Vadinamma : అనుకోని ట్విస్ట్ ఇచ్చిన భరత్.. చివరి నిముషంలో అలా చేయడంతో అందరూ షాక్.. అసలు ఏమైందంటే?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 740 వ ఐపిసోడ్ కు చేరింది. ఈ సీరియల్ ముందు నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నా ఎప్పుడూ ఏవో ఒక ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంట్లో నుంచి వెళ్లి పోవాలి అని లక్ష్మణ్ సహా అతని భార్య శైలు కూడా ఫిక్స్ అవుతుంది. ఇంకో రోజులో ఇంటి నుంచి వెళ్లిపోవాలి అని అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవుతాడు. హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణ్ కారణంగా భరత్, జనార్దన్ మధ్య గొడవ జరుగుతుంది. ఎలా అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, ఈ ఒక్కరోజే ఇంట్లో ఉండేది అని శైలు వెళ్లి రఘురాం, సీతాలకు చెప్పి వస్తుంది. ఇక అక్కడితో చివరి ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

ఎక్కడికి వెళ్ళను
తమ అన్న లక్ష్మణ్ మీద దాడి చేసిన శ్రీను అండ్ కో మీద భాస్కర్ సాయంతో భరత్ దాడి చేసి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో భరత్ కు కూడా తీవ్ర గాయాలు అవుతాయి. ఇంటికి వచ్చిన తర్వాత షర్ట్ తీసి పడుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో సిరి ఆ గాయాలను చూసి నువ్వెందుకు ఇంకా ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, ఎందుకు గొడవల కి వెళుతున్నావు అని ప్రశ్నిస్తుంది. అదేమీ లేదు ఇవి మామూలు గాయాలయ్యాయని భరత్ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆగు నేను సీతక్క దగ్గరికి వెళ్తున్నాను అని సిరి వెళ్లబోతోంది. దీంతో భారత్ ఆమెను వారించి ఇవి మామూలు గాయాలే ఇక మీదట నేను ఎక్కడికి వెళ్ళను అని మాట ఇస్తున్నాను అని ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు.

వాళ్ళిద్దరూ విడిపోకుండా
సిరిని అయితే కూల్ చేశాడు కానీ తన అన్న వదిన అన్న మాటలు లక్ష్మణ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుని మరీ భరత్ బాధపడుతూ ఉంటాడు. మరోపక్క రాజేశ్వరి నిద్ర పోకుండా రఘురాం గది తలుపు కొడుతుంది. అదేంటమ్మా ఇంత రాత్రి సమయంలో నిద్ర పోకుండా నా దగ్గరకు వచ్చావు అని రఘురామ్ ప్రశ్నిస్తాడు అయితే నువ్వు మా కడుపులు పుట్టలేదనే సంగతి నీకు తెలుసు, భరత్ లక్ష్మణ్ ఇద్దరూ కూడా ఇలా వెళ్లిపోతుంటే నేను చూడలేకపోతున్నాను. నువ్వు కూడా వాళ్ళు నీ సొంత తమ్ముడు కాదు అన్నట్టుగా వాళ్ళిద్దరూ విడిపోతుంటే వాళ్ల ఇద్దరినీ కలిపి ప్రయత్నం చేయడం లేదు అన్నట్లు నిందిస్తుంది. దానికి రఘురామ్ తీవ్రంగా బాధపడుతూ నేను ఎప్పుడూ నువ్వు నా సొంత తల్లి కాదు అన్నట్లు చూడలేదు అలాగే వాళ్ళు నా సొంత తమ్ముళ్లు కాదు అనే భావన కూడా నా మనసులో ఎప్పుడూ రాలేదు, అయినా నువ్వు ఇలా మాట్లాడడం బాధాకరంగా ఉంది వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉండడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని తల్లికి మాట ఇస్తాడు.

అత్తారింటికి వెళ్తున్నా
ఇక లోపలికి వచ్చాక తల్లి అన్న మాటలను సీటు దగ్గర చెప్పి మరీ బాధపడతాడు రఘురాం. నేను ఎలాంటి పక్షపాతం చూపించడం లేదని వాళ్ళలో వాళ్ళు అలా అనుకుని నన్ను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతారు. ఇంతలో తెల్లవారింది, తెల్లవారిన తరువాత లక్ష్మణ్ తన భార్య శైలు తన కొడుకు రిషితో కలిసి అత్తారింటికి వెళ్లడానికి సిద్ధమయి బయటకు వస్తాడు. వెళ్లేముందు ఒక్కసారి ఆలోచించు మళ్ళీ నిర్ణయం మార్చుకునే అవకాశమే లేదా? అని కుటుంబ సభ్యులు అడుగుతారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు మనసు మార్చుకోవాల్సి మీరే, అయినా ఉండాలి భరత్ అయినా ఉండాలి అని ముందే చెప్పాను మీరు భరత్ ఉండాలి అనుకున్నారు కాబట్టి నేను నా అత్తారింటికి వెళ్తున్నాను అని లక్ష్మణ్ అంటాడు.

భరత్ వెళ్లి లక్ష్మణ్ కాళ్ల మీద
ఇంకా అంతా అయిపోయింది ఇక బయలుదేరదామని అనుకుంటున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా భరత్ వెళ్లి లక్ష్మణ్ కాళ్ల మీద పడతాడు. అనుకోకుండా ఆవేశంలో మనిద్దరి మధ్య దూరం పెరిగింది. నాకు నీ మీద చేయి చేసుకునే ఉద్దేశమే లేదు అది అనుకోకుండా జరిగి పోయింది, నాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళవద్దు అని భరత్ కోరతాడు. ఇదే అవకాశంగా తీసుకొని రఘురాం కూడా అవసరం అయితే నేను కూడా నీ కాళ్లమీద పడతా కానీ ఇల్లు వదిలి వెళ్లిపోతాను అని అనవద్దు అంటాడు. అయితే లక్ష్మణ్ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది కానీ పక్కనే ఉన్న శైలు మాత్రం లక్ష్మణ్ మనసు మారకుండా ఉండటానికి అనేక మాటలు అంటూ ఉంటుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు.

కుటుంబ సభ్యులు అందరూ షాక్
తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం శైలు తల్లి రఘురామ్ ఇంటికి చేరుకుంటుంది. మా ఆయన మా మనవడిని కిడ్నాప్ చేయడం తప్పే అని మాట్లాడుతుంది. ఇది ఎక్కడ గోల రా నాయనా అనుకుని శైలు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు ? అయిపోయింది కదా? అన్నట్టు మాట్లాడుతుంది, వదిలేయడం ఏమిటి ఇప్పుడు ఆ విషయం వల్లే కదా మీ నాన్నని అరెస్టు చేసి జైలులో పెట్టారు అని తల్లి అనడంతో కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతారు. చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అని.


Click it and Unblock the Notifications











