For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 11th Episode: అంతా టెన్షన్ టెన్షన్.. రఘురామ్ తీరుతో విసిగిన ఫ్యామిలీ..

  |

  వదినమ్మ సీరియల్ లో ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ లో ప్రస్తుతం సిరి కూతురు వైదేహి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. సొంత అమ్మమ్మ ఆ పాపను కిడ్నాప్ చేయబోతుండంతో సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇక నిన్న ఎపిసోడ్ ప్రకారం ఆమె ఇంట్లో నుంచి తీసుకుని రావడానికి గాను పార్వతి ప్లాన్ సిద్ధం చేస్తుంది. డబ్బులు ఇచ్చి మరి వందమంది మనుషులను సిద్ధం చేస్తుంది. మరో పక్క రఘురాం, సీత ఇద్దరు ఆపరేషన్ గురించి బాధపడుతూ ఉంటారు. ఎలా అయినా పాపకు ఆపరేషన్ చేస్తే ఆ గండం నుంచి ఆమె బయట పడుతుందని టెన్షన్ లేకుండా బతకవచ్చని అనుకుంటారు.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   అంతా టెన్షన్ టెన్షన్

  అంతా టెన్షన్ టెన్షన్

  అలా నిన్నటి ఎపిసోడ్ ముగియగా ఈరోజు ఎపిసోడ్ లో. ఉదయం తెల్లవారకముందే రఘురాం డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి బయటపడతారు. వెళ్లి హాస్పిటల్ లో కూర్చుని డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే తన గురించి ఎవరు అడిగినా తనకు తెలియదు అని చెప్పమని సీతకి చెబుతాడు. అయితే సీత మాత్రం ఈ విషయాలన్నీ తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత గదిలోనుంచి బయటకు వచ్చి కూరగాయలు కోస్తూ కూడా ఏడుస్తూ ఉండడంతో సిరి అక్కడకు వచ్చి అసలు ఏం జరిగింది ? ఎందుకు ఇలా చేస్తున్నావు ? అని అడుగుతారు. అయితే అసలు ఆమె ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తూ కన్నీళ్లు పక్కకు తిరిగి తుడుచుకుంటూ ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా నువ్వు ఏడవడం మేము చూసామని అసలు ఏం జరిగిందో చెప్పాలని సిరి అడుగుతుంది.

  అందుకే అలా

  అందుకే అలా

  అయితే అదేమీ లేదని అంతా బాగానే ఉందని అనడంతో ఎందుకు పాపను తదేకంగా చూస్తున్నారు అని అడుగుతుంది ? ఎందుకో దాన్ని చూస్తుంటే నాకు కూడా ఆ వయసులో కి వెళ్లిపోవాలని అనిపిస్తుంది అని అంటుంది. మరో పక్క షాప్ కి వెళ్లడానికి సిద్ధమై వచ్చిన భరత్, లక్ష్మణ్ ఇద్దరూ కూడా అన్నయ్య ఎక్కడ అని అడుగుతారు.. అయితే ఏం చెప్పాలో తెలియక వాళ్ల మీద ఎదురు దాడికి దిగే ప్రయత్నం చేస్తుంది సీత. ఆయన లేకపోతే ఏమవుతుంది? మీరు వెళ్లి షాపు చూడొచ్చు కదా! అని అనడంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. సరేనని మేమిద్దరం రెడీ, వెళ్లి షాపు తేరుస్తాము అని చెప్పి భరత్, లక్ష్మణ్ ఇద్దరు వెళ్ళిపోబోతారు ఇంతలో సీత లోపలికి వెళ్లి పోతుంది. సిరి నువ్వలా సీతక్కని అడగడం సరిగ్గా లేదని రఘురాం బావ గారి గురించి ఎవరూ అలా మాట్లాడవద్దని అవసరం వచ్చినప్పుడు అన్ని విషయాలు ఆయనే వెల్లడిస్తారని శైలు చెబుతుంది.

  అలా అడగొద్దు

  అలా అడగొద్దు

  అయితే వంట గదిలో నుంచి ఇవన్నీ వింటున్న సీత బాధపడుతుంది. ఇంతలో బావ రఘురాం నుంచి ఫోన్ రావడంతో వెంటనే ఫోన్ అందుకుని ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.. ఆపరేషన్ ఎప్పుడూ ? మనం ఎప్పుడు వెళ్లాలి ? మళ్ళీ ఇంటికి ఎప్పుడు పంపిస్తారు ? ఇలా రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండడంతో రఘురాం సీరియస్ అవుతాడు. తాను ఇంకా డాక్టర్ను కలవలేదని కలిసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటాడు. అంతా బాగానే జరగాలని దేవుని కోరుకోవడం తప్పు ఇప్పుడు మనం ఏం చేయలేమని తేల్చి చెబుతాడు. ఇంతలో పెద్ద ప్లానే సిద్ధం చేసుకున్న పార్వతి నెమ్మదిగా సిరి దగ్గరకు వచ్చి మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో అందరూ అక్కడే మూగుతారు. ఎంతోసేపు బతిమిలాడి తర్వాత సిరి కరిగి తన తల్లిని క్షమిస్తుంది. ఇంతలో పార్వతి తన వచ్చిన ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమై నేను వెళ్ళి నా మనవరాలుతో కాసేపు పడుకుంటాను అని చెప్పి లోపలికి వెళుతుంది.

   ఎట్టకేలకు కిడ్నాప్

  ఎట్టకేలకు కిడ్నాప్

  లోపలికి వెళ్ళిన ఆమె ఎవరూ లేరు అని అనుకున్న తరువాత తన మనవరాలిని తీసుకుని బయటపడే ప్రయత్నం చేయడానికి చూస్తుంది. కానీ ఒక పక్క సీత, సిరి వాళ్ళందరూ ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. అందుకే మళ్లీ మళ్లీ ఏదో ఒకటి చేయడానికి ఆమె ప్రయత్నిస్తూనే ఉంటుంది.. అయితే ఎట్టకేలకు వాళ్ళందరూ పనిలో మునిగి పోయిన సమయంలో పాపను తీసుకుని బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఈ లోపు ఇంట్లో వాళ్ళందరూ ఏదో పనిలో మునిగి పోవడంతో పాపను తీసుకుని బయటపడుతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ఏంటీ సస్పెన్స్

  ఏంటీ సస్పెన్స్

  పాపను కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకు వెళ్ళిన విషయాన్ని గత 2,3 ఎపిసోడ్స్ నుంచి కమింగ్ అప్ లో చూపిస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పాప కనబడకపోవడం తో సీత, సిరి మొదలు అందరూ ఆ పాప ని వెతుక్కుంటూ రోడ్ ఎక్కుతారు. మరోపక్క పార్వతి రౌడీలను పెట్టి ఇంటి చుట్టూ కాపలా పెట్టుకోవడం, పాప ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నట్లు అనిపించడం ఇవన్నీ ఈ అంశం మీద మరింత ఆసక్తిని రేపుతున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

  English summary
  Vadinamma Episode 618 : Siri finds something fishy about Sita's depressed behaviour. After a while, a vengeful Parvati decides to abduct Vaidehi to teach a lesson to Siri.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X