Vadinamma : లక్ష్మణ్ సేఫ్.. జనార్ధన్ ఎంట్రీతో ముసలం.. భరత్ మీద పగ పెంచుకున్న లక్ష్మణ్
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నా ఇప్పుడు వారి మధ్య గొడవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ సహా తన భార్య శైలు కూడా ఫిక్స్ అవుతుంది. మరొక రోజులో ఇంటి నుంచి వెళ్లిపోవాలి అని డెడ్ లైన్ కూడా విధించుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవుతాడు.
Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఏమైందంటే
లక్ష్మణ్ గురించి వేరే వ్యక్తి తప్పుగా మాట్లాడడం తో భారత్ అతని మీద చేయి చేసుకుంటాడు. దీంతో అతను లక్ష్మణ్ మీద ఎటాక్ చేస్తాడు. ఎంతసేపటికి లక్ష్మణ్ ఇంటికి రాకపోవడంతో భరత్, నాని, రఘురాం భరత్ ను వెతికేందుకు బయటకు వస్తారు. ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తికి గాయాలు అయి పడి ఉంటే ఎవరో చూద్దాం పదని రఘురాం తీసుకుని వెళతాడు. అనూహ్యంగా వీళ్లిద్దరు వెళ్లి చూసే సమయానికి అక్కడ నిజంగానే లక్ష్మణ్ గాయాలపాలై పడి ఉంటారు. దీంతో షాక్ కి గురైన రఘురాం వెంటనే హుటాహుటిన అతనిని హాస్పిటల్ కి తరలిస్తారు. అక్కడితో చివరి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హాస్పిటల్లో జాయిన్ చేసి
లక్ష్మణ్ గాయాలపాలై పడి ఉండడంతో అతనిని హుటాహుటిన హాస్పిటల్ కి తరలిస్తారు భరత్, రఘురాం. అయితే ఎంత సేపటికీ వీరు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అందరూ ఒక పక్క టెన్షన్ పడుతూ ఉంటారు రఘురాం డాక్టర్ తో మాట్లాడుతున్న సమయంలో భరత్ పక్కకు వచ్చి తన భార్య సిరి కి ఫోన్ చేసి పక్కకు రావాల్సిందిగా కోరతాడు. దీంతో సిరి కంగారుపడుతూ పక్కకు వస్తుంది పక్కకు వచ్చిన తర్వాత ఇలా లక్ష్మణ్ గాయాలపాలు రోడ్డు మీద పడిపోయి ఉన్న సంగతి చెబుతాడు భరత్.. అయితే ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పవద్దు అని కోరుతాడు. సిరి ఈ విషయాన్ని ఎలా దాయాలో అర్థం కాక లక్ష్మణ్ బాగానే ఉన్నాడు అని రఘురాం, భరత్ కలిసి లక్ష్మణ్ ని ఇంటికి తీసుకు వస్తాడు అని చెబుతుంది. అయితే ఆ రోజు రాత్రి గడుస్తుంది కానీ ఇంటికి ఎవరూ రాక పోవడంతో ఉదయాన్ని సీత సిరిని ప్రశ్నిస్తూ ఉంటుంది.

హాస్పిటల్ నుంచి ఇంటికి
సరిగ్గా అదే సమయానికి భరత్ వస్తాడు. భరత్ వచ్చిన తర్వాత అసలేం జరిగింది అని సీత ప్రశ్నిస్తున్న సమయంలో రఘు రామ్ లక్ష్మణ్ కూడా ఆటో లో ఇంటికి వస్తారు. ఆటో లో ఇంటికి వచ్చిన సమయంలోనే శైలు తండ్రి జనార్ధన కూడా అక్కడికి వస్తాడు. అసలు ఏం జరిగింది అనే విషయం ఎవరో బయట పెట్టకుండానే దీనంతటికీ కారణం భరత్ అన్నట్లుగా శైలు, శైలు తండ్రి మాట్లాడుతారు. జనార్ధన్ ఇంకా పెట్రేగి పోయి మాట్లాడుతూ ఉన్న సమయంలో సీత అన్న భాస్కర్ ఎంట్రీ ఇచ్చి అసలు జనార్ధన్ కు మాట్లాడే అర్హత లేదని అంటాడు. జనార్ధన్ సీత రఘురాం ఇద్దరూ తన ఇంట్లో దొంగతనంగా ప్రవేశించిననపుడే వారి పెద్దరికం మంటగలిసింది అని అనడంతో అసలు నువ్వు బయట ఉండడమే ఎక్కువ నిన్ను అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు అని భాస్కర్ ప్రశ్నిస్తాడు.

సీరియస్ గా
శైలు, శైలు తండ్రి జనార్ధన్ ఇద్దరూ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా రఘురాం కుటుంబ సభ్యుల మీద ఫైర్ అవుతున్న క్రమంలో భరత్ జనార్ధన్ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా భరత్ కు బాసటగా నిలిచి జనార్ధన్ ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరుతారు. అయితే లక్ష్మణ్ జనార్ధన్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన నోరు ఎలాగో మూయించి పంపించారు, మరి నా దెబ్బలు తగలడానికి కారణమైన భరత్ను ఏం చేస్తారు అని ప్రశ్నిస్తాడు. అదేంటి నీకు ఎలా దెబ్బలు తగిలాయి అని అడగడంతో భరత్ ఎవరినో ఏదో అన్నాడని వాళ్ళు కక్షగట్టి తన మీద దాడి చేశారని చెబుతాడు. అయితే భరత్ మాత్రం అసలు ఏం జరిగింది అనే విషయం గుర్తు తెచ్చుకుంటే లక్ష్మణ్ ని తప్పుగా మాట్లాడడం తో తాను ఒకరి చెంప పగలకొట్టిన విషయం గుర్తుకు వస్తుంది.

జనార్ధన్ అరెస్ట్
ఇది ఇలా జరుగుతూ ఉన్న సమయంలోనే ఈ రోజు ఎపిసోడ్ ముగించారు ఇక తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం దాని ప్రకారం జనార్ధన్ ని అరెస్ట్ చేయాలని ఏసీపీ కోరడం కనిపిస్తోంది. అయితే ఈ విషయం మీద నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అని రఘురాం భరత్ మీద సీరియస్ అయినట్టు చూపిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వారు కోప్పడతారు. అన్న, వదిన తన మీద కోపంగా ఉండటంతో భారత్ కూడా బాధపడుతున్నట్లుగా చూపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











