Vadinamma : దుర్గ, పార్వతి స్కెచ్..మాటిచ్చి కూడా.. నానికి కొత్త అనుమానం?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 719 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసి రఘురాం, సీతను పిలవకాపోతే భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషంలో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందారు.

అంతేకాక లక్ష్మణ్ కు కూడా వాళ్ళు రావడం తెలియడంతో ఆనందంగా ఉంటాడు. రాజేశ్వరి ప్లాన్ తో అందరికంటే ముందు వాళ్ళ మీద అక్షింతలు కూడా పడతాయి. అయితే శైలు తన తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చి క్షమించమని అందరినీ అడుగుతుంది. అయితే రిషి తమ కుమారుడు అని దుర్గకు రఘురాం చెప్పడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక అలా గత ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

ఏదో జరిగింది

ఏదో జరిగింది

తన భర్త భాస్కర్ ద్వారా రఘు రామ - సీత రిషి పుట్టిన రోజు వేడుకలకు హాజరై దీవెనలు కూడా అందించారు అనే విషయం తెలుసుకున్న దుర్గ అప్పటికప్పుడు హుటాహుటిన పార్వతి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక పార్వతికి విషయం చెప్పి అసలు ఆ రోజు మనం కూడా వెళ్ళాము కదా అక్కడికి వచ్చిన వారిలో రఘు రామ్, సీత ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తుంది.

ఇక తన బుర్రకు పదును పెట్టిన పార్వతి అందరికంటే ముందు దీవించిన ఆదిదంపతులు వంటవాళ్లే రఘురాం, సీత అని కనిపెడుతుంది. ఇదే విషయాన్ని దుర్గ కి చెబితే దుర్గ మాత్రం నమ్మదు. లేదు ఆ వంట వాళ్లను లింగం తీసుకు వచ్చాడట, వెతికి వెతికి రఘు రామ సీత ఇద్దరిని లింగం తీసుకున్నాడు కదా ఏదో జరిగింది నువ్వు పొరపాటు పడుతున్నావు అంటుంది.

లింగానికి ఫోన్

లింగానికి ఫోన్

మనలో మనం టెన్షన్ పడడం ఎందుకు ఆ లింగాన్ని అడిగితే తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో వెంటనే పార్వతి లింగానికి ఫోన్ చేస్తుంది. లింగానికి ఫోన్ చేసి ఆ వంట వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి అని అడుగుతుంది ముందు పార్వతి ఫోన్ చేసిన విషయం అర్థం కాక కాస్త అతి చేస్తాడు. ఆ తర్వాత పార్వతి తమకు ఆ వంట వాళ్ళు ఎవరో తెలుసునని రఘుపతి రాఘవ రాజారాం పాట పాడి వాళ్ల సంగతి మీ బావతో చెబుతామని బెదిరిస్తే హుటాహుటిన బయలుదేరి లింగం పార్వతి ముందు ప్రత్యక్షం అవుతాడు.

నిజమే వాళ్ళు రఘురాం, సీత అనే విషయం నాకు ఫంక్షన్ అయ్యాక తెలిసింది. కానీ మా బావకు భయపడి నేను ఏమీ చెప్పకుండా దాచాను మీరు కూడా మా బావకు చెప్పకుండా ఉండమని కోరుతూ మాట తీసుకుంటాడు. అయితే లింగం బాధ చూసి అప్పటికప్పుడు మాట కూడా ఇస్తారు పార్వతి, దుర్గ.

మాట ఇచ్చేశాము

మాట ఇచ్చేశాము

లింగం వెళ్ళిపోయాక అయ్యో అనవసరంగా మాట ఇచ్చేశాము ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా ఎలా ఉంటాం అని ప్రశ్నిస్తుంది దుర్గ. నీ బొంద లింగం బావకు చెప్పము అని మాట ఇచ్చాను కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎనిమిది కోట్ల మంది లో ఎవరికైనా చెప్పవచ్చు కదా అని సలహా ఇస్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే మరోపక్క కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కాస్త గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి సీత కుటుంబ సభ్యులందరూ ప్లాన్ చేస్తారు.

కార్తీక మాసం విశిష్టత శిల్ప కు చెప్పి శిల్ప చేత కూడా ఆ రోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేయించడానికి ప్లాన్ చేస్తారు. అలా కుటుంబ సభ్యులు మధ్య సరదా సరదా సంభాషణలు జరుగుతూ ఉంటాయి., రఘురాం - సీత, భరత్- సిరి, లక్ష్మణ్- శైలు, నాని- శిల్ప ఎలా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

వాయిస్ మెసేజ్

వాయిస్ మెసేజ్

అయితే నాని ఫోన్ కి తాను పంపిన వాయిస్ మెసేజ్ విషయాన్ని భరత్ మరోసారి గుర్తు చేస్తాడు. అయితే అసలు తనకు ఎలాంటి వాయిస్ మెసేజ్ రాలేదు అని నాని చెప్పడంతో భరత్ తన ఫోన్ నుంచి తాను పంపిన వాయిస్ మెసేజ్ వినిపిస్తాడు. తన ఫోన్ లో లేకపోవడంతో ఎవరు డిలీట్ చేశారు అనే విషయం మీద మల్లగుల్లాలు పడుతుంటాడు నాని.

మరో పక్క దీపం వదలడానికి తనతోపాటు రావాలి అని తన తల్లికి సిరి ఫోన్ చేయడంతో ఆమె ఎగిరి గంతులేస్తూ వస్తానని అవుతుంది. శైలు కి ఎలా విషయం చేరవేయాలని ఆలోచిస్తూ ఉంటే మా కూతురు నన్ను పిలిచింది అనే ఆనందపడుతుంది ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
కమింగ్ అప్ లో

కమింగ్ అప్ లో

తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం, సీతలు పుట్టిన రోజు ఫంక్షన్ కు వచ్చింది ఎవరో తెలుసుకున్న దుర్గ, పార్వతి ఇద్దరూ కలిసి వెళ్లి శైలు గుడికి వచ్చిన మీ ఇంట్లో వంట చేయడానికి వచ్చింది ఎవరో కాదు అని చెబుతూ కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు. ఆ ఫోటోలలో రఘురాం, సీత ఉండే అవకాశం ఉంది. అది చూసిన వెంటనే శైలు ముఖ కవళికలు మారిపోయినట్లు చూపిస్తున్నారు. దీంతో తర్వాత మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X