For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Serial August 24th Episode: శిల్పను బలిస్తారా? పార్వతితో కలిసి స్కెచ్ వేసిన దమయంతి.. వామ్మో!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఇప్పుడు నాని శిల్పాల శోభనం చుట్టూ తిరుగుతోంది. ఎలా అయినా శిల్పని అత్తారింటికి పంపకూడదు అని దమయంతి భావిస్తూ ఉంటే ఎలా అయినా శిల్పని తమ ఇంటికి తీసుకురావాలని రఘురాం సీత సహా కుటుంబ సభ్యులు అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఎలా అయినా సీత అనుకున్నది అనుకున్నట్టు జరగకూడదు అని భావిస్తున్న దమయంతి శిల్పకు చెప్పి ఒక ప్లాన్ కూడా సిద్ధం చేస్తోంది. ఆ ప్లాన్ ప్రకారం శిల్ప తన ఒంటి మీద టీ ఒలికినట్టు నాటకం ఆడితే ఇది కూడా ఒక అపశకునము అని నేను శిల్పను మీ ఇంటికి పంపలేను అని చెబుతోంది. ఈ విషయం నేనే స్వయంగా వచ్చి సీతకు చెబుతానని సీత ఇంటికి కూడా వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  అపశకునాలు

  అపశకునాలు

  సీత ఇంటికి వచ్చిన దమయంతి ఈ అపశకునాలు అన్ని చూస్తే నాకు భయంగా ఉందని అందుకే శిల్పని మీ ఇంటికి పంప లేను అని అంటుంది. అయితే ముందు నుంచి కూడా దమయంతి ప్రవర్తన మీద అనేక అనుమానాలు ఉన్న కుటుంబ సభ్యులు దమయంతి ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో ఉండరు. దమయంతి ఎన్ని ఉదాహరణలు చెప్పినా సీత కుటుంబ సభ్యులు కూడా అనేక ఉదాహరణలు చెప్పి మీరు చెప్పేది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దమయంతి కోపంతో మీరు చెప్పేది ఎలా ఉందంటే నా కూతుర్ని తీసుకువచ్చి బలి ఇవ్వాలి అన్నట్లు ఉందని ఉంటుంది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఆమె మీద విరుచుకు పడ్డారు. తమకు నాని ఎంతో శిల్ప కూడా అంతేనని ఒకరి మీద పగ తీర్చుకోవాలని మేము ఎందుకు అనుకుంటాము అని ప్రశ్నిస్తారు..

  బలిస్తారా?

  బలిస్తారా?

  అయితే మళ్ళీ తమాయించుకుని దమయంతి నా ఉద్దేశం అది కాదు అని మీరు ఎంతసేపు ఆమెని ఎక్కడి కి తీసుకు రావాలనే ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడికి తీసుకు వస్తే అపశకునాలు వల్ల ఆమెకు లేదా మీకు ఏమైనా జరుగుతుందేమో అని నేను భయపడుతున్నానని దమయంతి అంటుంది. అంతేకాక ఈ అపశకునాలు మీద ఎవరు ఎలాంటి విశ్లేషణ చేయలేరు అని ఎప్పుడు? ఎందుకు? ఎక్కడ? ఎలా? జరుగుతాయో చెప్పలేం కాబట్టి మా అమ్మాయిని మీ ఇంటికి పంపి ప్రసక్తే లేదు అన్నట్లు మాట్లాడుతుంది. నాని తనకు సపోర్ట్ చేస్తాడు ఏమో అనుకుని మేము మాట్లాడుకోవడం కాదు నువ్వు నీ ఉద్దేశం ఏంటో చెప్పు అంటే నాకు ప్రత్యేకంగా వేరే ఉద్దేశం ఏమీ ఉండదని మా అన్న వదిన ఏం చెబితే అది ఫాలో అవుతామని అని అంటారు. దీంతో అనవసరంగా వీడిని అడిగాను రా బాబు అని దమయంతి అనుకుంటుంది.

  భలే స్కెచ్చేసిందే

  భలే స్కెచ్చేసిందే

  అయితే ఇదంతా మాట్లాడుతుంటే సీత శోభనానికి ముందు వ్రతం చేస్తే ఇలాంటి అపశకునాలు అన్నింటికీ దోషం పోతుందని అంటుంది. అవునా వ్రతం చేస్తే దోషాలు పోతాయా? మాకు తెలీదే అన్నట్లు వెటకారంగా మాట్లాడిన దమయంతి ఇలాంటి అపశకునాలు జరుగుతుంటే అసలు వ్రతం అయినా జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుందని సీతా, కుటుంబ సభ్యులు అంటారు. మీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను కానీ ఇది ఒక ఛాలెంజ్ గా చేస్తున్నాను మీరు వ్రతం జరిపించగలిగితే మీరు ఏం చెప్తే నేను అది వింటాను. ఒకవేళ మీరు వ్రతం జరిపించలేకపోతే నానిని మా ఇంటికి శాశ్వతంగా ఇల్లరికం పంపాలి అంటూ ఛాలెంజ్ చేస్తుంది.. ఇంట్లో అందరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు గానీ సీత మాత్రం వెంటనే మీ ఛాలెంజ్ రెడీ అంటుంది.

  సీత ఛాలెంజ్

  సీత ఛాలెంజ్

  ఇంట్లో వాళ్ళందరూ సీత మీద కోప్పడతారు కానీ సీత మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉంది కచ్చితంగా వ్రతం చేసి చూపిస్తాను శిల్ప మన ఇంట్లో సుఖంగా ఉంటుంది అంటూ అందరినీ ఊరుకో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక నేను వెళ్లి వస్తాను అని చెప్పి బయలుదేరిన దమయంతి ఈ ప్లాన్ ఎవ రిచేత అమలు చేయించాలి అని ఆలోచనలో పడుతుంది. కారులో వెళ్తూ ఉండగా ఆమెకు పార్వతి గుర్తొస్తుంది. కిడ్నాప్ చేసింది అంటే ఎంతకైనా తెగిస్తుంది అనే ఉద్దేశంతో ఆమె ఇంటికి కారు ఫోన్ పోనివ్వమని డ్రైవర్ కి చెబుతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  పార్వతితో కలిసి స్కెచ్

  పార్వతితో కలిసి స్కెచ్

  వాళ్ళ ఇంటికి డ్రైవర్ కారు పోనివ్వగానే ముందు వెళ్ళి పరిచయం చేసుకుని నిశ్చయ తాంబూలాలు ఇస్తున్నట్లుగా పదివేల రూపాయలు లంచం ఇచ్చి మరి తన ఉద్దేశాలు చెప్పి ఈ వ్రతాన్ని ఆపాలని అంటుంది. అసలు మమ్మల్ని పిలవకపోతే మేము ఎలా వ్రతాన్ని ఆపగలం అని పార్వతి అడుగుతుంది. వాళ్లు మిమ్మల్ని పిలవరు కానీ మీరే వెళ్ళి వ్రతానికి వస్తాము అని చెప్పాలని కానీ వ్రతం సమయానికి ఏదో ఒక కారణం చెప్పి ఆగిపోవాలి అని అంటుంది. అలా ఆమె ఇచ్చిన లంచం పని చేయిస్తుంది అనే నమ్మకం తోనే దమయంతి ఉంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ లో వ్రతానికి అడ్డంకులు కలిగినట్లుగా చూపించారు. మరి ఏం జరగబోతోంది అనేది వేచి చూడాల్సి ఉంది.

  English summary
  Vadinamma Episode 629 : Shilpa implements Dhamayanth's ploy against Nani. Later, Dhamayanthi refuses to send Shilpa along with Nani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X