Bigg Boss Record: రతికా ఎలిమినేషన్‌తో రికార్డు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. వాళ్లు గెలవడం కష్టమే!
సంచనాలకు కేంద్ర బిందువుగా ఉన్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే మన భాషలోకి పరిచయం అయిన దీనికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా జాతీయ స్థాయిలో రికార్డులు కొట్టేంత రేటింగ్ దక్కింది. దీంతో ఇప్పుడు ఏడో సీజన్‌ను సరికొత్త హంగులతో నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ నుంచి రతికా రోజ్ ఎలిమినేట్ అయింది. దీంతో బిగ్ బాస్‌లో రికార్డు నమోదైంది. ఆ వివరాలేంటో మీరు కూడా చూసేయండి!
నలుగురు లేడీస్ ఎలిమినేట్:ఉల్టా పుల్టా అంటూ ఆసక్తిని రేకెత్తించడంతో బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ఏడుగురు మగవాళ్లు, ఏడుగురు ఆడవాళ్లు ఉన్నారు. ఇందులో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో కిరణ్ రాథోడ్ బయటకు వెళ్లిపోయింది. రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. అలాగే, మూడో వారంలో దామిని, నాలుగో వారంలో రతికా వెళ్లిపోయారు.

ఐదో సీజన్‌లో ముగ్గురు ఔట్:బిగ్ బాస్ షో తెలుగులో ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే, ఒకే సీజన్‌లో మొదటి మూడు వారాల్లో ముగ్గురూ లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయింది ఐదో సీజన్‌లో మొదటిసారిగా జరిగింది. అప్పుడు ఫస్ట్ వీక్‌లో సరయు రాయ్, రెండో వారంలో ఉమ, మూడో వారంలో లహరి షారిలు బయటకు వెళ్లారు. కానీ, నాలుగో వారం నటరాజ్ వెళ్లాడు.
షోలో చెత్త రికార్డు నమోదు:బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఐదో సీజన్‌లో మొదటి మూడు వారాల్లో ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇప్పటి వరకూ బిగ్ బాస్ షోలో రికార్డుగా ఉండేది. అయితే, ఇప్పుడు ఏడో సీజన్‌లో ఏకంగా నలుగురు లేడీ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. దీంతో బిగ్ బాస్ చరిత్రలోనే చెత్త రికార్డు నమోదు అయింది. ఇది ఇండియాలోనే ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు.

మొదటి రెండు సీజన్‌లలో:ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ మొదటి సీజన్‌లో ఫస్ట్ వీక్‌లో జ్యోతి, రెండో వారంలో మధుప్రియ, మూడో వారంలో సమీర్‌లు, నాలుగో వారం కత్తి మహేశ్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌లో మొదటి వారంలో సంజన, రెండో వారంలో నూతన్ నాయుడు, మూడో వారంలో కిరీటి, నాలుగో వారం శ్యామలలు బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

మూడు, నాలుగు :నాగార్జున వచ్చిన తర్వాత మూడో సీజన్‌లో మొదటి వారం హేమ, రెండో వారంలో జాఫర్, మూడో వారంలో తమన్నా, నాలుగో వారంలో రోహిణిలు షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. అలాగే, నాలుగో సీజన్‌లో మొదటి వారంలో సూర్య కిరణ్, రెండో వారంలో కల్యాణి, మూడో వారంలో దేవి నాగవల్లి, నాలుగో వారంలో స్వాతి దీక్షిత్‌లు బయటకు వెళ్లిపోయారు.
ఆరులో ఇలా.. మొత్తంగా:బిగ్ బాస్ ఆరో సీజన్ విషయానికి వస్తే... ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేయడంతో రెండో వారంలో డబుల్ షాక్ ఇచ్చారు. ఫలితంగా 14వ రోజే షానీ, అభినయ బయటకు వెళ్లిపోయారు. అలాగే, మూడో వారంలో నేహా చౌదరి వెళ్లిపోయింది. నాలుగో వారంలో ఆరోహిమొత్తంగా బిగ్ బాస్ షోలో మొదటి నాలుగు వారాల ఎలిమినేషన్స్ ఇలా సాగాయి. దీంతో ఏడో సీజన్‌లో రికార్డు నమోదు అయింది.

ఇకపై వాళ్లు గెలవరేమో:తెలుగులో బిగ్ బాస్ షో ఆరు రెగ్యూలర్ సీజన్లను పూర్తి చేసుకుంది. అందులో ప్రతి దానిలోనూ మేల్ కంటెస్టెంట్లే విజేతలుగా నిలిచారు. ఒక్క ఓటీటీ వెర్షన్ సీజన్‌లో మాత్రమే బిందు మాధవి గెలిచింది. ఇక, ఇప్పుడు ఏడో సీజన్‌లో మొదటి నాలుగు వారాల్లో నలుగురు లేడీస్ వెళ్లిపోయారు. ఇదే కంటిన్యూ అయితే ఈ సీజన్‌లో కూడా లేడీ కంటెస్టెంట్ విజేత కావడం కష్టమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











