Vadinamma Serial August 21st Episode: మర్డర్ కాదు టార్గెట్.. అసలు సీక్రెట్ చెప్పిన దమయంతి.. టార్గెట్ ఫిక్స్?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మాత్రం తాను అత్తారింటికి వెళ్ళేది లేదని నానిని ఎలా అయినా ఇక్కడికి తీసుకు రావాలని తల్లితో శిల్ప చెబుతుంది. శిల్ప చెప్పక ముందే నానిని ఎలా అయినా ఇక్కడికి రప్పించాలని ప్లాంట్ సిద్ధంగా ఉన్న దమయంతి అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంది.

మరో పక్క సీత ఇంట్లో కాస్త ఆనందం నెలకొని ఉంటుంది. పాప సమస్య నుంచి గట్టెక్కడంతో అందరూ కాస్త ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. సీతను శిల్ప ఇంటికి వచ్చేలాగా మాట్లాడాలని రఘురామ్ తల్లి చెబుతుంది. వెంటనే ఫోన్ చేసిన సీత దమయంతితో శిల్పను ఇంటికి పంపాలని కోరుతుంది.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

 శ్రావణమాసం వ్రతాలు

శ్రావణమాసం వ్రతాలు

అయితే ఫోన్ లో మాట్లాడిన దమయంతి ఇంకా మూడు రోజుల వేడుక అవ్వలేదు కదా అలాగే శ్రావణమాసం వ్రతాలు చేయకుండా పంపడం ఎలా అని అడుగుతుంది. అయితే ముందు ఇక్కడికి తీసుకు వస్తే తర్వాత అవన్నీ ప్లాన్ చేయొచ్చు అని సీత చెబుతుంది. అలాగే తాను నానిని పంపిస్తానని నాని వచ్చి శిల్పను తీసుకొస్తాడు అని చెబుతోంది.

క్యాబ్ మాట్లాడి నాని భరత్, సిరి ముగ్గురిని పంపిస్తా అని వారు వచ్చి శిల్పను ఇంటికి తీసుకొస్తారు అని అంటుంది. అయితే దమయంతి మాత్రం అలా వద్దని మేమే కార్ పంపిస్తామని అందులో వచ్చి తీసుకు వెళ్లాలని చెబుతుంది. దీంతో సీత ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పటానికి లోపలికి వెళ్తుంది. మరోపక్క దమయంతి కొడుకు మాత్రం ఇలా నువ్వు కారు పంపిస్తాను అనడం ఏమాత్రం నచ్చలేదు అని అంటాడు.

 నానిని ఇల్లరికం తీసుకురావడమే

నానిని ఇల్లరికం తీసుకురావడమే

దానికి సమాధానం చెప్పిన దమయంతి తన ప్లాన్ నానిని ఇల్లరికం తీసుకురావడమే అని దాని కోసం మన కారు యాక్సిడెంట్ కూడా చేయిస్తాను అని అంటుంది. వాడిని తీసుకురావడం కోసం మన కారు ఎందుకు నాశనం చేసుకోవడం అసలు ఎందుకు ఇదంతా అని అడగగా నా ఉద్దేశం నానిని చంపడం కాదని వాడిని మన ఇంట్లో ఉంచేలా చేయడమే నా ఫైనల్ గోల్ అని చెబుతుంది.

దీంతో కన్విన్స్ అయిన కిషోర్ డ్రైవర్ కి యాక్సిడెంట్ ఎలా చేయాలి అనే విషయాల మీద క్లారిటీ ఇస్తాడు. ఇక మరోపక్క తన కోసం అత్తగారు కారు పంపిస్తోంది అన్న విషయం తెలుసుకున్న నాని ఎంతసేపు గుమ్మం దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న కుటుంబ సభ్యులు కాసేపు నానితో ఆడుకుంటారు. సీత అయితే ఖాళీ కాఫీ కప్పు తీసుకెళ్లి నానీకు ఇచ్చి దానిని తాగుతున్నట్టు చేస్తూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఇక వీడి ఇలా ఉంది అని కుటుంబ సభ్యులు అందరూ ఆటపట్టిస్తారు.

కార్ యాక్సిడెంట్

కార్ యాక్సిడెంట్

ఇక ఇదంతా ఎలా జరుగుతున్న సమయంలో కారు ఇంటికి చేరుకుంటుంది కారు ఎక్కి నాని, భరత్, సిరి ముగ్గురు బయలుదేరుతారు.. కారు ఎక్కిన వెంటనే శిల్ప నాని కి ఫోన్ చేస్తుంది ఇప్పుడు శిల్పతో మాట్లాడితే అందరూ తనను ఆటపట్టిస్తారు ఏమోనని నాని భయపడతాడు. కానీ తర్వాత తేరుకుని ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు.

అయితే తన యజమాని ఇచ్చిన ఆదేశాల మేరకు కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని చెబుతూ కావాలనే కార్ యాక్సిడెంట్ చేస్తాడు డ్రైవర్. అందరికీ చిన్న చిన్న దెబ్బలు కూడా తగ్గుతాయి. డ్రైవర్, నాని, భరత్, సిరి నలుగురికి చిన్న చిన్న దెబ్బలు తగలడంతో వాళ్ళు అలాగే ఇంటికి చేరుతారు. కారు ఇలా నడిపి వాళ్ళని ఇబ్బంది పెడతావా అని దమయంతి డ్రైవర్ని తిట్టినట్లు నటిస్తుంది. అంతేకాక దెబ్బలు తగిలిన వాళ్లందరినీ లోపలికి తీసుకు వెళ్లి వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చి చికిత్స చేసుకోమని చెబుతుంది.

దమయంతి అనుమానాలు

దమయంతి అనుమానాలు

అయితే ఈ విషయంలో కాస్త బాధ పడినట్లు కనిపిస్తున్నారు సిరి, భరత్. నానికి దెబ్బ గట్టిగా తగ్గడంతో ఫస్ట్ ఎయిడ్ కిట్ తో చికిత్స చేస్తున్నప్పుడే బాధపడుతూ ఉంటాడు. దెబ్బలు గట్టిగా తగిలాయా అల్లుడు గారు అంటే అవును అత్తయ్య గారు దెబ్బలు గట్టిగా తగిలాయ అంటాడు. శ్రావణ మాసం మంచి రోజు అనే కారు ఈ రోజు పంపిస్తే అనుకోకుండా ఇలా యాక్సిడెంట్ జరగడం ఏంటి. దీని వెనుక ఏదో ఉంది అన్నట్లుగా దమయంతి అనుమానాలు రేకెత్తిస్తుంది. అంతేకాక ప్రతి విషయంలోనూ అపశకునాలు జరుగుతున్నాయని కొత్త అనుమానం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
తర్వాత ఎపిసోడ్ లొ

తర్వాత ఎపిసోడ్ లొ

ఇక తర్వాత ఎపిసోడ్ లొ ఈ అపశకునాలు గురించి చెప్పడానికి ఆమె స్వయంగా సీత ఇంటికి వచ్చి నట్లు గా చూపించారు. రేపు ఇంటికి వచ్చి ఈ విషయం గురించి మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే శోభనానికి ముందే ఇంట్లో ఒక వ్రతం చేయిద్దామని సీత చెబుతుంది. అయితే ఆ వ్రతం చేయించాలంటే ఒక ఛాలెంజ్ అన్నట్లుగా దమయంతి చెబుతున్నట్లు చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X