దేత్తడి హారిక చుట్టూ రాజకీయాలు: ఆమె ఎంపికపై ట్విస్టులు.. ఆ అమ్మాయిలను కాదని ఇలా చేయడంతో!
సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను దక్కించుకుంటున్నారు. తద్వారా ఎన్నో అవకాశాలను అందుకుంటున్నారు. అలాంటి వారిలో అలేఖ్య హారిక ఒకరు. దేత్తడి పేరుతో వినూత్నమైన వీడియోలు రూపొందిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుందామె. ఈ కారణంగానే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో ఎన్నో ఆఫర్లు అందుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో హారికకు చుట్టూ రాజకీయాలు జరుగుతోన్నాయి. వివరాల్లోకి వెళ్తే...

అలా ఎంట్రీ ఇచ్చింది.. ఇలా పాపులర్ అయింది
సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్‌తో ఏమాత్రం అంచనాలు లేకుండానే దేత్తడి హారిక బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి రోజు నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించింది. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే.. తన వాయిస్ వినిపించింది. దీంతో తక్కువ సమయంలోనే మంచి ఆటతీరుతో ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగిపోయి మరింత పాపులర్ అయింది.

అతడితో ట్రాక్‌తో ఫేమస్.. అభికగా హాట్ టాపిక్
హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే బిగ్ బాస్ కంటెస్టెంట్లను జంటలుగా చేశాడు. ఇందులో భాగంగానే యంగ్ హీరో అభిజీత్‌తో దేత్తడి హారికకు కనెక్షన్ కుదిర్చాడు. అయినప్పటికీ షో ఆరంభంలో అతడు మోనాల్ గజ్జర్‌తో చనువుగా ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె దూరమవడంతో.. అభిజీత్‌కు హారిక బాగా క్లోజ్ అయింది. అప్పటి నుంచి ట్రాక్ నడుపుతూ 'అభిక'గా ట్రెండ్ అయ్యారు.

హారికకు మాత్రమే సాధ్యం.. బిగ్ బాస్‌లో రికార్డ్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఉన్న వాళ్లందరితో పోల్చుకుంటే దేత్తడి హారిక గేమ్‌ను బాగా ఎంజాయ్ చేస్తూ ఆడేది. తద్వారా టాస్కుల పరంగా సత్తా చాటుతుండేది. ప్రతి దానిలోనూ వందకు వంద శాతం ఇస్తూ గేమర్ అనిపించుకుంది. అంతేకాదు, ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికవడం ద్వారా ఫైటర్ అన్న పేరునూ దక్కించుకుంది. తద్వారా రికార్డును క్రియేట్ చేసింది.

బిగ్ బాస్ వల్ల భారీగా.... వరుస అవకాశాలతో
బిగ్ బాస్ ఫైనల్‌లో నిలిచిన ఐదుగురిలో హారిక ముందుగానే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, హారిక బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగింది. ఆమె రోజుకు రూ. 40 వేలు చొప్పున.. మొత్తంగా రూ. 42 లక్షలు తీసుకుందట. రెమ్యూనరేషన్‌తో పాటు బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

తెలంగాణ బ్రాండ్ అంబాసీడర్‌గా దేత్తడి హారిక
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను ఎంపిక చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమెకు నియమక పత్రం కూడా అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం హారిక తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఆ అమ్మాయిలను కాదని ఇలా చేయడం వల్ల
దేత్తడి హారికను బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపిక చేయడంపై రాజకీయాలు జరుగుతున్నాయి. దీనిపై చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. దీనికి కారణం.. తెలంగాణ నుంచి ఎవరెస్ట్, కిలిమంజారో లాంటి పర్వతాలను అధిరోహించిన మలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికైన వారణాసి మానస వంటి వాళ్లను కాకుండా ఈమెను ఎంపిక చేయడమే. దీంతో ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది.

ఆమె ఎంపికపై ట్విస్టులు.. క్లారిటీ ఇచ్చేశారు
హారికను బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపిక చేసినప్పటికీ.. వెంటనే తొలగించారని ఓ న్యూస్ హల్‌చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లారిటీ ఇచ్చారు. 'టూరిజంను ప్రమోట్ చేసుకునేందుకు తక్కువ ఖర్చుతో ప్రచారం చేస్తున్నాం. అందుకే హారికను నియమించాం. ఈ విషయంలో మంత్రులు, ఉన్నతాధికారులను సంప్రదించే ముందుకు వెళ్లాం. కొందరు గిట్టని వాళ్లు ఆమెను తొలగించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం లేదు' అంటూ చెప్పారు.


Click it and Unblock the Notifications











