Vadinamma Episode 611: ఇంట్లో అడ్డంగా దొరికేసిన శిల్ప.. రఘురామ్ ఫ్యామిలీలో మరో కొత్త టెన్షన్!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది.. ఎట్టకేలకు శిల్పా- నాని పెళ్లి జరిగిపోగా ఇప్పుడు పెళ్లి తర్వాత మళ్లీ కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

 అసలు ఏమైందంటే

అసలు ఏమైందంటే

గడిచిన ఎపిసోడ్ లో శిల్ప-నాని శోభనం క్యాన్సిల్ కాగా ఆషాడ మాసం కావడంతో శిల్పను దమయంతి ఇంట్లోనే వదిలేసి రఘురాం కుటుంబమంతా ఇంటికి చేరుకుంటారు. అయితే దమయంతి కావాలనే ఇలా ఏదైనా ప్లాన్ చేసిందా అనే అనుమానం అయితే అందరిలో నెలకొంటుంది. కానీ అలాంటిదేమీ ఉండకపోవచ్చని రఘురాం - సీత అభిప్రాయపడతారు. ఇక అన్నయ్య కష్టపడడం చూసి తాను ఉద్యోగం చేయకూడదని అన్నయ్య కు తోడుగా కిరాణా షాపు లోనే పనిచేయాలని లక్ష్మణ్ ఫిక్స్ అవుతాడు. దానికి శైలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఇక నేటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

ఉద్యోగం మానేసిన లక్ష్మణ్

ఉద్యోగం మానేసిన లక్ష్మణ్

లక్ష్మణ్ కిరాణ షాప్ లో పని చేయడానికి ఒప్పుకోవడంతో ఇంట్లో అందరూ ఆనందపడతారు. అయితే తాను కూడా ఎంతో కొంత సహాయపడాలని చెబుతూ పిల్లలకి ట్యూషన్ చెబుతానని శైలు అంటుంది.. అయితే ముందు అలాంటిదేమీ వద్దని మగవాళ్ళు కష్టపడితే చాలు అని చెప్పిన కుటుంబ సభ్యులు అందరూ శైలు ముచ్చట పడడం చూసి సరే అంటారు సరదా కోసం అంటే ఏమి ఇబ్బంది లేదని అంటారు. అయితే లక్ష్మణ్ మాత్రం శైలు కి చిన్నపిల్లల్ని డీల్ చేసే విధానం తెలియదని వద్దని అంటాడు. ఇంతలో శైలు లక్ష్మణ్ మధ్య కాస్త సరదా సంభాషణ జరుగుతూ ఉంటుంది.

దుర్గ దెబ్బ

దుర్గ దెబ్బ

మరోపక్క నాని శిల్పా పెళ్లి జరిగింది అని తెలుసుకున్న భాస్కర్ వాళ్ళిద్దరికీ ఏమైనా గిఫ్ట్ కొనాలి అని ఫిక్స్ అయ్యి ఏం కొనాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే దుర్గ మాత్రం భర్తను రెచ్చగొట్టే పనిలో ఉంటుంది. మిమ్మల్ని వాళ్ళు పిలవలేదు అయినా ఏ మొహం పెట్టుకొని గిఫ్ట్ లు పట్టుకు వెళ్తారు అంట ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాక తనకు ఒక చీర కొనాలంటే కొనరు గాని ఊర్లో వాళ్లకి మాత్రం గిఫ్ట్ లు కొంటాటారని దెప్పిపొడుస్తూ ఉంటుంది. అయితే అనవసరంగా దీని దగ్గర నోరుజారానా అని బాస్కర్ బాధపడుతూ ఉంటాడు. మరోపక్క లక్ష్మణ్ ఉద్యోగం మానేస్తున్నాను అని రైస్ మిల్ ఓనర్ కి చెబుతాడు.

దొరికేసిన శిల్ప

దొరికేసిన శిల్ప

అయితే నువ్వు మానేస్తే ఇబ్బంది పడతా అని అనడంతో కాదని ఇంతకు ముందు పని చేసిన వ్యక్తి ని తీసుకువచ్చి మీదగ్గర పెడుతున్నాను అని ఆయన అంటాడు. నీ మీద నమ్మకంతో మళ్ళీ పెట్టుకుంటున్నానని రైస్ మిల్ ఓనర్ అంటాడు. ఇక ఆ తర్వాత తాను ఉద్యోగం మానేసి షాప్ కోసం పని చేస్తున్నాననే విషయాన్ని భరత్ కి చెబుతాడు లక్ష్మణ్. ముందు కాస్త టెన్షన్ పడినా తర్వాత విషయం అర్థం చేసుకుని భరత్ కూడా దీనిని సాధారంగా ఆహ్వానిస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే ఇంట్లో అందరూ కూర్చుని రాత్రి భోజనం చేస్తూ ఉంటారు. అయితే అందరూ కూడా నానిని ఆటపట్టిస్తూ ఉంటారు. నీ కొంప కొల్లేరయింది అన్నట్లు బాధపడుతూ, బాధపెడుతూ ఆటపట్టిస్తూ ఉంటారు. ఇంతలో శిల్ప నుంచి నానికి ఫోన్ వస్తుంది.. అయితే స్పీకర్ లో పెట్టి మాట్లాడాలని కండిషన్ తో సిరి ఫోన్ లాక్కుని స్పీకర్ లో పెడుతుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
రిషికి ఇన్సూరెన్స్

రిషికి ఇన్సూరెన్స్

అయితే తాను ఆగలేకపోతున్నా, నిన్ను చూడకుండా వుండలేక పోతున్నాను అని శిల్ప నానీతో చెబుతున్న మాటలన్నీ విన్న కుటుంబ సభ్యులు అనుకోకుండా ఒక కౌంటర్ వేస్తారు, దీంతో శిల్ప భయపడి ఫోన్ కట్ చేస్తుంది.. వెంటనే ఫోన్ లాక్కుని బయటకు వెళ్ళిన నానీ మళ్లీ ఫోన్ చేసి శిల్పని బతిమాలాడుకునే పనిలో పడతాడు. ఇంట్లో వాళ్ళందరూ కావాలని ఏడిపించారని ఫీల్ అవ్వదు అని అంటాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసినట్లైంది. ఇక తర్వాత ఎపిసోడ్ లో శైలు కొడుకు రిషికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినట్లు ఇంట్లో వాళ్లకు తెలియడంతో అసలు ఏమవుతుంది అని టెన్షన్ అందరికీ మొదలవుతుంది, ఇక మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి.

అదే కారణమా?

అదే కారణమా?

నిజానికి గతంలో ఋషి ఆరోగ్యం ఒకసారి దెబ్బతిన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంట్లో ఎవరికీ తెలియకుండా కొంత డబ్బు తీసి వాడినట్లు కూడా గతంలో చూపించారు. అయితే రిషి గుండెల్లో ఏదో సమస్య ఉందని డాక్టర్ అప్పుడు చెప్పిన విషయం కేవలం రఘురాం తన మనసులోనే ఉంచుకున్నాడు.

బహుశా ఆ డబ్బుతోనే రిషికి ఇన్సూరెన్స్ చేయించి ఉండవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే తదుపరి ఎపిసోడ్ లో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. రఘురామ్ ఈ విషయం ఇన్నాళ్లు దాచుతూ వచ్చి ఇప్పుడు రివీల్ చేయబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X