Vadinamma : కొట్టుకున్న లక్ష్మణ్-భరత్.. రఘురాం ఇంట రావణకాండ.. బయటకు వెళ్లిపోయిన లక్ష్మణ్?
వదినమ్మ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతం ఈ సీరియల్ 731వ ఎపిసోడ్ కి చేరుకుంది. కొద్ది రోజుల నుంచి రఘురాం బాబు ని కిడ్నాప్ చేశాడు అన్న సస్పెన్స్ డ్రామ్ా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రఘు రామ్ సీత తాను పిలవకపోయినా తన ఇంటికి మారువేషంలో వచ్చి తన కొడుకుని తన కంటే ముందు దీవించారు అని తెలుసుకున్న శైలు తన తండ్రితో కలిసి ఈ కిడ్నాప్ డ్రామా ఆడింది.
రిషిని స్వయంగా జనార్ధన్ ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకుంటారు. కొడుకు కిడ్నాప్ అయ్యాడు అనే విషయం తెలుసుకుని స్వయంగా శైలు మర్చిపోయినట్టు గా నటిస్తుంది. రఘురాం అప్పుడే వేరే ఊరు వెళ్ళడంతో రఘురాం స్వయంగా ఆ బుడతడి ని కిడ్నాప్ చేశాడు అని ప్రచారం చేస్తారు..

తాజా ఎపిసోడ్ లో
ఎమ్మెల్యే అయిన జనార్ధన్ తన పలుకుబడితో రఘురాం మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తాడు.. స్వయంగా లక్ష్మణ్ కంప్లైంట్ ఇప్పించాలని భావించి అతని మభ్యపెట్టి పోలీస్ కంప్లైంట్ ఇప్పించడం తో ముందుగా సీతను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇంటికి వస్తారు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న భరత్ సీత అరెస్టు కాకుండా తాను అడ్డం వెళ్ల బోతాడు. ఈ క్రమంలో సీత అరెస్టు కాకుండా భరత్ అరెస్ట్ అవుతాడు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. సీత బాబు జనార్ధన్ ఇంట్లోనే ఉన్నాడు అని అనుమానంతో పోలీసులు అక్కడికి తీసుకు వెళ్లి సెర్చ్ వారెంట్ తీసుకుని మరి వెతికిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే బాబుని లింగం తీసుకుని ఫామ్ హౌస్ కి వెళ్ళాడు.. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు ఇక తాజా ఎపిసోడ్ లో జరిగిన దాని ప్రకారం ఏమైందంటే?

లింగాన్ని చితకకొట్టి
లింగం ఫామ్ హౌస్ కి వెళ్లడం తెలుసుకున్న రఘురాం వెంటనే అక్కడికి వెళ్లి లింగాన్ని చితకకొట్టి తీసుకొచ్చి పోలీసుల ముందు పడేస్తాడు. అప్పుడే మీ మాటలు విని ఇక్కడ దాకా వచ్చి ఫూల్స్ అయ్యాము అంటూ చెబుతున్న పోలీసులకు జరిగిన విషయం ఇది అనే క్లారిటీ ఇస్తాడు రఘురాం. అక్కడి నుంచి బాబుని తీసుకుని లక్ష్మణ్ ఇంటికి వెళతాడు.. అయితే తన తండ్రి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వదు అని లక్ష్మణ్ దగ్గర శైలు మాట తీసుకుంటుంది.
అలా మాట తీసుకుంటున్న సమయంలో భరత్ దొంగచాటుగా చూస్తాడు అయితే లక్ష్మణ్ తన భార్య కి మాట ఇవ్వడం భారత్ కి ఏ మాత్రం నచ్చదు. అన్నయ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమైన లక్ష్మణ్ సొంత మామ మీద మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారు అని భరత్ ఆలోచిస్తాడు.

పరిస్థితులు వేరేగా
ఈ లోపు సీత రఘురాం ఇద్దరూ కూడా శైలు ని కిందకి పిలిచి నువ్వు చేసిన సంగతి అంతా మాకు అర్థం అయింది అని అంటారు. అయితే శైలు నాకు మాట్లాడే ఓపిక లేదు ఇప్పుడు నేను మాట్లాడలేను అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ సీత మాత్రం ఆమెను వదలరు. ఈ క్రమంలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం లో నీ హ్యాండ్ కూడా ఉందనే సంగతి మాకు తెలుసు అని సీత రఘు రాం ఇద్దరూ బాంబు పేలుస్తారు.
ముందు కాస్త టెన్షన్ పడిన శైలు ఇక విషయం అర్థం అయిపోయింది కదా అని లైట్ తీసుకుంటుంది. అయితే ఏంటి అన్నట్లు మాట్లాడితే ఈ విషయాన్ని ఇప్పటివరకు నీ మొగుడికి చెప్పలేదు అతనికి చెబితే పరిస్థితులు వేరేగా ఉంటాయి అని చెబుతోంది. అంటే నన్ను బెదిరిస్తున్నావా ? నన్ను మీరు ఏమీ చేయలేరు అని శైలు మాట్లాడుతుంది.

మామ గారి మీద పోలీస్ కంప్లైంట్
అయితే ఇదంతా ఒకలా జరుగుతూ ఉంటే మరో పక్కన భరత్, లక్ష్మణ్ దగ్గరకు వెళ్లి నువ్వు మీ మామ గారి మీద పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాను అని అనడం నాకు ఏమాత్రం నచ్చలేదు అని అంటాడు. వాళ్ళ ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తన్నుకుంటారు కూడా. ఇదంతా చూసి భయపడిన సిరి పైకి పరిగెత్తుకొని వెళ్లి మిగతా అందరిని రమ్మని అంటుంది రఘు రామ్, సీత పైకి వెళ్లి వాళ్ళని ఆపడానికి ప్రయత్నించి లోపల నాని వెళ్లి వారిని ఆపడానికి ప్రయత్నిస్తుండగా భరత్ కోపంతో నాని మీద కూడా చేయి చేసుకుంటాడు. ఇదంతా చూసి రఘురాం చాలా బాధపడతాడు. ఏమిటి పరిస్థితులు ఇలా తయారయ్యాయి అని బాధ పడుతూ ఉండగా సీతా మీరు కొట్టుకోవడం కాదు నన్ను చంపి చేయండి అని బాధపడుతుంది..

కమింగ్ అప్ లో
అయితే ఈ గొడవ తర్వాత ఇంట్లో నేను అయినా ఉండాలి భరత్ అయినా ఉండాలి, అని లక్ష్మణ్ అంటాడు. లక్ష్మణ్ విషయంలో భరత్ కూడా అదే డైలాగ్ వేసి చాలెంజ్ చేసి వెళ్ళాడు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ బాధలో మునిగి పోతారు. ఆ తర్వాత కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం లక్ష్మణ్ తన భార్య శైలు, రిషితో కలిసి బయటకు వెళ్లడానికి సిద్ధమయ్యే బయటకు వస్తాడు. చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది.


Click it and Unblock the Notifications











