Vadinamma : తీవ్ర గాయాలతో దొరికిన లక్ష్మణ్.. జనార్ధన్ అరెస్ట్ కు రెడీ?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నా ఇప్పుడు వారి మధ్య గొడవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ సహా తన భార్య శైలు కూడా ఫిక్స్ అవుతుంది. మరొక రోజులో ఇంటి నుంచి వెళ్లిపోవాలి అని డెడ్ లైన్ కూడా విధించుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవుతాడు.

లక్ష్మణ్ గురించి వేరే వ్యక్తి తప్పుగా మాట్లాడడం తో భారత్ అతని మీద చేయి చేసుకుంటాడు. దీంతో అతను కొంత మంది రౌడీలను తీసుకుని వచ్చి భరత్ ను ఎటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఎంతసేపటికి భరత్ దొరకకపోవడంతో లక్ష్మణ్ మీద ఎటాక్ చేయడానికి వారు సిద్ధం అవుతారు. అలా దాడి చేయడంతో చివరి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లక్ష్మణ్ దాడికి గురై

లక్ష్మణ్ దాడికి గురై

దాడికి గురై లక్ష్మణ్ పొదలలో పడిపోయి ఉండడంతో పక్కనే ఉన్నా సరే రఘురాం అతనిని గుర్తించలేకపోతారు. అయితే రాత్రి సమయం అవుతున్నా సరే లక్ష్మణ్ ఇంటికి రాకపోవడంతో ముందుగా సీత కంగారు పడుతోంది. ఎంత సమయం అయింది, రోజు ఈ పతికి ఇంటికి వచ్చే లక్ష్మణ్ ఇప్పటికీ కూడా ఇంటికి రాలేదు అని ఆమె ఆదుర్దా పడుతూ ఉంటుంది. అయితే తన భర్త రాలేదు అని శైలు మాత్రం ఎలాంటి టెన్షన్ పడదు.

తన భర్త ఇంటికి రాకపోవడానికి ఇంట్లో వాళ్లే కారణం అని భావిస్తూ ఉంటుంది. అయితే లక్ష్మణ్ ఇంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన సీత అతనిని వెతుక్కుని ఇంటికి తీసుకొని రావాల్సిందిగా ముందు భర్తకు చెబుతుంది. అయితే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా కొంచెం ఆలస్యంగా వస్తాడు ఏమో అని భర్త అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు కదా ఇంకా ఏమి గొడవలు జరుగుతాయి అని సీత అంటుంది.

ఇంకా ఇంటికి రాలేదు

ఇంకా ఇంటికి రాలేదు

అయినా సరే కంగారు తగ్గకపోవడంతో భరత్ దగ్గరకు వెళ్లి మీ అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళాడో కాస్త ఇంటికి తీసుకుని రా అని చెబుతోంది. ఇంతలో శైలు వచ్చి భరత్ ను అక్కడికి పంపడానికి వీలులేదు అన్నట్లు మాట్లాడుతుంది. భాత్ మాత్రం నేను నాని కలిసి అక్కడికి వెళ్లి వెతికి వస్తాం, అన్నయ్య ఎక్కడ ఉన్నాడో వెతుకుతాను అని బయలుదేరుతారు. నానితో పాటు భరత్ బయటకు వెళ్లి దాదాపు ఊరిలో ఉన్న అన్ని ప్రదేశాలలో వెతుకుతారు. కనబడిన ప్రతి ఒక్కరిని మా అన్నయ్య కనబడ్డాడా? అని ప్రశ్నిస్తూ వారు ముందుకు సాగుతూ ఉంటారు.

ఇంట్లో వాళ్ళు కంగారు పడి

ఇంట్లో వాళ్ళు కంగారు పడి

కానీ వీరికి ఎక్కడా లక్ష్మణ్ జాడ అయితే కనిపించదు. చాలా సేపటి తర్వాత ఇంటికి వచ్చిన భరత్, నాని ఇద్దరినీ చూసి ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు ఇంకా లక్ష్మణ్ ఇంటికి పోవడం ఏమిటి అని భయపడతారు. ఇంతలో శైలు కూడా నటిస్తూ తన తండ్రికి ఫోన్ చేసి చెబుతాను అని చెప్పి అతనిని ఇంటికి పిలుస్తుంది. అప్పటికి కూడా తన భర్త నాటకం ఆడుతున్నాడు నేను నాటకం ఆడాలని భావిస్తూ ఏడుస్తుంది. సీత భయంతో వెళ్లి దగ్గర దగ్గరకు అతనిని నిద్రలేపి ఈ విషయం చెబుతోంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రమ్మని చెబితే లేదు నేను భరత్ మరోసారి వెతకడానికి వెళతాం అని చెప్పి అతనిని తీసుకుని బయటకు వెళ్లారు.

ఊరంతా గాలిస్తూ

ఊరంతా గాలిస్తూ

రఘురాం, భరత్, ఇద్దరూ కలిసి లక్ష్మణ్ కోసం ఊరంతా గాలిస్తూ ఉంటారు. నాని, భరత్ ఎలా అయితే వెతికారో, వాళ్ళిద్దరూ కూడా దాదాపుగా అన్ని ప్రదేశాలలో చేస్తారు. అయినా సరే ఎక్కడ కూడా లక్ష్మణ్ జాడ మాత్రం కనిపించదు లక్ష్మణ్ జాడ కనిపించకపోవడంతో రఘురాం నిరాశకు లోనవుతున్నారు. అయితే ఒక చోట ప్రజలు గుమిగూడి ఉండడం గమనించి రఘురాం అసలు అక్కడ ఏం జరిగింది అని ఒక వ్యక్తిని అడిగితే ఒక వ్యక్తి ఎవరో దాడి చేసి పడేసారు అతనికి తీవ్రగాయాలయ్యాయి, ఇంకాసేపట్లో హాస్పిటల్ కి తీసుకు వెళ్లి పోతే చనిపోతాడు అన్నట్లు మాట్లాడడంతో రఘురాం కంగారు పడతాడు.

కమింగ్ అప్

కమింగ్ అప్

అయితే భారత్ మాత్రం అది మన అన్నయ్య అయి ఉండదు అయినా ఎవరో చూద్దాం పదాని రఘురాం ని తీసుకుని వెళతాడు. అనూహ్యంగా వీళ్లిద్దరు వెళ్లి చూసే సమయానికి అక్కడ నిజంగానే లక్ష్మణ్ గాయాలపాలై పడి ఉంటారు. దీంతో షాక్ కి గురైన రఘురాం వెంటనే హుటాహుటిన అతనిని హాస్పిటల్ కి తరలిస్తారు.

ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం దాని ప్రకారం జనార్ధన్ ని అరెస్ట్ చేయాలని ఏసీపీ కోరడం కనిపిస్తోంది. అయితే ఈ విషయం మీద నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అని రఘురాం భరత్ మీద సీరియస్ అయినట్టు చూపిస్తున్నారు. అన్న, వదిన తన మీద కోపంగా ఉండటంతో భారత్ కూడా బాధపడుతున్నట్లుగా చూపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X