Vadinamma ఫేమ్ సుజిత వీడియో క్లిప్లింగ్ వైరల్.. సోషల్ మీడియాలో హల్‌చల్
దక్షిణాది బుల్లితెరపై చిన్న వయసులోనే భారమైన పాత్రలతో ప్రేక్షకుల్లో భావోద్వేగాన్ని నింపుతున్న నటి సుజితా ధనుష్. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ టెలివిజన్ రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొని నటిగా విశేషమైన గుర్తింపు తెచ్చుకొంటున్నారు. బుల్లితెరమైన ఎమోషనల్‌గా కనిపించే సుజితా.. వ్యక్తిగత జీవితంలో చాలా చలాకీగా కనిపిస్తారు. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా ఆమె చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ సందర్భంగా సుజితా ధనుష్ వీడియో గురించి.. అలాగే వ్యక్తిగత జీవితంలోకి వెళితే..

బాలనటిగా సినిమా పరిశ్రమలోకి
కేరళలోని తిరువనంతపురంలో జన్నించిన సుజిత ధనుష్ తన చిన్నతనంలోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1983లో అబ్బాస్, ముందనై ముడిచు అనే తమిళ కామెడీ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆమె కెరీర్ పరంగా వెనుకకు చూసుకోలేదు. రావణబ్రహ్మ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టిన సుజిత.. చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం చిత్రంలో బాలనటిగా విశేషమైన ప్రతిభను చాటుకొన్నారు. ఆ తర్వాత తెలుగులో అరడజను పైగా చిత్రాల్లో నటించారు.

50కిపైగా సీరియల్స్‌లో
ఇక టెలివిజన్ సిరియల్ విషయానికి వస్తే 50కిపైగా సీరియల్స్‌లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, కన్నడ టెలివిజన్ రంగంలో తనదైన శైలిలో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. తిరువిలయతల, మరుధాని, భైరవి ప్రియమన్వల్, మహారాణి, బృందావనం, రోజా అక్కా థంగై, తులసి, మైథిలి, విలక్కు వాచ్చ వెరటైల్, ఓరు కై ఓసాయి లాంటి సీరియల్స్‌లో నటించారు.

వదినమ్మ సీరియల్‌తో మంచి పాపులారిటీ
ప్రస్తుతం తమిళంలో విజయ్ టెలివిజన్‌పై ప్రేక్షకాదరణ పొందిన పాండ్యన్ స్టోర్స్ టీవీ సీరియల్‌లో దానమ్‌కు వదినగా నటిస్తున్నారు. ఈ సీరియల్ సుమారు 800 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది. ఇక తెలుగులో ప్రసారమవుతున్న వదినమ్మ సీరియల్‌లో కూడా టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సీరియల్ 743 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడం గమనార్హం.

డబ్బింగ్ ఆర్టిస్టుగా
ఇక సినిమా, టెలివిజన్ అనే తేడా లేకుండా నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మెప్పు పొందారు. ఇటీవల విడుదలైన దళపతి విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో హీరోయిన్ మాళవిక మోహనన్‌కు డబ్బింగ్ చెప్పి ప్రశంసలు అందుకొన్నారు. ఇలా పలు రకాల పాత్రలతో రాణిస్తున్నారు.
నూతన సంవత్సరంలో రీల్ వీడియోతో
ఇక వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకొన్న సుజిత నూతన సంవత్సరం రోజున తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో రీల్ వీడియోను పోస్టు చేశారు. కేరళ సంప్రదాయమై దుస్తులైన చీరకట్టులో డ్యాన్స్ చేస్తూ వీడియోను షూట్ చేశారు. దానిని ఇన్స్‌టాగ్రామ్‌లో ఇది 2022లో నా తొలి రీల్ వీడియో అంటూ షేర్ చేయగా.. 82 వేల మంది లైక్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది.


Click it and Unblock the Notifications











