Vadinamma : సీతను చేయి చేసుకోబోయిన ఎస్సై.. భాస్కర్ ఎంట్రీతో షాక్.. జనార్దన్ ఇంటి మీద రైడ్?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 727వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం, దానికి రఘు రామ్ సీతలు హాజరైన సంగతి తెలిసిందే. దుర్గ, పార్వతి కలిసి వంట వాళ్ళు రఘురాం, సీత అని శైలుకు చెప్పడానికి ప్రయత్నించి ఎట్టకేలకు ఆ విషయాన్ని శైలు చెవిన పడేస్తారు. దీంతో రగిలిపోయిన శైలు తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది.
అయితే ఇందులో అల్లుడి హ్యాండ్ కూడా ఉందని నిరూపించిన రాజేంద్ర కుమార్తెను తన వైపు తిప్పుకుంటాడు. ప్లాన్ ప్రకారం రిషిని దాచేసి కిడ్నాప్ డ్రామా ఆడతాడు. అదే సమయానికి రఘురాం వ్యాపారం మీద పూణే వెళతాడు, దీంతో అతనే తీసుకువెళ్లాడు అని అభాండాలు వేస్తారు. భరత్ అరెస్టయి పోలీస్ స్టేషన్ లో ఉండగా సీతా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. మా మరిది ఇచ్చిన కంప్లైంట్ ఎంతవరకు వచ్చింది అని ప్రశ్నిస్తుంది. బాబు ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద ఏమైనా సమాచారం అందిందా? అని ప్రశ్నిస్తుంది. అయితే అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

కొడుకుతో చెబుతూ
నాటకం ఆడి హాస్పిటల్ బెడ్ ఎక్కిన శైలు తన భర్త సహా మిగతా అందరూ టెన్షన్ పడుతుంటే తాను మాత్రం పిల్లవాడితో ఆడుకోవడం కోసం ఇంటికి వస్తుంది. తన పిల్లవాడు కోసం సీతా రఘురాం ఎంత తపన పడుతున్నారు అనే విషయాన్ని వెల్లడించి ఇకమీదట అయినా నిన్ను వాళ్లకి దక్కకుండా చూసుకుంటాను అని కొడుకుతో చెబుతూ ఉంటుంది. మరోపక్క భరత్ అరెస్టయి పోలీస్ స్టేషన్ లో ఉండగా అతనికి భోజనం తీసుకువెళ్ళిన సిరి నీకెందుకు ఈ కష్టాలు అన్నట్లు మాట్లాడుతుంది.

వీళ్లు నన్ను వదలరు
అయితే నేను బయటకు రావాలి అంటే ఇక్కడికి రఘురామ్ అన్నయ్య రావాలి. ఆయన అరెస్ట్ అయితే కానీ వీళ్లు నన్ను వదలరు. నేను బయట ఉండడం కంటే రఘురాం అన్నయ్య బయట ఉండటం చాలా ముఖ్యం ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని భరత్ అంటాడు. అలా భారత్ సిరి బాధపడుతూ ఉండగా మరో పక్క సీత కూడా ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది.
లక్ష్మణ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుని ఆమె బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రఘురాం తల్లి రాజేశ్వరి నువ్వు బాధపడటం కాదు అసలు బాబు ఎక్కడ ఉన్నాడు? అనే విషయం తెలిస్తే ఇప్పుడు ఉన్న సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందని చెబుతుంది.

పోలీస్ స్టేషన్ కి బయలుదేరి
అలా చెప్పడంతో నిజమే నని భావించి సీత హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి బయలుదేరి వెళుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన సీతను చూసి ఎస్.ఐ ఎందుకు వచ్చావు? మీ మరిది కోసం అయితే అక్కడ ఉన్నాడు వెళ్లి చూసుకో అని చెబుతాడు. నేను వచ్చింది మా మరిదిని పలకరించడం కోసం కాదు మా ఇంట్లో బిడ్డ తప్పిపోయాడు అని కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ ఆ విషయం ఎంతవరకు వచ్చింది అని ఆమె ప్రశ్నిస్తుంది. అసలు వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తే నీకేంటి అని ఎస్ఐ ప్రశ్నిస్తాడు. ఎవరో కాదు కంప్లైంట్ ఇచ్చింది నా మరిది కంప్లైంట్ ఇచ్చాడు, తప్పిపోయింది నా బిడ్డ తెలుసుకునే హక్కు నాకు ఉంది అని అంటుంది..

సీత మీద ఎస్సై చేయి
మాటా మాటా పెరగడంతో సీత మీద ఎస్సై చేయి ఎత్తాడు, అదే సమయంలో అక్కడికి ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ ఎస్ఐ చేతిని తోసి వేయడమే కాక నీ అంతు తేలుస్తాను అని చెబుతూ అప్పటికప్పుడు ఏసీపీకి ఫోన్ చేసి విషయం అంతా చెబుతారు. భాస్కర్ మాటలతో ఏసిపి ఇక్కడికి రావడం ఎస్సై చేసిన తప్పు గురించి తెలుసుకోవడం అతనికి వార్నింగ్ ఇవ్వడం వెంటవెంటనే జరిగిపోతాయి. అంతేకాక పిల్లవాడిని వెతకడం కోసం మీరేం చేశారు అంటే రఘురాం ప్లేస్లో అతని తమ్ముడి ని అరెస్ట్ చేశామని చెప్పడంతో ఇది కరెక్ట్ కాదు ముందు పూణే పోలీసులను సంప్రదించండి అని డైరెక్షన్స్ ఇస్తాడు. అలా చెప్పి ఆయన అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

నెత్తి మీద పిడుగు పడే టట్లు
తరువాత జనార్ధన్ కి ఫోన్ చేసిన ఎస్ఐ నేను మీ మాట వింటుంటే నా నెత్తి మీద పిడుగు పడే టట్లు కనిపిస్తోంది అని విషయం అంతా చెబుతాడు. అయితే జనార్ధన్ ఏం చేయాలో ఎస్సైకి చెబుతాడు. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించగానే తరువాతి ఎపిసోడ్ లో కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సీత అనుమానంతో ఏసిపి సెర్చ్ వారెంట్ తీసుకుని జనార్దన్ ఇంటికి వెతికేందుకు వచ్చినట్లు చూపించారు. అయితే బాబు లోపల ఉండడంతో శైలు సహా జనార్ధన్ కూడా వణికిపోతూ కనిపించారు చూడాలి తర్వాత ఏం జరగబోతోంది.


Click it and Unblock the Notifications











