విప్పుకోని తిరగడమే ఇష్టం.. నాన్న నరకం చూపించేవాడు.. టీవీ నటి షాకింగ్ కామెంట్స్!
ఇటీవల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిందన్న విషయం తెలిసిందే. దీని ద్వారా పాపులారిటీ గుర్తింపు తెచ్చుకోవడం మునుపటి రోజులకంటే సులభం అనే టాక్ ఉంది. అందుకే నేటి యువతియువకులు దీన్ని విరివిగా వాడుతూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. అందులో భాగంగానే హాట్ అండ్ స్కిన్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. విభిన్నమైన, చిత్రవిచిత్రమైన వేషధారణతో ఆద్యంతం అబ్బురపరిచే బ్యూటి ఉర్ఫీ జావేద్. టీవీ సీరియల్స్, షోల ద్వారా కంటే ఎక్కువగా ఈ సోషల్ మీడియా ద్వారా అంతర్జాతియంగా పాపులర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె తన జీవితంలో ఎన్నో కష్టాలు పడినట్లు, రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

నిర్వాహకులకు షాక్ ఇచ్చి..
చిత్ర విచిత్రమైన, డిఫరెంట్ డ్రెస్సులు ధరించి మరి అందాలను వైవిధ్యంగా ఎలాంటి సంకోచం లేకుండా ప్రదర్శించే బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ జావేద్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సినీ అవకాశాలు దొరక్క టెలివిజన్ రంగంలో వివిధ సీరియల్స్, షోలతో ఆకట్టుకుంది స్టన్నింగ్ బ్యూటి ఉర్ఫీ జావేద్. అనంతరం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో పార్టిస్ పేట్ చేసి అక్కడ కూడా బోల్డ్ నెస్ తో నిర్వాహకులకు షాక్ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే బయటకు వచ్చింది ఉర్ఫీ.

పోలీసు కంప్లయింట్స్..
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన గ్లామరస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియానే నమ్ముకుంది. విభిన్నమైన డ్రెస్సులతో, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా హాట్ టాపిక్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో సోషల్ మీడియా ఉపయోగించే వాళ్లలో ఉర్ఫీ జావేద్ అంటే తెలియని వారుండనంతగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆమె వేషధారణ, అందాల ప్రదర్శనపై అనేక రకాలుగా ట్రోలింగ్ మాత్రమే కాకుండా పోలీస్ కంప్లయింట్స్ కూడా వచ్చాయి.

అందులో 57వ స్థానం..
తనపై ఎలాంటి ట్రోలింగ్, ఫిర్యాదులు వచ్చిన లెక్కచేయకుండా దూసుకుపోయింది ఉర్ఫీ జావేద్. ఆ ట్రోలింగే తనను ఎంతో స్ట్రాంగ్ చేసిందని కూడా చెప్పుకొచ్చింది. 2021 నుంచి ఎవరు చూపించని విధంగా అందాలను ప్రదర్శిస్తూ, సామాజిక అంశాలపై కూడా మాట్లాడుతూ కాంట్రవర్సీ గ్లామర్ క్వీన్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన డిఫరెంట్ ఫ్యాషన్ వేషధారణతో గతేడాది గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం సంపాదించుకుంది.

నగ్నంగా ఉంటూ..
అంతేకాకుండా గూగుల్ 2022 జాబితాలో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వంటి హీరోయిన్లను తన వెనుక పడేసి తాను ముందు వరుసలో అంటే 57వ స్థానంలో నిలిచింది ఉర్ఫీ జావేద్. అయితే ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగిన విషయం తెలిసిందే. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ తన జీవతంలో ఎన్నో కష్టాలు పడినట్లు చెప్పుకొచ్చింది. ఇటీవల ఉర్ఫీ జావేద్ డర్టీ మ్యాగజైన్ కోసం కవర్ ఫొటోలు చేసిన విషయం తెలిసిందే. అందుకోసం విచిత్రమై దుస్తులు, హెయిర్ కలర్ తో దర్శనం ఇచ్చిన ఉర్ఫీ జావేద్ దాదాపు నగ్నంగా ఉంటూ అందాలను ఆరబోసింది.

రెండుసార్లు సూసైడ్..
ప్రస్తుతం డర్టీ మ్యాగజైన్ కవర్ ఫొటోషూట్ లో ఉన్న ఉర్ఫీ జావేద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు తెలిపింది ఉర్ఫీ జావేద్. "ఐదుగురు తోబుట్టువుల్లో నేను రెండో దాన్ని. మా అందరినీ మా నాన్న ఎప్పుడూ తిడుతూ, కొడుతూ హింసించేవాడు. మా అమ్మను కూడా నోటికి వచ్చినట్లుగా తిట్టి, కొట్టేవాడు. అమ్మతో సహా మేమంతా నరకం అనుభవించాం. ఆయన హింస తట్టుకోలేక రెండుసార్లు ఆత్మాహత్యాయత్నం కూడా చేశాను" అని ఉర్ఫీ వెల్లడించింది.

మగాడి వెంట పడితే..
ఉర్ఫీ జావేద్ ఇంకా కొనసాగిస్తూ "నాకు మోడ్రన్ గా బయటకు వెళ్లాలని ఉండేది. కానీ మా నాన్న అందుకు అంగీకరించేవారు కాదు. టీవీలో ఎప్పుడూ ఫ్యాషన్ షోలు చూడటం వల్ల నాకు ఫ్యాషన్ దుస్తులపై ఇష్టం ఏర్పడింది. నాకు పెద్దగా ఫ్యాషన్ పరిజ్ఞానం లేకున్నా ఎలాంటి వస్త్రాలు ధరించాలో కొద్దిగా అవగాహన ఉండేది. నాకు నలుగురిలో అందంగా, భిన్నంగా కనిపించాలని కోరుకుంటాను. ఏదైనా పార్టీకి వెళ్తే అందరి కళ్లూ నాపై ఉండాలనేది నా కోరిక. డబ్బుకోసం నేను ఎన్నో బాధలు పడ్డాను. ఒకప్పుడు బతకడానికి సరిపడా డబ్బు ఉండేది కాదు. కానీ నేను మాత్రం ధనవంతురాలిననే భావనలో ఉండేదాన్ని. మహిళలు ఎదగడానికి మగాడి వెంట పడితే లాభం లేదు. మనీ వెంట పడాలి" అని పేర్కొంది.

బయటకు చూపించడమే ఇష్టం..
"నాకు శరీరాన్ని బెడ్ షీట్ లో దాచుకోవాలని ఉండదు. బయటకు చూపించడమే ఇష్టం. అదే నాకు ఉన్న అవకాశం. అయితే నా దగ్గర చూపించేందుకు పెద్దగా (ఎద భాగం) ఏం లేవు. అయినా వివాదాస్పదం అవుతున్నాను. అన్నీ పెద్దగా ఉంటే ఇంకా ఎక్కడ ఉండేదాన్నో ఒక్కసారి ఊహించుకోండి. నేను శరీరంలో చూపించకూడనివి ఏం చూపించడం లేదు. అయినా కొందరికీ ఎందుకు ఇబ్బంది కలుగుతుంది. మిగతా వారిలా నేను రెచ్చగొట్టే వస్త్రధారణ కూడా చేయట్లేదు" అని ఉర్ఫీ జావేద్ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











