Vadinamma : చావబోతున్న భరత్ ను కాపాడింది ఎవరో తెలుసా? ఊహించి కూడా ఉండరు..

చనిపోయాడు అనుకున్న భరత్ అనూహ్య పరిస్థితులలో తిరిగి కుటుంబ సభ్యులు వద్దకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి వరకు రఘురాం సహా సీత ను టార్గెట్ చేసిన కుటుంబ సభ్యులు సిరి తల్లి పార్వతి, శైలు తండ్రి జనార్దన్ సహా పోలీసులు అందరూ అక్కడి నుంచి వెంటనే నిష్క్రమిస్తారు. ఇక భరత్ తనను క్షమించమని కోరడం సీత అతనిని కొట్టడం కూడా గత ఎపిసోడ్ లో చూపించారు. భరత్ బాధను అర్థం చేసుకునే గుణం ఇకమీదట నీ మనసుకు నచ్చిన విధంగా చేయి, మాతో ఉండాలి అనిపిస్తే మాతో ఉండవచ్చు అని చెబుతారు అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు.

నచ్చలేదు అని

నచ్చలేదు అని

ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తనను క్షమించమని రాజేశ్వరి సీతను కోరడంతో భరత్ ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంటాడు. ఇప్పటిదాకా తల్లి బాధ పడుతుంది అనే ఉద్దేశంతో ఎలా అయినా భరత్ ను ఆమె వైపు పంపాలని ప్రయత్నాలు చేసిన రఘు రామ్ తల్లి దుర్బుద్ధి చూసిన తర్వాత నేను బలవంతంగా వాడిని అటువైపు పంపడానికి ససేమిరా ఒప్పుకోను వాడికి ఇష్టమైతే నేను ఆపను అని చెబుతాడు. అయితే శైలు మాత్రం తన అత్త గారు చేసిన పని నచ్చకపోవడంతో ఆమె మీద ఫైర్ అవుతుంది. మీరు ఈ విధంగా వాళ్లకు క్షమాపణలు చెప్పడం నాకు నచ్చలేదు అని ఆమె అంటుంది.

 రఘురామ్ కి భయపడి

రఘురామ్ కి భయపడి

దానికి రాజేశ్వరి కూడా గట్టిగానే స్పందిస్తూ నేను రఘురామ్ కి భయపడి క్షమాపణ చెప్పలేదు, భరత్ నన్ను తల్లి అని కూడా భావించను ఇకమీదట చచ్చిపోయినట్టే అని చెప్పడంతో ఆ విషయంలో బాధపడి నేను క్షమాపణలు చెప్పాను అని అంటుంది. దీంతో లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ ఇంత జరుగుతున్నా వాడికి ఎవరు ఏమిటో అర్థం కావడం లేదు అంటూ భరత్ గురించి చెబుతాడు. ఇంతలో శైలు మాట్లాడుతూ త్వరలోనే అన్ని విషయాలు అర్థమవుతాయి అని అంటుంది. ఇందులో శిల్ప కల్పించుకుని శైలక్క నీలో చాలా మార్పు వచ్చింది నువ్వు మాట్లాడే మాటలు అన్నీ కూడా చాలా పరిణితితో ఉంటున్నాయి అని అంటుంది. అవునమ్మా మా మీద బాధ్యత పడిన తర్వాత ఆలోచన శక్తి కూడా పెరిగినట్లు ఉంది అని తనను తాను సమర్ధించుకుంటూ మురిసిపోతుంది.

ఏమీ నచ్చలేదు

ఏమీ నచ్చలేదు

ఇక మరో పక్క సిరి తన భర్త దగ్గరికి వెళ్లి నువ్వు ఇలా చేయడం నాకు ఏమీ నచ్చలేదు నువ్వు అలా చేయడం తోటి నేను కూడా సీతక్క బావగారు మీద అనుమాన పడాల్సి వచ్చింది అని అంటుంది. అయితే భరత్ మాట్లాడుతూ వాళ్ళ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అంటాడు. నా సంగతి పక్కన పెట్టు నువ్వు అలా వెళ్లడం కరెక్ట్ ఏనా అని ప్రశ్నిస్తుంది. అయితే భరత్ అసలు ఏం జరిగింది అనే విషయం మొత్తం చెప్పుకొస్తాడు. నేను చెరువులో దూకడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆదిత్య సార్ వచ్చి నన్ను ఆపాడు. (దేవత సీరియల్ లీడ్ యాక్టర్ అయిన అర్జున్ అంబటి ఆదిత్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రను ఇప్పుడు వదినమ్మ సీరియల్ లోకి కూడా తీసుకు వచ్చారు. ఆదిత్య భరత్ ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నాడు అనే విషయం తెలుసుకుని ఆ సమస్యకు అయితే చావు పరిష్కారం కానే కాదు అని చెబుతాడు.

అర్థం అయ్యేలా

అర్థం అయ్యేలా


ఆదిత్య మాటలను మొదట నమ్మకపోయినా జరిగిన విషయం అంతా నీకు అర్థం అయ్యేలా చెబుతాను నువ్వు కనుక చచ్చిపోతే ఎక్కువగా చిక్కుల్లో పడేది రఘురాం అనే విషయం చెబుతాడు ఆదిత్య. అందుకే నువ్వు రెండు రోజుల పాటు నరసింహ ఇంట్లో ఉండు అక్కడ జరుగుతున్న విషయాలు అన్నీ నరసింహ నీ దగ్గరకు చేరవేస్తాడు అప్పుడు పరిస్థితి అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి అనే విషయం ఆలోచించిదువు గాని అని చెబుతాడు. అలా తను నరసింహ ఇంట్లో ఉండడం నరసింహ ఇంట్లో ఉన్న తర్వాత పార్వతి ఇంటికి వచ్చి చేస్తున్న రభస గమనించడంతో తాను ఇంటికి రావాలని నిర్ణయించుకున్నానని భరత్ తన భార్యకు చెబుతాడు. అంతేకాక ఇక తాను తన అన్న వదిన బాధపడడం చూడలేనని ఇప్పటికైనా వాళ్ల ఉద్దేశాలు మంచివి అనే విషయం తెలుసుకోవాలని భరత్ తన భార్యకు పూసగుచ్చినట్టు వివరించి చెబుతాడు.

చించి వేసే అవకాశం

చించి వేసే అవకాశం

మరోపక్క భరత్ ఎలా చనిపోవాలి అనుకున్నాడు? తాను ఎలా అడ్డుకున్నా? అనే విషయాన్ని కూడా రఘురాం దగ్గరికి వెళ్లి చెబుతాడు నరసింహ. అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం శైలు ఆదేశాల మేరకు జనార్ధన్ షాప్ కాగితాలు భరత్ కి ఇవ్వమని లింగంతో పంపినట్టు చూపించారు. అంతేకాక మన వలలో చేప పడాలి అంటే ముందు ఎర్ర వేయాలి అని లింగం కు చెబుతున్నట్లు కనిపిస్తోంది. అయితే భరత్ ఆ కాగితాలు తీసుకుని వాటిని చించి వేసే అవకాశం కనిపిస్తోంది చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X