Vadinamma Serial August 9th Episode: వైదేహి టెన్షన్లో రఘురామ్ ఫామిలీ.. పార్వతి దెబ్బతో షాక్?

తెలుగులో ఆసక్తికరంగా సాగుతున్న వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒకటి ట్విస్ట్ తో ముందుకెళుతోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు వైదేహి ఆరోగ్యం క్షీణించే పరిస్థితులు కనిపించడంతో రఘురాం కుటుంబం వైదేహి రక్షించుకోవడానికి ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా సాగుతోంది. ఇంట్లో రిషికి ఇన్సూరెన్స్ కట్టి వైదేహి ఇన్సూరెన్స్ కట్టక పోవడం అనే విషయం మీద పెద్ద రాద్ధాంతం జరుగుతోంది ఈ అంశంలోకి ఎంట్రీ ఇచ్చిన పార్వతి మొగుడితో తను రఘురాం ఇంటికి వెళ్లి ఏదో ఒకటి తేల్చుకోని వస్తాను అని ప్రగల్భాలు పలికి అందుకు తగ్గట్టే రఘురాం ఇంటికి బయలుదేరి వెళ్లడం చూపించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది చూస్తే

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

తేల్చేసిన రఘురామ్

తేల్చేసిన రఘురామ్

రఘురాం ని ఫాలో అవుతూ వెళ్ళిన సీత రఘురామ గుడికి వెళ్ళి కూర్చుని బాధ పడుతూ ఉండటం చూసి వెళ్లి అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది. దీంతో జరిగిందంతా చెప్పిన రఘురాం వైదేహి మనకు దక్కదు అనే విషయాన్ని సీతకు వెల్లడిస్తాడు. షాక్ తిన్న సీత, ఇప్పుడు ఏం చేయాలి అని ప్రశ్నిస్తుంది. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలని దానికి సంబంధించిన డబ్బు కూడా తను దాచుతున్నట్టు వెల్లడిస్తాడు. అయితే ఈ విషయాన్ని వైదేహి తల్లిదండ్రులకు గానీ ఇంకెవరికి కానీ వెల్లడించవద్దు అని చెప్పి సీత దగ్గర మాట తీసుకుంటాడు.. అయితే భరత్, సిరి ఇద్దరికీ చెప్పాల్సిన అవసరం ఉందని వాళ్ళిద్దరూ పాప తల్లిదండ్రులు కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర దాచితే ఎలా ? బాగోదు అని అంటుంది. అయితే అవన్నీ తనకు తెలియదని వాళ్ళు బాధ పడకుండా ఉండాలి అంటే ఈ విషయాన్ని నీలోనే ఉంచుకోవాలని రఘురాం తేల్చి చెబుతాడు. ఇలా చెబుతున్న సమయంలో సీత కూడా భర్త మాటకు ఎదురు చెప్పలేక సరే అని అంటుంది. దీంతో ఇద్దరూ కలిసి ఇంటికి బయలు దేరి వెళతారు.

సిరి చూపు ఆటే

సిరి చూపు ఆటే

వీళ్లిద్దరూ ఇంటికి బయలుదేరి వెళ్ళే లోపల ఇంట్లో రఘురాం తల్లి సిరి, శైలుతో మాట్లాడుతూ ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకుంటే ఉండగా రిషి ఏడ్చాడా అని అడిగితే బాగా ఏడ్చేడని, తను తట్టుకోలేక వాడిని సీత అక్కకి పూర్తిగా అప్పగించానని మొత్తంగా చూసుకుంటే తను మాత్రమే చూస్తూ నుంచున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే తల్లి అన్నాక పిల్లాడి సంతోషం ఎలా చూస్తామో బాధను కూడా అలాగే చూడాలని ఆ బాధను మనం కూడా షేర్ చేసుకుని వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలని అత్త చెప్పుకుంటూ వస్తుంది.. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నా సరే సిరి చూపు మాత్రం గుమ్మం మీద ఉంటుంది. బావ గారు ఎప్పుడు వస్తారా ? తన కూతుర్ని ఎప్పుడు తీసుకు వస్తారా ? అని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది.

సిరికి షాక్

సిరికి షాక్

అనుకున్నట్టుగానే రఘురాం వైదేహి, సీత ఇద్దరితో కలిసి ఇంటికి వస్తాడు వెంటనే సీతను పరుగెత్తుకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను వదిలి ఉండలేక పోయాను తెలుసా అంటూ వైదేహికి మాటలు చెబుతూ ఉంటే ఈ విషయాన్ని చూసి రఘు రామ్, సీత ఇద్దరు బాధపడుతుంటారు. వైదేహీ నుదుటున కుంకుమ బొట్టు చూసి గుడికి వెళ్లారా అని ప్రశ్నిస్తే అవును అని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళితే ఆ పక్కనే గుడి ఉండడంతో గుళ్లో కూడా వెళ్లి వచ్చాము అని రఘురాం చెబుతాడు. సీత కూడా వీళ్ళిద్దరిని గుడిలో చూసి తాను కూడా గుడికి వెళ్ళాను అని చెబుతుంది. అయితే వైదేహికి తినిపిస్తున్న క్రమంలో ఆమెకు పొల మారుతుంది, పొలమారిన విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుని రఘు, సీత ఇద్దరు సిరిని నిందిస్తారు. అసలు ఎందుకు ఇలా అంటున్నారు అనే విషయం అర్థం కాదు. కానీ వైదేహి గుండెల్లో ఇబ్బంది ఉందన్న విషయం తలచుకుని రఘురాం సీత ఇద్దరూ బాధపడుతూ ఉంటారు

రఘురామ్ ప్రయత్నాలు

రఘురామ్ ప్రయత్నాలు

అయితే రఘురామ్ తాను బయటికి వెళ్తాను అని పని మీద అర్జెంటుగా వెళ్లాల్సి ఉందని చెబుతూ బయటకు వెళ్లబోగా తల్లి మాత్రం తినేసి వెళ్లాలి అని అంటుంది. సీత మాత్రం ముందు వెళ్లి పని చూసుకరమ్మని అంటుంది. సీతకు డబ్బులు విషయం తెలియడంతో ఆమె ఆపే ప్రయత్నం చేయదు. కానీ సిరి మాత్రం అందుకే తల్లి కడుపు చూస్తుంది పెళ్ళాం జేబు చూస్తుంది అంటారని సరదాగా కామెంట్ చేస్తుంది. ఇక తాను డబ్బులు దాచిన షావుకారు దగ్గరకు వెళ్ళిన రఘురాం ఆ డబ్బులు కావాలని అడుగుతాడు. అయితే వడ్డీతో సహా మూడు లక్షలు అయ్యాయి అని కానీ ఇప్పుడు ఇవ్వలేను కాబట్టి సాయంత్రం ఇస్తాను అని ఆయన చెబుతాడు. చేసేదేమీలేక సరేనని సాయంత్రానికి కచ్చితంగా డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వెళ్తాడు రఘురాం.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
దమయంతి షాక్

దమయంతి షాక్

అయితే ఇంట్లో కూర్చుని గేమ్స్ ఆడుకుంటున్న శిల్ప కు తండ్రి వెళ్లి మళ్లీ జ్ఞాన బోధ చేసే ప్రయత్నం చేస్తాడు. నువ్వు మీ అమ్మ మాయలోపడి మొగుడ్ని వదిలేయ వద్దని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా, దమయంతి ఎంట్రీ ఇస్తుంది. దీంతో రాజశేఖర్ ఏమీ చేయలేక పెళ్ళాం చేతిలో బందీ అయి మళ్లీ బయటకు వెళ్ళిపోతాడు. ఇక రఘురాం డబ్బు దాచుకునే చోట డబ్బు దాచుకోవడానికి వెళుతుంది పార్వతి. ఈ మాటల్లో రఘురాం డబ్బు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అనే విషయం తెలుసుకుంటుంది. ఆ విషయం తెలుసుకుని పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. అందుకే కమింగ్ అప్ లో మనవరాలు వైదేహిని తీసుకుని ఆటోలో ఎక్కడికో వెళుతున్నట్టు చూపించారు. వైదేహి ఏమో ఆపదలో పడినట్లుగా కనిపిస్తోంది. అయితే మరి దీనికి సంబంధించి వచ్చే ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X