Vadinamma : శైలుకి సీత-రఘురాంల బండారం లీక్ చేసిన పార్వతి అండ్ కో!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 717 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసి రఘురాం, సీతను పిలవకాపోతే భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషంలో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందారు. అంతేకాక లక్ష్మణ్ కు కూడా వాళ్ళు రావడం తెలియడంతో ఆనందంగా ఉంటాడు. రాజేశ్వరి ప్లాన్ తో అందరికంటే ముందు వాళ్ళ మీద అక్షింతలు కూడా పడతాయి. అయితే శైలు తన తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చి క్షమించమని అందరినీ అడుగుతింది. ఇక అలా గత ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

ఊహించినట్లుగానే
అసలు రఘు రామ్ కి సీత ఏం చెప్పింది? ఏం చెబితే అంపశయ్య మీద ఉన్న రఘురాం లేచి కూర్చుని మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు అనే విషయం తెలుసుకోవాలని పార్వతి దుర్గ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే అందులో భాగంగా దుర్గ రఘురాం దగ్గరికి స్వయంగా వెళ్లి అసలు ఏం జరిగింది అని ప్రశ్నించగా దుర్గ సంగతి తెలిసిన రఘురాం అసలు జరిగిన విషయం పూర్తిగా చెప్పేస్తాడు. తాను చెప్పిన విషయం ఆమె ఏ మాత్రం నమ్మదు అనే నమ్మకంతో ఆమెకు పూర్తి విషయం చెప్పడంతో ఊహించినట్లుగానే ఆమె ఆ విషయం నమ్మదు కాని ఈ విషయం మీద బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది. అసలు ఆయన ఎందుకు ఇలా చెప్పాడు? అంటూ ఆమె ఆలోచనలో పడుతుంది.

సెన్సిటివ్ ఇష్యూ
ఇంతలో భర్త భాస్కర్ రావడంతో ఈ విషయం అంతా చెప్పింది. అయితే ఈ విషయం తనకు ముందే తెలిసిన భాస్కర్ ఇంత సెన్సిటివ్ ఇష్యూ ని తన భార్యకు రఘురాం ఎలా చెప్పాడు అనే విషయం మీద టెన్షన్ పడతాడు. ఇదే విషయాన్ని తన భార్య తన తల్లి ముందు కూడా చెబుతోంది. అయితే తల్లికి తెలియకుండా అర్థం కాకుండా మేనేజ్ చేసిన భాస్కర్ తర్వాత వెంటనే రఘురామ్ కి ఫోన్ చేసి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ దుర్గకు చెబితే ఆమె ఊరుకుంటుందా? దీనిని ఊరందరికీ అల్లరి చేస్తుంది కదా అంటాడు. అసలు నేను చెప్పిన విషయం నమ్మిందా? లేదా అని రఘురామ్ ప్రశ్నిస్తే నమ్మలేదు అని అంటాడు. ఇంతలో రఘురాంతో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే రఘు రామ సీత ఇద్దరూ కూడా మారువేషంలో రిషి పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్లి వచ్చిన సంగతి తెలుసు కుంటాడు భాస్కర్.

ఒక్క సారిగా షాక్
మీరు మారువేషంలో వస్తున్నారనే విషయం తెలిస్తే నేను కూడా వచ్చేవాడిని కదా అని భాస్కర్ అంటాడు, మీరు రావడం లేదు అనే ఉద్దేశంతో నేను ఇంట్లోనే ఉండి పోయాను నా భార్యను పంపించాను అని అంటారు. అయితే ఇదంతా నుంచుని చాటుగా వింటున్న దుర్గ భాస్కర్ మాటలకు ఒక్క సారిగా షాక్ అవుతుంది. వెంటనే విషయం అర్థం చేసుకుని భాస్కర్ ని అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తే వాళ్ళు వేరే రూపంలో అక్కడికి వెళ్ళి దీవించి వచ్చారు అని అంటాడు. అయితే మేము కూడా వెళ్ళాం కదా మాకెందుకు కనబడలేదు అని ప్రశ్నిస్తే అది నాకు ఎలా తెలుస్తుంది, నేను రాలేదు కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.

పరుగెత్తుకెళ్లి
ఇక పూర్తిగా విషయం అర్థం కావడంతో పార్వతి దగ్గరకు పరుగెత్తుకెళ్లి దుర్గ సీత రిషి పుట్టిన రోజున అక్కడికి వచ్చారు, అనే విషయం చెప్పి ఆమెను అలర్ట్ చేస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి మేము అక్కడే ఉన్నాం కదా అక్కడికి కొత్తగా ఎవరు వచ్చారు అని శోధించే పనిలో పడతారు. మొత్తం మీద వాళ్ళిద్దరూ కలిసి చర్చించుకుంటూ ఉన్న సమయంలో ఈరోజు ఎపిసోడ్ ముగించినట్లు గా చూపించారు. వారి మనస్సు మాత్రం ఇందులో ఏదో మర్మం ఉంది అని మాత్రం చెబుతూ ఉంటుంది.
Recommended Video

కమింగ్ అప్ లో
ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సీత విషయంలో ఏదో తెలుసుకున్న దుర్గ పార్వతి దగ్గరికి వెళ్లి చేరవేస్తుంది. ఆలా పార్వతి, దుర్గ ఇద్దరూ కలిసి వెళ్లి శైలు గుడికి వచ్చిన మీ ఇంట్లో వంట చేయడానికి వచ్చింది ఎవరో కాదు అని చెబుతూ కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు. ఆ ఫోటోలలో రఘురాం, సీత ఉండే అవకాశం ఉంది. అది చూసిన వెంటనే శైలు ముఖ కవళికలు మారిపోయినట్లు చూపిస్తున్నారు. దీంతో తర్వాత మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











