బిగ్ బాస్2: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాని.. హౌస్‌లో ఏడుపులు ఖాయం, ఎందుకంటే!

Recommended Video

బిగ్ బాస్2: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాని.. హౌస్‌లో ఏడుపులు ఖాయం!

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హౌస్ లో సంచలనాల పర్వం జోరందుకుంది. బిగ్ బాస్ 2 కి ఏదైనా జరగొచ్చు అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. అందుకు తగ్గట్లుగానే ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో నాని ఇంటి సభ్యులకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో చివరి అంకం ప్రారంభమైంది. ఇంటి సభ్యులంతా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. తాజగా విడుదల చేసిన ప్రోమోలో నాని సంచలన విషయం వెల్లడించారు.

డబుల్ షాక్

డబుల్ షాక్

ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నానంటూ ఆడియన్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే దానిని మరింత పెంచేలా నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ ఉత్కంఠ పెంచేశాడు.

 ఏదైనా జరగొచ్చు

ఏదైనా జరగొచ్చు


ఏదైనా జరగొచ్చు.. బిగ్ బాస్ 2 కి ట్యాగ్ లైన్ ఇదే. అందుకు తగ్గట్లుగానే సంచలనాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు హౌస్ లో సింగిల్ ఎమిలినేషన్ మాత్రమే చూశాం. కానియె వారం డబుల్ ఎలిమినేషన్ తో మరింత రసవత్తరంగా మారనుంది. ఈ మేరకు ప్రోమోలో నాని క్లియర్ గా చెప్పేశాడు. ఇంటినుంచి వెళ్ళిపోబోతున్న ఆ ఇద్దరు సభ్యులు ఎవరు అంటూ సస్పెన్స్ లో పెట్టేశాడు.

రెండో వ్యక్తి

రెండో వ్యక్తి

గణేష్ ఇంటి నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటివరకు ఊహాగానాలు వినిపించాయి. నాని డబుల్ ఎలిమినేషన్ అని చెప్పడంతో ఆ రెండో వ్యక్తి ఎవరనే చర్చ మొదలైంది.

వలలో పడ్డారు

వలలో పడ్డారు

అమిత, సామ్రాట్.. ఈ సీజన్ లో నామినేషన్ నుంచి ఎస్కేప్ అవుతూ వచ్చారు. కానీ ఈ వారం బిగ్ బాస్ వలకు వీరిద్దరూ చిక్కారు. గణేష్ తో పాటు బయటకు వెళ్లే మరో సభ్యలు వీరిద్దరిలో ఒకరనే చర్చ మొదలైంది.

 నూతన్ నాయుడు

నూతన్ నాయుడు

నూతన్ నాయుడు కూడా నామినేషన్ లో ఉన్నాడు. అతడిపై కూడా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ అతడికి కౌశల్ ఆర్మీ మద్దత్తు ఉండడంతో ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగిల్ ఎలిమినేషన్ కే ఎమోషనల్ అయ్యే ఇంటి సభ్యులు డబుల్ ఎలిమినేషన్ తో ఏడుపు ముఖాలు పెట్టడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X