For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma Episode 612: చావు తప్పించుకుని కన్ను లొట్ట పోగొట్టుకున్న నాని.. రఘురామ్ ఫ్యామిలీలో ముసలం!

  |

  తెలుగు సీరియల్స్ లో వదినమ్మ ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతూ స్టార్ మా ఛానల్ కి మంచి రేటింగ్స్ తెచ్చిపెడుతోంది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది పరిశీలిస్తే

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   నిన్న ఏం జరిగిందంటే

  నిన్న ఏం జరిగిందంటే

  నిన్నటి ఎపిసోడ్ కూడా దాదాపుగా ఆసక్తికరంగా సాగింది. నాని శోభనం వాయిదా పడటంతో ఇంట్లో అందరూ ఆయనని ఆటపట్టిస్తూ ఉంటారు. భోజనం కూడా సరిగా చేయకుండా నాని బాధపడుతూ ఉంటే ఇంట్లో వదినలు, అన్నలు మాత్రం ఏడిపిస్తూ ఉంటారు. సరిగ్గా ఇదే సమయానికి భార్య శిల్ప ఫోన్ చేసి ఆటపట్టిస్తూ మనం లేచిపోదామా అని అడగడంతో ఇంట్లో అందరి మధ్య నవ్వులు-పువ్వులు అవుతాయి. అయితే తాను మాట్లాడుతున్న ఫోన్ స్పీకర్ లో ఉంది అనే విషయం తెలుసుకున్న శిల్ప వెంటనే ఫోన్ కట్ చేసి పక్కన పడేస్తే. మళ్లీ ఆమెకు ఫోన్ చేసి నాని బతిమిలాడుకుంటాడు తనను వాళ్లంతా బలవంతం చేశారు అని అంటే బలవంతం చేయడం కాదు మొద్దు, అది ఆటపట్టించడం అని అంటుంది. ఇక అలా సరదాగా నిన్నటి ఎపిసోడ్ ముగిసింది.

   ఇంటికి పిలిచిన శిల్ప

  ఇంటికి పిలిచిన శిల్ప

  ఇక నేటి ఎపిసోడ్ ప్రకారం శిల్ప నానిని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది.. అదేంటి మీ అమ్మ ఉంటుంది కదా ఏమీ అనరా ? అని అడిగితే అమ్మకి తెలిసేలాగా వస్తావా ఏమిటి ? ఆవిడకి తెలియకుండా వచ్చి చూసి వెళ్లిపోవాలని నువ్వు వస్తే ముద్దు ఇస్తాను అని అంటుంది. అంతేకాక వచ్చేటప్పుడు మల్లెపువ్వులు ఐస్ క్రీం కూడా తీసుకు రమ్మని శిల్ప కోరుతుంది. ఇంకేముంది భార్య అలా ఫోన్ చేసి అడిగితే ఏ భర్త మాత్రం ఊరుకుంటాడు నాని కూడా సర్వం సిద్ధమై శిల్ప దగ్గరికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్ళాక సాదర ఆహ్వానం లభిస్తుంది అనుకుంటే గేటు దూకి రమ్మని చెబుతుంది శిల్పా. ఇది ఎక్కడ గోల రా నాయనా అనుకుంటే ఆషాడ మాసం కష్టాలు పడక తప్పదు అని ఫిక్సై శిల్ప కోరినట్లుగానే గోడ దూకి లోపలి కి వెళ్తాడు. తీరా శిల్ప బాల్కనీ దగ్గరికి వెళ్ళాక పక్కన ఉన్న స్తంభం పట్టుకుని పైకి రమ్మని కోరుతుంది.

  అమ్మకి దొరికితే బాగోదు

  అమ్మకి దొరికితే బాగోదు

  ఆషాడం పెళ్లి కొడుకు కదా అలా కూడా ట్రై చేస్తాడు, అయినా వర్కౌట్ కాకపోవడంతో చివరికి శిల్ప ఒక దుప్పటి లాంటి దాన్ని కిందికి జారుస్తుంది. నాని జారవిడిచిన దుప్పటి ఆధారంగా చేసుకుని కష్టపడి పైకి ఎక్కుతాడు నాని.. ఇంకేముంది శిల్పా నాని ఈ మధ్య కాస్త చనువు పెరుగుతోంది అనుకునే సమయంలో అప్పుడే దేనికోసమో నిద్రలేచిన దమయంతికి ఇంటి బయట బండి ఒకటి పార్క్ చేసినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆమెకు అనుమానం వచ్చి శిల్పని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దెబ్బకు శిల్ప భయపడి నాని నువ్వు ఎలాగైనా వెళ్ళిపో ఇప్పుడు అమ్మకి దొరికితే అంటుంది. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తాను? అని అడుగుతాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ అమ్మకి దొరికితే బాగోదు అని అనడంతో నాని పడుతూ లేస్తూ మళ్ళీ కిందకి వచ్చి నెమ్మదిగా ఇంటికి వెళతాడు.

  అక్కడా దొరికేసి ఇక్కడా దొరికేసి

  అక్కడా దొరికేసి ఇక్కడా దొరికేసి


  అత్తారింట్లో దాదాపు దొరికిపోయి బయటపడ్డానని ఇంట్లో అయినా ఎవరికీ దొరక్కుండా వెళ్లి పడుకోగలిగితే చాలని దండం పెట్టుకుంటూ లోపలికి వెళితే ఇంట్లో అందరికీ అడ్డంగా దొరికేస్తాడు. అలా దొరికేస్తే ముందు తాను ఊరికే చల్ల గాలి కోసం బయటికి వెళ్లానని బుకాయిస్తాడు నిజమేనా అని అడిగితే నిజమేనా అని నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అని అంటారు. ఇంతలో కావాలని శిల్ప తమకు ఫోన్ చేసినట్లు సీతా ఒక రాయి వేస్తుంది. నిజమేనని శిల్ప ఫోన్ చేసి అంతా చెప్పేసింది ఏమో అని భయపడి అంతా చెప్పేస్తాడు. ఇంకేముంది సరదాగా వాళ్లంతా ఆటపట్టిస్తారు. ఇక అలా ఆ రాత్రి నడుస్తుంది.

   శైలు మాటలకి పొంగిపోయి

  శైలు మాటలకి పొంగిపోయి

  ఇక ఆ తర్వాత రోజు శైలు ట్యూషన్ చెప్పబడును అనే బోర్డు ఇంటి బయట తలిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. లక్ష్మణ్ కూడా ఆమెకు సహాయం చేస్తాడు.. ఇంకేముంది డబ్బు సంపాదిస్తున్నావు కదా చీరల కోసం డబ్బులు నన్ను అడగడం మానేస్తావు కదా అని అంటే అది అదే, ఇది ఇదే అని చెబుతోంది. అదేంటి అలా అంటున్నావు అంటే ఈ డబ్బు మన కోసం కాదని రిషి అలాగే వైదేహి ఇద్దరికీ ఇన్సూరెన్స్ కడతా అని చెబుతోంది. ఈ మాట విని అటు లక్ష్మణ్ సీత ఇద్దరు ఆనందపడతారు శైలు ఇంత మంచిగా ఆలోచిస్తోందని ఇద్దరు సంతోష పడతారు.

  మళ్ళీ రచ్చ

  మళ్ళీ రచ్చ

  ఇక వారు ఆలోచిస్తుండగానే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇంటికి వస్తాడు. అయితే తాను ఆలోచన మాత్రమే చేశానని బావగారు ఇప్పటికే ఈ విషయంలో ఆలోచించి వేగంగా రంగంలోకి దిగారని శైలు అంటుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ చేసింది కేవలం రిషి కి మాత్రమే అనే విషయం వెల్లడవుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. ఇక కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం తర్వాత ఎపిసోడ్ లో పార్వతి ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేసినట్లు గా చూపించారు. దీంతో తర్వాత ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగే అలానే కనిపిస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Vadinamma Episode 612 : Vadinamma is a Telugu soap which airs on Star Maa and streams on Disney+Hotstar. The series premiered on 6 May 2019. It stars Prabhakar, Sujitha, Rajesh Dutta, Maheshwari, Raj and Priyanka. In the latest episode Nani's family makes fun of him as he sneaks into Shilpa's house. Later, Sita and Laxman feel elated to learn about Shailu's intentions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X