Vadinamma : బాంబు పేల్చిన రాజేశ్వరి.. దెబ్బకు షాకైన రఘురాం.. శ్రీను మీద భరత్ దాడి!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 739 వ ఐపిసోడ్ కు చేరింది. ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నారు. అయితే ఇప్పుడు వారి మధ్య గొడవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని లక్ష్మణ్ సహా ఆయన భార్య శైలు కూడా ఫిక్స్ అవుతుంది. మరొక రోజులో ఇంటి నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవుతాడు.

తప్పుగా మాట్లాడడం తో

తప్పుగా మాట్లాడడం తో

లక్ష్మణ్ గురించి వేరే వ్యక్తి తప్పుగా మాట్లాడడం తో భరత్ అతని మీద చేయి చేసుకుంటాడు. దీంతో అతను లక్ష్మణ్ మీద ఎటాక్ చేస్తాడు. ఎంతసేపటికి లక్ష్మణ్ ఇంటికి రాకపోవడంతో భరత్, నాని, రఘురాం భరత్ ను వెతికేందుకు బయటకు వెళ్తారు అలా అనుకోకుండా దాడికి గురైన లక్ష్మణ్ ని హాస్పిటల్ కి తరలిస్తారు. ఇంటికి వచ్చాక లక్ష్మణ్ కారణంగా భరత్, జనార్దన్ మధ్య గొడవ జరుగుతుంది. అక్కడితో చివరి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పోలీస్ కంప్లైంట్ ఇస్తే

పోలీస్ కంప్లైంట్ ఇస్తే

లక్ష్మణ్ కి గాయాలపాలై ఇంటికి వచ్చిన తర్వాత జనార్దన్ తప్పుగా మాట్లాడుతూ ఉంటే అతనిని ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరతారు. అయితే లక్ష్మణ్ మీద దాడి చేసిన వారిని ఏం చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి లేకపోతే గొడవ మరింత పెద్దది అవుతుంది అని రఘురామ్ అంటాడు. అక్కడే ఉన్న భాస్కర్ అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాడి చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ దాడి చేయకుండా ఉంటారు కదా అంటాడు. లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తే గొడవ మరింత పెద్దది అవుతుందని రఘురాం వారిస్తాడు.

అసలు ఏం జరిగింది

అసలు ఏం జరిగింది

ఇంతలో శైలు కల్పించుకుని గొడవ చేసిన వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చి భరత్ మీద ఎక్కడ దాడి చేస్తారో అని భయపడుతున్నారు కానీ నా భర్తకు ఏం జరిగినా మీకు అనవసరం కదా అన్నట్లు మాట్లాడుతుంది. లక్ష్మణ్ కూడా భార్య చెప్పిన మాటలను అవును అన్నట్లు తల ఊపాడు. లక్ష్మణ్, శైలు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది ఏదో పెద్ద కారణం లేకపోతే నువ్వు అంత ఆవేశ పడవు అసలు ఏం జరిగింది అని భరత్ను రఘురాం ప్రశ్నిస్తాడు.

రెచ్చగొడుతూ

రెచ్చగొడుతూ

దీంతో పలానా శ్రీను అనే వ్యక్తి లక్ష్మణ్ అన్నయ్య మీద దుర్భాషలాడటం తో నేను తట్టుకోలేక అతని మీద చేయి చేసుకున్నా అని అతనే ఈ దాడికి ఒడిగట్టాడు అని భరత్ విషయం విశదీకరిస్తాడు. దీంతో అప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకపక్క లక్ష్మణ్ గదిలోకి వెళ్లి బాధపడుతూ ఉంటాడు. శైలు ఎలా అయినా లక్ష్మణ్ మనసు మారిపోతుంది ఏమో తన ఇంటికి తీసుకు వెళ్ళకుండా ఇక్కడే ఉందాం అంటాడేమో అనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తూ అతనిని రెచ్చగొడుతూ ఉంటుంది.

శ్రీను అండ్ కో

శ్రీను అండ్ కో

మరోపక్క భరత్ ఒంటరిగా శ్రీను మీద ఎటాక్ చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి అతనిని కొడుతున్న సమయంలో అందరూ కలిసి భరత్ మీద దాడి చేయడం అదే సమయంలో రఘురామ్ చెప్పడంతో భాస్కర్ అక్కడికి చేరుకుని వాళ్ల భరతం పడతాడు. భరత్ భాస్కర్ ఇద్దరూ కలిసి శ్రీను అండ్ కో ఆట కట్టిస్తారు.

మరోపక్క రఘురాం బాధపడుతున్న సీటు దగ్గరకు వెళ్లి నువ్వు లక్ష్మణ్ కి సేవలు చేస్తూ ఉంటావు అనుకున్నాను కానీ ఇక్కడే ఉన్నావు ఏమిటి అని అడగడంతో నేను అక్కడికి వెళితే వాడు ఎక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనే మాట అంటాడు అని భయంతో ఇక్కడ ఉన్నాను అని అంటుంది. అయితే వాళ్ల మాటలు వింటున్న శైలు తన భర్త ఇక్కడ ఉండడానికి ఏ మాత్రం సుముఖంగా లేడు అనే విషయాన్ని వాళ్ళు మళ్లీ మళ్లీ గుర్తు చేయాలని భావిస్తూ ఉంటుంది.

రఘురాం షాక్

రఘురాం షాక్

అందులో భాగంగానే రఘురాం సీత ఇద్దరి దగ్గరికి వచ్చి తన భర్తకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడం ఇష్టం లేదు అని చెబుతోంది. ఇప్పుడు ఇబ్బంది కదా గాయాలయ్యాయి ఇలాంటి మాటలు మాట్లాడ వద్దు అంటే మా ఇంట్లో కూడా సదుపాయాలు ఉంటాయి నేను ఇంటికి తీసుకు వెళ్ళిపోతాను అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు.

తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రాత్రి నిద్ర పోతున్న సమయంలో రాజేశ్వరి వచ్చి రఘురాం తలుపు కొట్టి నిద్ర లేపుతుంది. ఆ సమయంలో నువ్వు నా సొంత కొడుకు కాదని భరత్, లక్ష్మణ్ ఇద్దరు నా కొడుకును పుట్టిన బిడ్డలే అని చెబుతుంది. అలాంటి వారు ఇద్దరూ విడిపోతుంటే తనకు ఎనలేని బాధ కలుగుతుందని నువ్వు కూడా సొంత తమ్ముళ్లు కాదు అన్నట్టుగా వాళ్ళ విషయం లైట్ తీసుకుంటున్నామని అనడంతో రఘురాం షాక్ అవుతాడు. మొత్తం మీద తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే విధంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X