసారు. కోదండరామిరెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్. జంద్యాల రచన చేసిన ఈ చిత్రంలో నిరోష,శోభన నటించారు. ఇప్పుడీ పోగ్రాంకి ఆ టైటిల్ పెట్టడంతో అందరికీ ఈ సినిమా గుర్తుకు వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X