Vadinamma : నిజం తెలిసి రగిలిపోతున్న శైలు.. తండ్రి సాయంతో భర్తను కూడా ట్రాప్ చేసి.. ఇక చుక్కలే?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 722 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసి రఘురాం, సీతను పిలవకపోతే భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషంలో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందారు. అంతేకాక లక్ష్మణ్ కు కూడా వాళ్ళు రావడం తెలియడంతో ఆనందంగా ఉంటారు. రాజేశ్వరి ప్లాన్ తో అందరికంటే ముందు వాళ్ళ చేతుల మీదుగా బాబుకు అక్షింతలు కూడా పడతాయి.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

మారువేషాల్లో
అయితే శైలు తన తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చి క్షమించమని అందరినీ అడుగుతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కార్తీక మాసం సంబరాల్లో మునిగి పోయి ఉంటారు. అయితే దుర్గ, పార్వతి కలిసి వంట వాళ్లే రఘురాం, సీత అని శైలుకు చెప్పడానికి ప్రయత్నించి ఎట్టకేలకు ఆ విషయాన్ని శైలు చెవిన పడేస్తారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే శైలు సీతా, రఘురాం తమ ఇంటికి మారువేషాల్లో వచ్చారు అనే విషయాన్ని ముందు నమ్మదు కానీ దుర్గా, పార్వతి ఫోటోలతో సహా వివరంగా చూపించడంతో తానూ మోసపోయినట్టు భావిస్తుంది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయం అంతా వివరంగా చెబుతుంది. వెంటనే నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి బయలుదేరి వెళుతుంది.

మోసం చేశారు అని
బయలుదేరి వెళ్లిన తర్వాత తనను మోసం చేశారు అని చెబుతూ బాధపడుతోంది అయితే ఈ విషయం లక్ష్మణ్ కి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే విషయాన్ని మనం కనుక్కోవాలి అని తండ్రి చెబుతాడు. అంటే లక్ష్మణ్ చాలా మంచివాడు అని తనకు తెలిస్తే కనుక నాకు చెప్పకుండా ఉండడు అని శైలు వెనకేసుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అది నమ్మని జనార్ధన్ సరే దానికి ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ పెడదామని అంటాడు. అలా శైలు ని ఇంటికి పంపించిన తర్వాత బావమరిది లింగాన్ని పిలిచి అసలు వంట వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తాడు. తెలిసిన వాళ్ళు అని చెబుతూ ఉండగా లింగం రెండు చెంపలు వాయిస్తాడు. దీంతో షాక్ అయిన లింగం ఎట్టకేలకు తన బావ దగ్గర నిజం ఒప్పుకుంటాడు. నువ్వు ఏమైనా చేస్తావు అని భయంతో నేను ఇప్పటివరకు నిజం ఒప్పుకోలేదు అని బయట పడతాడు.

తప్పేం కాదు కానీ
అయితే నిజంగా నువ్వు భయపడి ఉంటే తప్పేం కాదు కానీ నువ్వు కావాలని నన్ను మోసం చేయడానికి ఇలా చేసి ఉంటే మాత్రం క్షమించేది లేదు అంటాడు. అయితే కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా కార్తీక వనభోజనాలు నుంచి తప్పుకున్న శైలు గురించి కుటుంబ సభ్యులందరూ వెతుకుతూ ఉంటారు. తనకు కడుపు నొప్పి వచ్చింది, అందుకే ఇంటికి వచ్చాను అని అబద్ధం చెప్పడంతో కుటుంబ సభ్యులు అందరూ బాధపడతారు. వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి హుటాహుటిన బయలుదేరి ఇంటికి వెళతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత శైలు ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది కానీ ఎవరూ గమనించరు. ఆ రాత్రి తనకు ఆరోగ్యం బాగోలేదు అని ఎలాంటి భోజనం చేయకుండా పడుకున్న శైలు తెల్లవారగానే తనకు చేపల పులుసు కావాలి అని మారాం చేస్తుంది.

శైలు బాధపడుతూ
సీత వండిన చేపల పులుసు కాకుండా తనకు రిషి పుట్టినరోజు నాడు వచ్చిన వంట వాళ్ళు చేసిన చేపల పులుసు కావాలి అని ఫిట్టింగ్ పెడుతుంది. వెంటనే వాళ్ళకి విషయం అర్థం కాదు కానీ తినాలనిపించింది ఏమో అనే ఉద్దేశంతో సరే తీసుకువస్తామని అన్నారు. మీరు తీసుకురాకపోతే మా నాన్నకి ఫోన్ చేసి తెప్పించుకుంటా, అని శైలు అనడంతో అదేమీ కాదు మేమే తెచ్చి పెడతామని లక్ష్మణ్ అంటాడు. సీత వదిన తో మాట్లాడుతూ మరేం పర్వాలేదు అప్పుడు వండింది కూడా సీత వదినే కదా ఇప్పుడు వండేస్తే బయట నుంచి తీసుకు వచ్చినట్లు ప్యాకింగ్ చేసి తీసుకు వస్తాను అంటాడు. ఈ విషయం విన్న తర్వాత తాను మోసపోయానని శైలు బాధపడుతూ ఉంటుంది. భర్త కూడా వాళ్లతో కలిసి తనకు వెన్నుపోటు పొడిచాడు అని ఆమె భావిస్తూ ఉంటుంది..ఇదే విషయాన్ని తండ్రికి చేరగా తండ్రి ఏం చేయాలో ప్లాన్ సిద్ధంగా ఉంచుతాడు.

కమింగ్ అప్ ప్రకారం
ఇక మరోపక్క ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ ప్రకారం నాని ఇంటికి తాగి వస్తాడు. ఎందుకు తాగి వచ్చావు అని ప్రశ్నిస్తే తన చుట్టూ జరగవు అనుకున్నది చాలా జరుగుతున్నాయని తాను కూడా ఇంకా మారకుండా అలాగే ఉంటే కష్టం అని చెబుతాడు. ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తే మా అత్తగారు నన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అని చెబుతాడు, ఇంకేమో అనబోగా ఇది మా భార్య భర్తల సమస్య మీరు ఇవాల్వ్ అవ్వకండి అంటారు. చూడాలి మరి ఏం జరగబోతోంది.


Click it and Unblock the Notifications











