Vadinamma : భరత్ బతికి వచ్చాడు అనుకుంటే మరో టెన్షన్.. ఇంటి ఓనర్ ఎంట్రీతో మరో ట్విస్ట్!
భరత్ చనిపోయాడు అని భావించి ఇంట్లో అందరూ కూడా రఘురాం సీత ఇద్దరినీ టార్గెట్ చేసి మాట్లాడుతున్న సమయంలో భరత్ మళ్ళీ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. భరత్ తిరిగి వచ్చాడు అని ఆనందంలో కుటుంబ సభ్యులు మిగిలిపోగా భరత్ ఎలా అయినా చనిపోతే తమ రాజకీయాలు చేయవచ్చు అని భావించిన జనార్ధన్ లాంటి వారు మాత్రం బాధపడుతూ వెనక్కి వెళ్లిపోతారు. తాను చనిపోతానని వెళ్లడం, చని పోతూ ఉండడంతో ఆదిత్య వచ్చి ఎలా కాపాడాడు అనే విషయాన్ని భరత్ తన భార్య సిరికి వెల్లడిస్తాడు. ఇదే విషయాన్ని నరసింహ రఘురాం సీత ఇద్దరికీ వెల్లడిస్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బలవంతం చేసింది కాబట్టి
నరసింహ ఆదిత్య వచ్చి ఎలా కాపాడాడు అనే విషయాన్ని రఘురాం సహా సీతకు వివరించి చెప్పడంతో రఘురాం సీత ఇద్దరూ కూడా నరసింహ మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము అని చెబుతారు. మీ ఉప్పు తినే వాడిని నేనే మీకు రుణపడి ఉన్నాను అని నరసింహ అంటాడు. అలాగే నేను మీకు చెప్పదగిన వాడిని కాకపోవచ్చు కానీ మీరు అలా భరత్ను వేరే వైపు వెళ్దామని చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేది అని అంటాడు.
దానికి రఘురాం అలాంటిదేమీ లేదు నువ్వు కూడా మాలో ఒక్కడివే, అమ్మ వాడిని తమవైపు పంపించమని బలవంతం చేసింది కాబట్టి అలా చెప్పాను కానీ ఎవరు ఏమిటో అర్థం అయిన తర్వాత మా వైపే ఉండమని చెప్పాను అని రఘురామ్ అంటాడు.

ఏ మాత్రం కరెక్ట్ కాదు
ఆ తర్వాత షాప్ ఉంది కదా అని నిన్ను పనిలో పెట్టుకున్నందుకు కానీ ఇప్పుడు నాకే బతుకుదెరువు లేదు నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు రా నరసింహం వేరేచోట ఎక్కడైనా పని చూసుకో అని అంటాడు. దానికి నరసింహ మాట్లాడుతూ నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు నాకు సహాయం చేశారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపో లేను అన్నయ్య ఈ తమ్ముడు నీతోనే ఉండనివ్వండి అని అంటారు.
మరోవైపు పార్వతి భర్త సత్యమూర్తి తన సోదరి రాజేశ్వరి తో మాట్లాడుతూ ఉంటాడు. నీలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అని రఘురాం ని ఒంటరిగా చేసి నువ్వు నీ ముగ్గురు కొడుకులను కలపాలని అనుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని రాజేశ్వరి ముందు చెబుతాడు.

లక్ష్మణ్ బాధపడుతూ
రఘురాం మీ పెద్ద కొడుకు హోదాలో ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు వాడి వల్లే ఉమ్మడి కుటుంబం ఇంత అభివృద్ధి చెంది నీ మిగతా కొడుకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంతా బాగుంది అనుకునే టైంలో నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని తన సోదరి రాజేశ్వరికి వివరించి చెబుతాడు.
ఆమె ఇంకా ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నువ్వు నా దృష్టిలో దేవతవి దయచేసి అలాగే ఉండు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకు అని చెప్పి వెళతాడు. మరోపక్క రఘురాం భారతి ఇద్దరికీ బతుకుదెరువు పోయింది అని లక్ష్మణ్ బాధపడుతూ ఉంటాడు. వారికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

షాప్ కాగితాలు
ఇంతలో శైలు రావడంతో ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది లక్ష్మణ్ ఎలా అయినా తన సోదరులకు సహాయపడాలి అనుకున్న విషయం చెబుతాడు. ఇప్పుడు లక్ష్మణ్ కి ఎదురు తిరిగితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది అతని కంటే ముందే నేను మంచి అనిపించుకోవాలని ఉద్దేశంతో భరత్ కి షాప్ ఇచ్చేయమని నేను మా నాన్నకి చెబుతాను అని శైలు అంటుంది.
ఆ కాగితాలు తెప్పిస్తారు నీ చేతుల మీద భరత్ కి ఇవ్వు అని లక్ష్మణ్ తో చెబుతుంది. అయితే లక్ష్మణ్ మాట్లాడుతూ భరత్ కి నామీద కోపం ఉంది కాబట్టి ఆ షాప్ కాగితాలు నువ్వే ఇవ్వు అని అంటాడు. సరేనని శైలు అంటుంది తన తండ్రికి ఫోన్ చేసి కాగితాలు లింగంతో పంపించమని చెబుతుంది.

ఇంటి ఓనర్ ట్విస్ట్
ముందు తటపటాయించినా సరే శైలు ఉద్దేశం అర్థం చేసుకున్న జనార్ధన్ ఆ కాగితాలు పంపిస్తాడు కాగితాలు తీసుకువచ్చిన లింగం భరత్ కోసం ఇంటికి వచ్చి భరత్, భరత్ అని పిలుస్తూ ఉంటాడు. ఎందరు వచ్చి ఏం జరిగింది ? భరత్ తో నీకు కు ఏం పని అని ప్రశ్నించినా సర్లే మాట్లాడకుండా లెనోవో భరత్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చివరికి భరత్ రావడంతో కాగితాలు వచ్చేందుకు ఇచ్చేందుకే వచ్చాం అనే విషయం వెల్లడిస్తాడు.
ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు. ఇక రాబోయే ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం కుటుంబ సభ్యులు ఇంటి మధ్యలో గోడ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇంటి ఓనర్ వచ్చి ఇప్పటికిప్పుడు గోడకూలుస్తారా? లేక ఖాళీ చేసి వెళ్ళిపోతారా అని వార్నింగ్ ఇవ్వడం కూడా కనిపిస్తోంది. అయితే ఉమ్మడి కుటుంబం అక్కడి నుంచి బయలుదేరి వేర్వేరు చోటకు వెళుతున్నారా లేదా కలిసి ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











