ప్రేమికుల రోజే విడిపోయిన సినీ జంట... దేవుడు ఇలా చేశాడంటూ ట్విట్లర్లో!
ప్రేమికుల రోజే ఓ సినీ జంట విడిపోయారు. సరిగా వాలంటైన్స్ డే వారి డైవర్స్ డేగా మారింది. తమిళ టీవీ నటుడు యూతన్ బాలాజీ విషయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం ఆయన అభిమానులు కలత చెందేలా చేసింది.

బాలాజీ-ప్రీతి
తమిళ సినీ నటుడు యూతన్ బాలాజీ, ప్రితి వివాహం 2016లో జరిగింది. అయితే వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఏడాదిన్నర కాపురం తర్వాత విబేధాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రేమికుల రోజే విడాకులు
ఈ ఇద్దరూ విడాకులు అప్లై చేసుకోగా.... ఈ కేసును విచారించిన కోర్టు సరిగా ఫిబ్రవరి 14వ తేదీన వీరికి అఫీషియల్‌గా విడాకులు మంజూ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా బాలాజీ ట్విట్టర్లో ప్రేమికుల రోజే విడిపోవాల్సి వచ్చింది అంటూ ట్వీట్ చేశారు.

దేవుడు ఇలా డిఫరెంటుగా ప్లాన్ చేశారు
చాలా మంది వాలంటైన్స్ డే రోజున ఏమిటీ ప్లాన్ అని అడిగారు. కానీ దేవుడు ఈ రోజును నాకు డిఫరెంటుగా ప్లాన్ చేశాడు. అందరూ ప్రేమికుల రోజు జరుపుకుంటుంటే నేను విడాకులు తీసుకోవడానికి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అని తెలిపారు.
విడాపోయాం... హ్యాపీగానే
యస్... మేము అఫీషియల్‌గా విడిపోయాం. ఇద్దరం ఒక అండర్ స్టాండింగుతో విడాకులు తీసుకున్నాం. కానీ సంతోసంగానే ఉన్నాం. అందరికీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ బాలాజీ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











