బుల్లితెరపై ఉప్పెన మొదటి షో.. ఎప్పుడంటే?
ఒకప్పుడు కొత్త సినిమాలు బుల్లితెరపైకి రావాలి అంటే నెలలు గడిచేది. కానీ ఇప్పుడు మాత్రం విడుదలైన 20 రోజులకే వస్తున్నాయి. కొన్నైతే వారానికే వచ్చేస్తున్నాయి. ఇక మధ్యలో ఓటీటీ కూడా పెద్ద సినిమాలను సైతం చాలా తొందరగా లాగేస్తున్నాయి. టెలివిజన్ రంగానికి ఓటీటీ దెబ్బ గట్టిగనే పడుతొంది. ఇక ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఉప్పెన టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు మార్కెట్ లో 100కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేట్రికల్ గా విడుదలైంది. ఇక బుల్లితెరపై కూడా అదే స్థాయిలో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఏప్రిల్ 14 నుంచి నేటి ఫ్లిక్స్ లో సందడి చేయబోతున్న ఉప్పెన ఏప్రిల్ 18న టీవీల్లోకి రాబోతోంది. ఆదివారం సాయంత్రం 6గంటలకు సినిమా ప్రసారం కానుంది. మరి సినిమా రేటింగ్ ను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











