25 ఏళ్లుగా వెంటాడుతోన్న బాధ... యాంకర్ ఉదయభాను ఎమోషనల్

తెలుగు బుల్లితెరపై యాంకరింగ్‌కు స్టార్ స్టేటస్ తీసుకొచ్చారు ఉదయభాను. ఇప్పుడంటే సుమ కనకాల స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు కానీ.. ఒకప్పుడు యాంకరింగ్‌కు పర్యాయ పదంలా మారి ఎంతోమంది యాంకరింగ్‌ వైపు అడుగులు వేసేలా చేశారు ఉదయభాను. అందం, చలాకీతనంతో ఓ దశాబ్ధం పాటు తెలుగు బుల్లితెరను ఏలారు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు ఇలా ఎక్కడ చూసినా ఉదయభానునే కనిపించేవారు. కొన్ని సినిమాలలో కూడా ఆమె నటించారు. ఏమైందో ఏమో కానీ ఉదయభాను ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవలి కాలంలో మళ్లీ యాక్టీవ్ అయ్యారు. మొన్నామధ్య తనను టాలీవుడ్‌లో తొక్కేశారని, ఇండస్ట్రీలో సిండికేట్లు తయారయ్యాయంటూ ఉదయభాను చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం ఓటీటీలు, వెబ్‌సిరీస్‌లలో సత్తా చాటుతూ వరుస ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నారు ఈ స్టార్ యాంకర్.

సినిమాలతో ఎంట్రీ
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఉదయభాను. తొలుత సినీరంగంలో అడుగుపెట్టారు. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యంలో ఆమె నటించారు. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రవణ మాసంతో పాటు పలు కన్నడ , తమిళ చిత్రాల్లో తన అదృష్టం పరీక్షించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బుల్లితెర రంగం భారతదేశంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్న దశలో టీవీకి ఉన్న భవిష్యత్తును, పాపులారిటీని ఊహించిన ఉదయభాను.. యాంకర్‌గా టర్న్ అయ్యారు.

Udaya bhanu Gets Emotional Recalling Her College Days and Life-Changing Decisions

ఇండస్ట్రీకి దూరమైన ఉదయభాను
అలా విధి ఆమెను సినీరంగం నుంచి యాంకరింగ్ వైపు నడిపించింది. తెలుగు బుల్లితెరపై తొలితరం యాంకర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. హృదయాంజలి, వన్స్ మోర్ ప్లీజ్‌ తదితర కార్యక్రమాలతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. యాంకర్ అంటే ఉదయభాను.. ఉదయభాను అంటే యాంకర్ అన్నంతగా జనం హృదయాలలో నిలిచిపోయారు. సినిమా ఈవెంట్స్, టీవీ కార్యక్రమాలు, నటనతో కెరీర్ పరంగా ఆమె పీక్స్ చూశారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఉదయభాను ఆకస్మాత్తుగా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయారు. కానీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

సినిమాలలో రీ ఎంట్రీ
2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. మిద్దె విజయేంద్ర మౌళి అనే వ్యక్తిని పెళ్లాడిన ఉదయభానుకి ఇద్దరు కుమార్తెలు. భూమి ఆరాధ్య , యువి నక్షత్ర. ప్రస్తుతం భర్త , పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ.. రీఎంట్రీలో కేవలం సినిమాలపైనే ఫోకస్ చేశారు. ప్రతినిధి 2, త్రిబాణధారి బార్బరిక్ సినిమాలలో నటించారు.

డాటరాఫ్ ప్రసాదరావు కనబడుట లేదు‌లో పోలీస్‌గా
ఉదయభాను కీలకపాత్ర పోషించిన మూవీ.. డాటరాఫ్ ప్రసాదరావు కనబడుట లేదు వెబ్ సిరీస్ ‌ఫిబ్రవరి 27 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజీవ్ కనకాల, వసంతిక, శ్రీరామ్, హిమబిందు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సౌతిండియా స్క్రీన్స్ బ్యానర్‌పై కేవీ శ్రీరామ్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించగా.. కృష్ణ పోలారు దర్శకత్వం వహించారు. శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా... చంద్రశేఖర్ జీవీ ఎడిటింగ్, రామ్ కే మహేశ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్‌లో ఉదయభాను కీలకవ్యాఖ్యలు చేశారు.

25 ఏళ్ల ఫ్లాష్‌బ్యాక్‌లోకి అలా
మిమ్మల్ని అంతా ఇలా కలుసుకోవడం మాటల్లో చెప్పలేను. 25 ఏళ్ల క్రితం నాటి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నా మిమ్మల్ని చూస్తుంటే. హృదయాంజలి కార్యక్రమం కోసం మైక్ పట్టుకుని తిరగడం, కాలేజీలకు వెళ్లడం గుర్తొస్తోంది. ఆ టైంలో నేను 10వ తరగతి అయిపోయి ఇంటర్ జాయిన్ అవ్వాలి, ఇంటర్ జాయిన్ అవ్వకుండా పెన్ను బదులు మైక్ పట్టుకున్నా. కాలేజీ రోజుల్ని ఎప్పటికీ మిస్ అవుతా.. కాలేజీలో ఉన్న అమ్మాయిల్ని ఎవర్ని చూసినా నేను మీలో ఒకరిగా అక్కడ కూర్చొంటా. ఈ డాటరాఫ్ ప్రసాదరావు కనబడుట లేదు ఎలా అనిపించింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిసారి నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూనే ఉన్నానని ఉదయభాను తెలిపారు.

ఇలాంటి స్టోరీలు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీసేవికావు, మనతో మనం మాట్లాడుకునేవి, సోసైటీతో మనం చేసే సంభాషణలాంటివి. ఇలాంటి కథలు మనకు కొన్ని నేర్పిస్తాయి. మనల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే మనకి చాలా చెబుతాయి. ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇలాంటి స్టోరీలన్నీ నిశ్శబ్ధంలోంచి మొదలవుతాయి. ఎప్పుడైతే మనం ఈ నిశ్శబ్ధాన్ని బ్రేక్ చేస్తామో ఇలాంటి కథలు పుట్టవు. మీ అందరిలోనూ ఒక స్వాతి ఉంటుంది.. అది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి కథలో భాగం కావడం కూడా నటీనటులకు ఒక బ్లెస్సింగ్ లాంటిదే. పేరెంట్స్‌ని కదిలించి, ఆడపిల్లలను ఇన్‌స్పైర్ చేస్తుందని ఉదయభాను అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: udaya bhanu rajeev kanakala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X