Sujitha: అలా నడిచొస్తూ కొంటె చూపులు ..40 ప్లస్‌లోనూ చూపు తిప్పుకోనివ్వని అందం

ఒకప్పుడు మహిళలు మాత్రమే ఇష్టపడే సీరియల్స్ ఇప్పుడు ఇంటిల్లిపాది కూర్చొని చూస్తున్నారు. కొత్త కొత్త అందాలు ధారావాహికల్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో బుల్లితెరకకు సరికొత్త గ్లామర్ వచ్చింది. సినిమా తారలతో సమానంగా నేమ్ ఫేమ్ సంపాదిస్తున్నారు బుల్లితెర నటీనటులు. ఏళ్లుగా టెలివిజన్ రంగాన్ని ఏలుతున్న నటీనటులు కొందరు ఉన్నారు. వీరిలో సుజిత ఆర్ ధనుష్ కూడా ఒకరు.

చాలా చిన్న వయసులోనే దక్షిణాది బుల్లితెరపై భారమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఏడిపించారు సుజిత. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లోనూ , సీరియల్స్‌లోనూ నటించి మెప్పించారు. కేరళలోని తిరువనంతపురంలో 1983 జూలై 12న జన్మించిన సుజిత ధనుష్ బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి - విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణంలో బాబుగా నటించింది సుజితనే.

vadinamma fame sujitha r dhanushs latest stunning photos goes viral

ఏకంగా ఐదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్ధాల సినీ జీవితంలో దక్షిణాదిలోని అందరు అగ్రనటులతో కలిసి పనిచేశారు. 1998లో దూరదర్శన్‌లో ప్రసారమైన వొరు పెన్నిన్ కథై ధారావాహిక ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టారు సుజిత. ఈ క్రమంలో జెమినీ టీవీలో ప్రసారమైన సౌందర్య అనే సీరియల్‌తో తెలుగువారిని పలకరించారు. తర్వాత ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలి, సుడిగుండాలు, కర్తవ్యం, సుందరకాండ, కల్పన, కలవారి కోడలు, శ్రీకృష్ణలీలలు, గంగోత్రి, ఏడాడుగులు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, తులసి దళం, కలిసుందాం రా, గీతాంజలి వంటి సీరియల్స్‌లో నటించారు.

స్టార్ మాలో ప్రసారమైన వదినమ్మతో సుజిత మరింత పాపులర్ అయ్యారు. 26 ఏళ్ల బుల్లితెర కెరీర్‌లో దాదాపు 50కి పైగా సీరియల్స్ నటించి అరుదైన గుర్తింపు సంపాదించారు. సినిమాలు, టెలివిజన్‌తో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సుజిత సుపరిచితురాలు. ఇటీవల విడుదలై ఇళయ దళపతి విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో హీరోయిన్ మాళవిక మోహనన్‌కుక డబ్బింగ్ చెప్పి ప్రశంసలు దక్కించుకున్నారు. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ స్వయానా సుజితకు అన్నయ్య. కెరీర్‌లో పీక్స్‌లో ఉండగానే ధనుష్ అనే నిర్మాతను వివాహమాడారు. ఈ దంపతులకు తన్విన్ అనే బాబు ఉన్నాడు. ప్రస్తుతం సుజిత కుటుంబం చెన్నైలో స్థిరపడింది.

ఖాళీ సమయం దొరికితే సినిమాలు చూడటం , లాంగ్ డ్రైవ్, ట్రావెలింగ్‌ను సుజిత బాగా ఇష్టపడతారు. గతేడాది మార్చిలో చెన్నైలో తమ కొత్తింట్లోకి సుజిత దంపతులు అడుగుపెట్టారు. ఈ గృహ ప్రవేశానికి సంబంధించి సుజిత తన యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో పంచుకున్నారు. సీరియల్స్‌, సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తానని సుజిత తెలిపారు.

More from Filmibeat

Read more about: sujitha r dhanush movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X