Don't Miss!
- News
KTR: ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. చూస్తే ఆగమే ఇగ..!
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్లో Aura ఫేస్లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Finance
Amazon Air: వాయువేగంతో అమెజాన్ డెలివరీలు.. హైదరాబాద్ కేంద్రంగా.. కేటీఆర్ ఏమన్నారంటే..
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Urfi Javed అర్దనగ్నంగా ఉర్పీ జావెద్ వీరంగం.. అలా వదిలేస్తానంటూ వార్నింగ్
ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిఫరెంట్ ప్రయోగాత్మకైన డ్రెస్సులతో ఎంతగా ఉర్ఫీ కనిపిస్తుందో.. ఆమెను ట్రోల్ చేసేందుకు నెటిజన్లు సైతం అంతే సిద్ధంగా ఉంటారు. ఇక ఇటీవల కాలంలో నెటిజన్లకు ట్రోల్ చేసేందుకు దొరికిన విషయం ఉర్ఫీ జావేద్. అయితే ఈ ట్రోలింగ్ ను ఏమాత్రం పట్టించుకోనన్న ఉర్ఫీ జావేద్.. అదే తనను మరింత స్ట్రాంగ్ చేస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఎప్పుడు చూడని, కని విని ఎరగని విధంగా డ్రెస్సులు వేస్తూ.. అందాలను ఆరబోస్తూ.. కొద్దిగా దాచుతూ హల్ చల్ చేసే ఉర్ఫీ జావేద్ తాజాగా మరొక వీడియోను వదిలింది. ఇందులో ఉర్ఫీ వేషధారణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

అందుకోసం పడరాని పాట్లు..
సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ అంటే తెలియని నెటిజన్లు ఉండరు. విభిన్నమైన, చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసమే పడరాని పాట్లు పడుతుంది.

ఆశించిన స్థాయిలో..
సోషల్ మీడియా ద్వారా యమ పాపులర్ అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. అయితే ఆమె ఈ ముద్దుగుమ్మ ప్రయత్నాలు ఏవి విజయం సాధించలేదు. ఉర్ఫీ జావేద్ ఆశించిన స్థాయిలో అవకాశాలను రాబట్టుకోలేక పోయింది. దీంతో లాభం లేదనుకున్న ఉర్ఫీ టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది.

బోల్డ్ నెస్ కారణంగా..
టీవీ రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో టెలీక్యాస్ట్ అయిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గ్లామర్ షో, బోల్డ్ మాటల కారణంగా ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఫలితంగా 13వ స్థానంలో బిగ్ బాస్ హౌజ్ ను వీడాల్సి వచ్చింది.

ఉపయోగపడని షో..
బిగ్ బాస్ రియాలిటీ షోలో తాను అనుకున్నట్లు జరగకపోయేసరికి తరువాత అయినా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేసింది ఉర్ఫీ జావేద్. మళ్లీ ఆమె ప్రయత్నాలు వర్కౌట్ కాకపోయేసరికి.. మరోసారి టెలివిజన్ లోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లాలో ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్ గా పాల్గొంది. ఇందులో కూడా బోల్డ్ గా మాట్లాడి అట్రాక్ట్ చేసిన ఉర్ఫీ జావేద్ కు ఆ షో అంతగా కెరీర్ గ్రోత్ అందించలేకపోయింది.

57వ స్థానంలో ఉర్ఫీ..
ఇక టెలివిజన్ లో కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. అలా ఇటీవల గూగుల్ 2022లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం సంపాదించుకుని స్టార్ హీరోయిన్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లను వెనక్కి నెట్టేసిన ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గ్లామర్ షో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పొడవాటి జడతో కప్పేస్తూ..
తాజాగా మరొక వీడియోను వదిలిన ఉర్ఫీ జావేద్.. అందులో పై భాగం ఎలాంటి డ్రెస్ లేకుండా ఉంది. తన ఎద భాగాలను తన పొడవాటి జడతో కవర్ చేస్తూ పోజులిచ్చింది ఈ భామ. ఉర్ఫీ జావేద్ నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న తన ఇన్ల్ స్టాగ్రామ్ లో వదిలిన ఈ వీడియో నెటిజన్లు తెగ అట్రాక్ట్ చేసింది. దీంతో వివిధ రకరకాలుగా స్పందిస్తున్నారు. "మీరు ఏమైనా చెప్పండి.. ఆమె తన లుక్స్ తో ప్రతిసారీ చంపేస్తుంది" అని ఒక యూజర్ రాసుకొచ్చాడు.
జాబ్ వదిలి బార్బర్ అవుతా..
"తను ఎలాంటి డ్రెస్సు వేసుకున్నా సరే.. ఆమె కాన్ఫిడెన్స్ కు మాత్రం ఆమెను కచ్చితంగా అభినందించాల్సిందే" అని మరొక నెటిజన్ తెలిపాడు. "నేను నా ప్రభుత్వ ఉద్యోగం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. జాబ్ వదిలేసి బార్బర్ గా మారి ఆమె పొడవాటి జడను కత్తిరించాలని ఉంది" మరొకరు కామెంట్ చేశారు. "ఒక మంత్రగత్తెలా ఉన్నావ్", "నువ్ డర్టీ దుస్తులు వేసుకుంటావ్.. నీకు సిగ్గు లేదా", "అలాంటి కూతురికి జన్మనిచ్చినందుకు ఆమె తల్లిదండ్రులు పశ్చాత్తాప పడుతుంటారు" అంటూ కొందరు విమర్శిస్తే.. మరికొందరు ఉర్ఫీని పొగుడుతున్నారు.