Udaya Bhanu: వేధింపులతో నరకం చూశా... యాంకర్ ఉదయభాను షాకింగ్ కామెంట్స్

ఆడది అర్ధరాత్రి కాదు కదా.. పట్టపగలు పబ్లిక్‌గా తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక మూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా బాధితుల లిస్ట్‌లో ఉన్నారు. సొంత కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పరిచయస్తుల చేతుల్లో దారుణాలు ఎదుర్కోన్న వారే. తాజాగా తనకు జీవితంలో జరిగిన ఘటనను పంచుకున్నారు స్టార్ యాంకర్, నటి ఉదయభాను. ఈ వివరాల్లోకి వెళితే..

ఇప్పుడంటే సుమ, అనసూయ, శ్రీముఖి వంటి వారు స్టార్ యాంకర్లుగా చెలామణి అవుతున్నారు కానీ.. అసలు తెలుగునాట యాంకరింగ్‌కి స్టార్‌డమ్‌ను తీసుకొచ్చిన ఘనత ఉదయభానుదే. సినీరంగం నుంచి బుల్లితెర వైపు వచ్చిన ఈమె ఉమ్మడి రాష్ట్రంలో కేబుల్ ప్రసారాలు ఊపందుకుంటున్న దశలో యాంకర్‌గా ప్రేక్షకుల చేత ప్రశంసలు దక్కించుకున్నారు. అప్పట్లో ఏ టీవీ ఛానెల్ చూసినా ఉదయభాను ఉండాల్సిందే. వన్స్ మోర్ ప్లీజ్‌ సహా పలు కార్యక్రమాలతో ఆమె స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఆమెను చూసి కొత్తగా యాంకరింగ్ వైపు వచ్చిన యువత కూడా ఉన్నారు.

Udaya Bhanu Shares Shocking Childhood Experience Speaks on Social Media Impact

సినిమాలు, సినిమా ఈవెంట్స్, బుల్లితెరపై యాంకరింగ్‌తో బిజీగా గడుపుతున్న దశలో ఒక్కసారిగా వెండితెరకు, బుల్లితెరకు దూరమయ్యారు ఉదయభాను. తిరిగి ఇటీవలి కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒకటి అరా షోలు తప్పించి పెద్దగా అటు వైపు పోవడం లేదు. తన వయసు, ఇమేజ్‌కు తగిన పాత్రలు చేస్తూ సినీరంగంలోనే నిలదొక్కుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఉదయభాను కీ రోల్ పోషించిన వెబ్ సిరీస్ D/O ప్రసాదరావు కనబడుట లేదు.

ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్, హిమబిందు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సౌతిండియా స్క్రీన్స్ బ్యానర్‌పై కేవీ శ్రీరామ్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించగా.. కృష్ణ పోలారు దర్శకత్వం వహించారు. శ్రీరామ్ మద్దూరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా... చంద్రశేఖర్ జీవీ ఎడిటింగ్, రామ్ కే మహేశ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయభాను తన కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

జెన్ జీ కిడ్స్ వాళ్ల ప్రపంచంలో వాళ్లు ఉండిపోతున్నారు. పేరెంట్స్ బాగా బిజీ.. కిడ్స్ ఇంకా బిజీ. చదువుకోవడానికి వాళ్లకు ఎంత టైం దొరుకుతుందంటే.. ఆడుకోవడానికి వాళ్లకు టైం దొరకడం లేదు. ఉన్న కాసేపు కూడా టీవీలు, ఫోన్‌లు చూస్తూ గడిపేస్తున్నారు. పేరెంట్స్‌కి, పిల్లలకు కమ్యూనికేషన్ బాగా తగ్గింది. పిల్లలో జోవియల్‌గా మాట్లాడేంత టైం ఉండటం లేదు. సోషల్ మీడియాను ఎంత వరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. హెల్దీగా ఉంటే ఓకే కానీ.. సోషల్ మీడియాలో ఎంత మంచిది వెతికినా, వద్దు అంటున్నా కొన్ని దారుణాలు వస్తూనే కనిపిస్తూనే ఉంటాయి. ఎంత స్ట్రాంగ్ మైండ్ ఉంటే మనం ప్రలోభానికి లోను కాకుండా ఉంటాం. పిల్లలకు త్వరగా కోపం వచ్చేస్తుంది. నా పిల్లలతో నిద్రపోయేటప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటా. సొసైటీలో జరిగే విషయాల మీద ఎక్కువగా అడుగుతుంటారు అని ఉదయభాను తెలిపారు.

నేను ఎంత అందంగా మాట్లాడినా ఏదో ఒక తప్పును వెతుకుతూనే ఉంటారు. భయం పెట్టడం వల్ల పిల్లలు ఎక్కువగా మాట్లాడటం లేదు. చాలామంది సోషల్ మీడియా మీదే బతుకుతున్నారు. అందరం చెయ్యేస్తేనే సొసైటీ బతుకుతుంది. కాలేజీ, స్కూల్‌కి వెళ్లేటప్పుడు నా వెంటపడేవారు, ఏడిపించేవారు.. చెప్పుకుంటే ఇలాంటివి బోలెడు. మా వూరిలో నా పేరు ఎప్పుడూ మారుమోగుతూ ఉంటుంది. నా పేరు ఎప్పుడూ గోడల మీదే ఉండేది. ఓ పెద్ద గుండెకాయ, దానిలో ఉదయభాను, దానికొక బాణం ఉండేది. అసలు చాలా తలనొప్పిగా ఉండేది. ప్రతిరోజూ స్కూల్ లోపల అడుగుపెట్టే వరకు టెన్షన్‌గా ఉండేది. ఎవరు గోడ మీద ఏం రాశారోనని భయపడేదానిని. ఒకరోజు ధైర్యం చేసి ఒకడిని పట్టుకుని తిట్టేశానని ఉదయభాను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: udaya bhanu movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X