Vadinamma : అమ్మ కళ్ళలో కారం కొట్టిన సిరి.. శైలుకు అనుమానం రావడంతో షాక్.. ఏమైందంటే?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 714 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. రఘురాం అక్కడికి కూడా వెళ్లి బాబు పడిపోతుంటే కాపాడటానికి ప్రయత్నిస్తే తప్పుగా అర్థం చేసుకుని రఘురామ్ ను దొంగగా భావించి ఇంట్లో అందరూ చితక బాదారు. రఘురాం ఇక్కడ కూడా వదలడం లేదు అనే ఉద్దేశంతో నేను అసలు మీ ఇంటికి రాను అన్నట్లు శైలు మాట్లాడుతుంది.

తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చెబుతూ రఘురాం, సీతను పిలవడం లేదని చెబుతారు లక్ష్మణ్. ఎలా అయినా అక్కడికి వెళ్లాలని ఉద్దేశంతో భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషములో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందుతారు. అలా గత ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

బయటికి తరిమేయాలని

బయటికి తరిమేయాలని

నాని ఫంక్షన్ కి రాకపోవడంతో ఎలా అయినా రప్పించాలి అనే ఉద్దేశంతో భరత్ అనేక సార్లు ఫోన్ చేస్తాడు కానీ నాని లక్ష్మణ్ అన్న చేయించకుండా భరత్ అన్న ఫోన్ చేస్తున్నాడా అని అనుమాన పడతాడు. అందుకే ఆయన ఫోన్ కూడా ఎత్తడం మానేస్తాడు.

దీంతో ఒక వాయిస్ మెసేజ్ పెడతాడు భరత్.. బర్తడే పార్టీకి అన్నయ్య వదిన సహా అందరం వచ్చాము అని నువ్వు కూడా రావాలని ఆ మెసేజ్ సారాంశం.. అనూహ్యంగా ఈ విషయం దమయంతి చెవిన పడగాన్ని కొట్టి మరి జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు వస్తే బయటికి తరిమేయాలని ఆర్డర్ వేస్తాడు.

కడుపు మంట

కడుపు మంట

ఇది ఇలా జరుగుతూ ఉన్న సమయంలో పార్వతి, దుర్గ ఇద్దరూ కూడా సీత మీద తమ కడుపు మంట తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. వాళ్ళు రాలేదు అయినా సరే ఇక్కడ ఎలాంటి గొడవ జరగడం లేదు, ఏదో ఒకటి చేసి వాళ్ళ మీద మన కడుపు మంట తీర్చుకోవాలని భావిస్తూ ఉంటారు. వాళ్లు నోరు తూలుతున్న సమయంలో సిరి అక్కడికి చేరడంతో దగ్గరలో ఉన్న కారం వాళ్ళ కళ్ళల్లో కొట్టాలని భావిస్తుంది..

అలా చేయవద్దు చేస్తే కళ్లు మండుతాయని ఒక పక్క రఘురాం మరో పక్క సీత ఎంత మొత్తుకుంటున్నా మీకు తెలియదు వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పాలి అని చెబుతూ వాళ్ళ కళ్ళల్లో కారం పడేట్టు చేస్తుంది. కుయ్యో మొర్రో అంటూ కళ్ళు నులుముకుని పార్వతి, దుర్గ ఇద్దరు కూడా అక్కడి నుంచి నిష్క్రమిస్తారు.

రిషి ఏడుపు

రిషి ఏడుపు

మరోపక్క రిషి ఏడుపు మొదలు పెడతాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదుగానీ, అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ, పార్వతి, దుర్గ, భరత్, సిరి ఇలా ఎంతమంది ఎత్తుకున్నా ఏడుపు మాత్రం ఆపడు. ఎవరి దగ్గర ఉంటే ఏడుపు ఆపుతాడో తెలిసిన లక్ష్మణ్ శైలు కళ్ళు కప్పి బుడతడి ని తీసుకుని వెళ్లి తన వదినకు అప్పగిస్తాడు. ఏదో మ్యాజిక్ చేసినట్లు అప్పటిదాకా ఏడుస్తూ వచ్చిన బుడతడు సీత దగ్గరకు రాగానే ఏడుపు ఆపేస్తాడు.. అప్పుడే సీత బుడతడితో మాటలు చెబుతూ ఉన్న సమయంలో శైలు అక్కడికి వస్తుంది ఎంతమంది ఓదార్చినా వదలకుండా ఏడుస్తూనే ఉన్న బాబు ఆమె ఓదారిస్తే ఎలా సైలెంట్ అయిపోయాడు అని ఆమె బుర్ర బద్దలు కొట్టుకుంటుంది.

 సీత తెలివిగా

సీత తెలివిగా

వెంటనే సీత తెలివిగా స్పందిస్తూ పిల్లలని ఊరకో పెట్టే విధానాలు మా కాలంలో వేరేగా ఉండేవి మీకు ఎవరికీ ఆ పద్ధతులు రావు అంటుంది. అవును నిజమే మా సీతక్క కూడా ఇలాగే పిల్లలను చాలా బాగా సాగేది అన్నట్లు మాట్లాడుతారు. మరి అలాంటప్పుడు ఆమె ఎందుకు రాలేదు అన్నట్టు నిష్టూరం ఆడుతుంది. లేదని చిన్న చిన్న మనస్పర్ధలు వాళ్ళు రాలేదని శైలు చెబుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం లింగం రఘురాం సీత కోసం వెతుకుతూ ఉంటాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో

ఇంతలో మేమే రఘు రామ్, సీత అయితే ఎలా తెలుస్తుంది మేము మారువేషంలో వచ్చాము ఏమో అని లింగంతో అంటాడు రఘురాం. అయితే అప్పుడు లింగం నమ్మడు గాని రఘురాం నడుచుకుంటూ వెళుతున్న సమయంలో రఘు గడ్డం ఊడిపోవడంతో అతను రఘురాం అనే విషయాన్ని పసిగడతారు.

ఈ దెబ్బతో విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయి, శైలు, శైలు తండ్రి ఇద్దరూ కూడా షాక్ అయినట్టు చూపిస్తున్నారు. మొత్తం మీద రాబోయే ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు చాలా సైలెంట్ గా జరుగుతున్న సీరియల్ లో పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశాలు కూడా రాబౌయే ఎపిసోడ్స్ లో కనిపిస్తున్నాయి. చూడాలి సీరియల్ ఇకమీదట ఎలా ఉంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X