Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్

ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రం అత్యధికంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమం ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. ఇక్కడి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఫలితంగా భారీ టీఆర్పీ రేటింగ్‌తో దేశంలోనే టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ నుంచి ఆరో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ముగ్గురు యాంకర్ల పేర్లు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి!

అప్పటి నుంచే ఆరో సీజన్ స్టార్ట్స్

అప్పటి నుంచే ఆరో సీజన్ స్టార్ట్స్

తెలుగులో బిగ్ బాస్ షో చరిత్ర సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఆరో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను ఎప్పుడో మొదలు పెట్టారు. ఇక, ఈ సీజన్ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రోమో రిలీజ్‌.. భారీ అంచనాలు

ప్రోమో రిలీజ్‌.. భారీ అంచనాలు

సక్సెస్‌ఫుల్ షో కావడంతో బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక, త్వరలోనే మొదలు కాబోతున్న ఆరో సీజన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవలే టైటిల్ లోగో ప్రోమోను, మంగళవారమే సీజన్‌ ప్రోమోను విడుదల చేశారు. వీటికి భారీ రెస్పాన్స్ దక్కింది. అదే సమయంలో ఈ సీజన్‌పై అంచనాలు రెట్టింపు అయిపోయాయి.

ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి

ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి

భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు పనులను దాదాపుగా పూర్తి చేశారని తెలిసింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్‌ పనులు ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం. దీన్ని గతంలో కంటే కలర్‌ఫుల్‌గా ఏర్పాటు చేశారట. ఇక, ఈ సీజన్‌లో సరికొత్త కాన్సెప్టును పరిచయం చేస్తున్నారని, టాస్కులు కొత్తగా ఉంటాయని టాక్.

 కంటెస్టెంట్ల లిస్ట్.. ఒక్కొక్కటి లీక్

కంటెస్టెంట్ల లిస్ట్.. ఒక్కొక్కటి లీక్

వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు ఎప్పుడో గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసేసింది. ఇప్పటికే ఫైనల్ లిస్టును రెడీ చేశారు. అందులోనే కొందరితో డీల్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయం తెలిసిందే.

ముగ్గురు యాంకర్లు.. సీనియర్‌తో

ముగ్గురు యాంకర్లు.. సీనియర్‌తో

ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీల పేర్లు తాజాగా లీక్ అయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సారి ఏకంగా ముగ్గురు యాంకర్లు ఎంట్రీ ఇస్తున్నారట. అందులో పరిచయం అవసరం లేని యాంకర్ ఉదయ భాను ఒకరని తెలిసింది.

బిగ్ బాస్‌లోకి ఆ న్యూస్ యాంకర్

బిగ్ బాస్‌లోకి ఆ న్యూస్ యాంకర్

బిగ్ బాస్ ఆరో సీజన్‌ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండడంతో కన్ఫార్మ్ అయిన కంటెస్టెంట్ల వివరాలు లీక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో పేరు కూడా బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఆరో సీజన్‌లో న్యూస్ యాంకర్ ప్రత్యూష కూడా భాగం అవుతుందని తెలిసింది. ఆమె ప్రస్తుతం ఓ టాప్ న్యూస్‌ ఛానెల్‌లో పని చేస్తున్న విషయం తెలిసిందే.

షోలో మరో క్రేజీ యాంకర్ కూడా

షోలో మరో క్రేజీ యాంకర్ కూడా

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పాల్గొనే మూడో యాంకర్ నేహా చౌదరి అని తెలిసింది. నటిగా, యాంకర్‌గా, స్పోర్ట్స్ ఎనలిస్టుగా, యోగా ట్రైనర్‌గా ఎంతో ఫేమస్ అయిన ఈమె ఆరో సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే ఈమెతో నిర్వహకులు ఒప్పందం కూడా చేసుకున్నారని తెలిసింది. ఇలా ఈ ముగ్గురు యాంకర్లు ఈ సీజన్‌లో సందడి చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X