మిక్చర్ ప్యాకెట్ల డ్రెస్సులో బిగ్ బాస్ భామ.. ఊహకందని విధంగా హాట్ షో!
సోషల్ మీడియా హాట్ సెన్సేషనల్ బ్యూటి ఉర్ఫీ జావేద్ అంటే తెలియని నెటిజన్లు ఉండరనే చెప్పాలి. చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ గ్లామరస్ బ్యూటి తర్వాత టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగింది. అనంతరం బిగ్ బాస్ లో మెరిసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరికి కొంచెం కూడా ఊహకందని విధంగా డ్రెస్సులు ధరిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అలాంటి ఓ డ్రెస్ ఒకటి వేసుకుని అందంగా ముస్తాబైంది ఈ బ్యూటిఫుల్ ఉర్ఫీ.
తెలిసిన విషయమే:ఇంటర్నెట్ లో విభిన్నమైన వేషధారణతో విపరీతంగా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగిందన్న విషయం తెలిసిందే. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇందులో బాగానే రాణించిన ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

ప్రముఖ షో:బాలీవుడ్ సినీ ఇంస్ట్రీలో అనుకున్న విధంగా అవకాశాలు రాకపోయేసరికి టెలివిజన్ రంగం వైపు అడుగులు వేసింది గ్లామరస్ భామ ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి ప్రముఖ షోలో పాల్గొంది ఈ స్టన్నింగ్ బ్యూటి. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే రోల్ ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

వాటితో హైలెట్:టీవీ రంగంలో అడుగుపెట్టన ఉర్ఫీ జావేద్ వరుసగా మేరీ దుర్గా, చంద్ర నందిని, సాత్ ఫేరో కీ హేరా ఫెరీ, బేపన్నాః, జిజి మా, దయాన్, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది. 2020లో వచ్చిన 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో అడ్వకేట్ శివానీ భాటియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది. 2020లో కసౌతి జిందగీ, ఆయ్ మేరే హమ్సఫర్ తదితర సీరియళ్లు చేసి మరింతగా హైలెట్ అయింది ఉర్ఫీ.

హాట్ టాపిక్ :టీవీ రంగంలో ఎన్నో సీరియళ్లతో ఆకట్టుకున్న హాట్ సుందరి ఉర్ఫీ జావేద్ అత్యధిక ప్రజాధారణ పొందిన హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే ఛాన్స్ అందుకుంది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. హిందీ దర్శకనిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా చేసిన ఈ సీజన్ లో విభిన్నంగా గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ హాట్ టాపిక్ అయింది.
ప్రయోగాత్మక దుస్తులు:బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ లో తన బోల్డ్ నెస్ ఫలితంగా 13వ స్థానంలోనే హౌజ్ ను వీడింది బోల్డ్ భామ ఉర్ఫీ జావేద్. ఇక టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఉర్ఫీ జావేద్ 2021 నుంచి హాట్ అండ్ డిఫరెంట్ ఫొటోషూట్ లతో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రయోగాత్మక దుస్తులు ధరిస్తూ నిత్యం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతుంది.
మిక్చర్ ప్యాకెట్లతో:తాజాగా మరో కొత్త అవాతరంలో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది బిగ్ బాస్ భామ ఉర్ఫీ జావేద్. నమ్కీన్ అంటే మిక్చర్ ప్యాకెట్స్ ద్వారా కొత్త డ్రెస్ తయారు చేయించుకుంది ఉర్ఫీ. పైన స్లీవ్ లెస్ బ్లౌజ్ (బ్రా) వంటి టాప్, కింద ప్యాంట్ తో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆ మిక్చర్ ప్యాకెట్ తింటూ ఫొటోలకు పోజులిచ్చింది. ఆలూ బుజియాతో చేసిన ఈ నమ్కీన్ (మిక్చర్)ను అందరూ ఇష్టపడతారంటూ వీడియో వదిలింది. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











