నిగ్గదీసి అడగమంటున్న ఉదయభాను

హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయ్ భాను గత కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఆమె రాజకీయాల్లోకి వస్తుందో లేదో కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ ని నిలదీయమంటూ ఓ పాపులర్ టీవీ ఛానెల్ కు ఓ పోగ్రాం చేస్తోంది. ఆ పోగ్రాం పేరు నిగ్గదీసి అడుగు. ఈ పోగ్రాం ద్వారా ఆమె రాజకీయనాయుకులపై అవగాహన పెంచనుంది. తెలంగాణా, ఆంధ్రా,రాయలసీమ ఎక్కడైనా ప్రజలే బాధితులు...మాట తప్పే నాయకులను సహించవద్దు...మీ కష్టాలను నాతో చెప్పండంటూ ముందుకు వస్తోంది. టీవీ 9లో ఈ పోగ్రాం ప్రసారం కానుంది. ఈ పోగ్రాం నిమిత్తం ఆమె సామాన్యులను కలవనుంది. అందుకోసం ఆమె టూర్ వేయనుంది.

ఇక గత కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తుందంటూ ప్రచారం సాగుతున్న టీవీ యాంకర్, నటి ఉదయభాను ఈ పోగ్రామ్ తో కంక్లూజన్ కి వచ్చినట్లే అంటున్నారు. మారిన రాష్ట్ర పరిస్థితులు, తెలంగాణ ఏర్పాటు వంటి కారణాలతో ప్రస్తుతం రాజకీయ రంగమంతా గందరగోళంగా మారింది. ఈ సమయాన్నే తన రాజకీయ రంగ ప్రవేశానికి వేదిక చేసుకోవాలని భాను నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది.

Udaya Bhanu's Show on political awareness

అయితే గతంలో పలు విషయాల్లో మీడియాకెక్కిన భాను ఒక దశలో అవసరమైన సమయంలో రాజకీయ రంగంలోకి వస్తానని ఇదివరకే చెప్పింది. దీంతో ప్రస్తుతం వివిధ పార్టీలు ఆమెను తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నాయట. అయితే ఈ విషయంలో మాత్రం ఆమె ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకుందట. తన సొంత జిల్లా కరీంనగర్ లేదా హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి భాను ఆసక్తి కనపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో భాను నోరు విప్పితే గానీ ఆమె అభిమానుల ఉత్కంఠకు పుల్‌స్టాఫ్ పడదు అంటున్నారు. మరి ఈ విషయమై కూడా ఉదయభాను ఓ మాట చెప్పితే బాగుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X