టీవీ రియాల్టీ షో: కోరిక రగిలి, ముద్దులతో రెచ్చిపోయి...
ముంబై: ఇండియన్ టెలివిజన్ రియాల్టీ షోలలో పాపులర్ అయిన ‘బిగ్ బాస్' రియాల్టీ షోలో జరుగుతున్న బాగోతాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ షోలో రొమాన్స్ డోసు పెరిగి పోయిందనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఇలాంటిది మరొకటి చోటు చేసుకుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ షోలో పాల్గొన్న ఉపేన్ పటేల్ (‘ఐ' చిత్రంలో మోడల్ జాన్ పాత్రధారి), కరిష్మా తన్నా మధ్య ఎఫైర్ హద్దులు దాటింది. ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లోనే రొమాన్స్‌కు తెరలేపారు. గత కొంత కాలంగా హౌస్ లో సన్నిహితంగా మెలుగుతున్న వీరు రాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత సరసాలు సాగిస్తున్నారు.

ఇద్దరూ రాత్రి పూట ఒకరిపై ఒకరు లిప్ లాక్ ముద్దుల వర్షం కురిపించుకున్న విషయం హౌస్ లోని సీక్రెట్ కెమెరాల్లో రికార్డయింది. ఇంకాసేపు ఉంటే పచ్చి శృంగారంలోకి దిగిపోయే వారే...కానీ తమను కెమెరాలు గమనిస్తున్నాయన్న విషయం గమనించి కోరికలు అణుకున్నారని అంటున్నారు.

వాస్తవానికి ఇద్దరికీ రియల్ లైఫ్‌లో....వేర్వేరు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. గత కొంత కాలంగా బిగ్ బాస్ హౌస్ లో గడుపుతున్న ఇద్దరి మధ్య స్నేహం కాస్త ఒకరంటే ఒకరు ఇష్టపడేంతగా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఒంటరితనం భరించలేక ఇద్దరు దగ్గరయ్యే ప్రయత్నం చేసారని, దాని ఫలితమే ఈ ముద్దుల భాగోతం అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











