టీ బ్యాగులతో చేసిన డ్రెస్సులో షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటి.. లెగ్స్ అందాలు చూపిస్తూ!
హిందీ బిగ్ బాస్ ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ అంటే తెలియని నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు ఉండరు. చిత్ర విచిత్రమైన, డిఫరెంట్ డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ గ్లామరస్ బ్యూటి తర్వాత టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని విధంగా డ్రెస్సులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అలాంటి ఓ ఔట్ ఫిట్ ఒకటి వేసుకుని అందంగా ముస్తాబైంది ఈ చిన్నది.
ఫలించని ప్రయత్నాలు:సోషల్ మీడియాలో విచిత్రమైన వేషధారణ ద్వారా తెగ పాపులర్ అయిన గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇందులో బాగానే రాణించిన ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

అవనీ పాత్రతో:హిందీ చిత్ర పరిశ్రమలో ఊహించిన స్థాయిలో అవకాశాలు రాకపోయేసరికి టెలివిజన్ రంగం వైపు అడుగులు వేసింది బోల్డ్ సుందరి ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది ఈ స్టన్నింగ్ బ్యూటి. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే రోల్ ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

ధారావాహికలతో:ఇలా మేరీ దుర్గా, చంద్ర నందిని, సాత్ ఫేరో కీ హేరా ఫెరీ, బేపన్నాః, జిజి మా, దయాన్, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది ఉర్ఫీ జావేద్. 2020లో వచ్చిన 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో అడ్వకేట్ శివానీ భాటియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది. 2020లో కసౌతి జిందగీ, ఆయ్ మేరే హమ్సఫర్ వంటి సీరియళ్లు చేసి మరింత హైలెట్ అయింది ఉర్ఫీ.

బోల్డ్ మాటలు:ఇలా పలు సీరియళ్లతో అట్రాక్ట్ చేసిన గ్లామరస్ సుందరి ఉర్ఫీ జావేద్ అత్యధిక ప్రజాధారణ పొందిన హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం పొందింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో డిఫరెంట్ గా గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ వైరల్ అయింది.

విభిన్నం-ప్రయోగాత్మకం:బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ లో తన బోల్డ్ నెస్ ఫలితంగా 13వ స్థానంలోనే ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ కు హౌజ్ ను వీడాల్సివచ్చింది. ఇక టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ అండ్ డిఫరెంట్ ఫొటోషూట్ లతో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతూ హైలెట్ అయింది.
టీ బ్యాగులతో డ్రెస్సు:అలా తాజాగా మరో కొత్త అవాతరంలో దర్శనం ఇచ్చి ఆశ్చర్యపరిచింది బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి ఉర్ఫీ జావేద్. టీ బ్యాగుల ద్వారా ఒక డిఫరెంట్ ఔట్ ఫిట్ ను తయారు చేయించుకుంది ఈ సుందరి. స్లీవ్ లెస్ డ్రెస్ తరహాలో ఉన్న ఈ ఔట్ ఫిట్ లో లెగ్స్ అందాలు చూపించింది. ముందుగా టీ బ్యాగుతో టీ చేసుకున్న ఈ బ్యూటీ వాటితో చేసిన డ్రెస్సులో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











