నా జీవితంతో ఆడుకున్నారు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్

తెలుగు టెలివిజన్‌లో యాంకరింగ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న కాలాన్ని గుర్తు చేసుకుంటే, ముందుగా గుర్తొచ్చే పేరు ఉదయభాను. దాదాపు పదిహేనేళ్ల క్రితం చిన్న తెరపై యాంకర్లకు ఉన్న గౌరవం, స్థానం ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ సమయంలో యాంకరింగ్ అంటే కేవలం మైక్ పట్టుకుని మాట్లాడటం కాదు... ఒక ఆర్ట్, ఒక ఎనర్జీ, ఒక వ్యక్తిత్వం. ఈ అన్ని లక్షణాలను కలిపి ఒక ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తిగా ఉదయభాను నిలిచారు.

'డాన్స్ బేబీ డాన్స్', 'సాహసం చేయరా ఢింభకా', 'ఢీ' వంటి షోలతో ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆమె హోస్టింగ్ స్టైల్, ఎనర్జీ, స్పాంటేనియిటీ ప్రేక్షకులను టీవీకి కట్టిపడేసేవి. అప్పట్లో ఆమె కోసం ప్రత్యేకంగా షోలను చూసే ఫ్యాన్స్ ఉండేవారు అంటే అతిశయోక్తి కాదు. అయితే అంతటి విజయాన్ని అందుకున్న ఈ యాంకర్ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురయ్యాయని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Udaya Bhanu Opens Up They Played With My Career Shares Industry Struggles

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయభాను, తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. గతంలో తనకు అవకాశాలు రావడం లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా, ఆమె స్పందిస్తూ ఇండస్ట్రీలో జరిగే అంతర్గత వ్యవహారాలపై ఓపెన్ అయ్యారు. 'మనకు తెలిసిన వారు అవకాశాలు ఇవ్వాలని ప్రయత్నిస్తారు కానీ కొందరు కావాలని ఆ ఆఫర్లను అడ్డుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది' అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ, 'కొంతమంది నన్ను ప్రత్యేకంగా యాంకరింగ్ కోసం ఎంపిక చేసేవారు, కానీ అదే సమయంలో మరికొందరు కావాలని పక్కన పెట్టేవారు. అది నాకు చాలా బాధ కలిగించింది' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త యాంకర్లు, అందమైన ఫేస్‌లతో పాటు మంచి టాలెంట్‌తో వస్తున్నారని, వారూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని ఆమె అన్నారు.

తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఉదయభాను భావోద్వేగంగా మాట్లాడారు. "నేను మారుమూల గ్రామం నుంచి వచ్చాను. గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను. కేవలం 12 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇక్కడికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ఇది ఒక దశాబ్దాల ప్రయాణం" అని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ తనను జడ్జ్ చేస్తున్నారని, తన కెపాసిటీ గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్నారని బాధపడ్డారు.

ఇంకా కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ, "కొన్నిసార్లు ఈవెంట్స్ కోసం డేట్స్ ఇచ్చి, కాస్ట్యూమ్స్ రెడీ చేసుకుని కూడా చివర్లో ప్రోగ్రామ్ రద్దు అయిన సందర్భాలు ఉన్నాయి. అలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు అలాంటి విషయాలను పట్టించుకోవడం లేదు. ఇతరుల గురించి ఆలోచిస్తూ నా జీవితాన్ని ఆపాలని నేను అనుకోవడం లేదు" అని ధైర్యంగా చెప్పారు.

తన సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉన్న ఉదయభాను, ఒక ఉదాహరణతో తన భావాన్ని వ్యక్తం చేశారు. "ఒక నదిని మనం చేతితో ఆపలేం. అలాగే సూర్యుని వెలుగును కూడా అడ్డుకోలేం. కష్టపడే వారికి ఫలితం తప్పకుండా దక్కుతుంది" అని స్పష్టం చేశారు.

ఇండస్ట్రీలో పోటీ గురించి ప్రశ్నించగా, "ఇది పూర్తిగా పోటీ ప్రపంచం. నేను చేసిన షోలన్నీ ఇప్పటికీ ట్రేడ్‌మార్క్‌లా గుర్తుండటం నాకు గర్వంగా ఉంటుంది. నేను ఏ షో చేసినా ప్రాణం పెట్టి చేశాను. ఒకసారి షో కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుని బంగీ జంప్ కూడా చేశాను" అని తెలిపారు. అదే సమయంలో టీవీ యాంకర్లను, సినిమా నటులను చూసే విధానం భిన్నంగా ఉంటుందని చెప్పారు. "ఒక హీరో చేస్తే హైలైట్ అవుతుంది, కానీ మేము చేస్తే విమర్శలు వస్తాయి" అంటూ ఇండస్ట్రీలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్‌ను ఎత్తిచూపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X