Vadinamma : శైలు ప్లాన్.. రెచ్చిపోయి గొడవకు వెళ్ళిన లక్ష్మణ్..అదిరే ఛాలెంజ్?

భరత్ ఇంటికి తిరిగి రావడంతో రఘురాం ఫ్యామిలీ చాలా ఆనందంగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే కుటుంబాలు రెండుగా విడిపోవడంతో లక్ష్మణ్ అండ్ ఫ్యామిలీ ఒకపక్క రఘురాం, భరత్ కుటుంబాలు ఒక పక్క నివసిస్తున్నాయి. అయితే ఇంటి ఓనర్ జనార్ధన్ ఆదేశాల మేరకు అద్దె పెంచినట్లు చెప్పడంతో ఆ డబ్బు కట్టేందుకు రఘురాం , భరత్ కష్టపడుతూ ఉంటారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శైలు ప్లాన్

శైలు ప్లాన్

తనను భరత్ అవమానించాడు అనే సంగతి నేరుగా చెప్పకుండా శిల్పతో చెప్పించడానికి శైలు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఏం చెప్పాలి అనే విషయాన్ని శిల్ప ముందుగానే చెప్పి ఉంచుతుంది. సరిగ్గా లక్ష్మణ్ వచ్చే సమయానికి శిల్ప బయటకు వెళుతూ ఉండగా ఏం జరిగింది అని లక్ష్మణ్ ప్రశ్నిస్తాడు.

అయితే నేను నా నోటితో చెప్పలేను అనే విధంగా మాట్లాడిన శిల్ప ఆ తరువాత షాపు కాగితాలు తీసుకుని లింగం వస్తే భారత్ ఎలా ప్రవర్తించాడు? ఆ కాగితాలు ఎలా చింపి ముఖాన వేశాడు ? శైలుని ఎలా అవమానించాడు అనే విషయాలను పూసగుచ్చినట్లు చెపుతుంది. అలా చెప్పిన తరువాత లక్ష్మణ్ బాధపడుతూ లోపలికి వెళ్ళాడు. కానీ శైలు ఏమీ జరగనట్లు గా నటించే ప్రయత్నం చేస్తుంది.

గొడవలు జరగడం సహజం

గొడవలు జరగడం సహజం

దానికి లక్ష్మణ్ బాధపడుతూ నేను అలా అడిగి ఉండాల్సింది కాదు నువ్వు మంచి మనసుతో కాగితాలు ఇవ్వమని చెప్పినా సరే భరత్ వాళ్ళు ఇలా చేయడం తమకు ఏమాత్రం నచ్చలేదు అని అంటాడు. దానికి శైలు మాట్లాడుతూ పెద్ద కుటుంబం అన్న తర్వాత ఇలాంటి గొడవలు జరగడం చాలా సహజం ఎప్పుడో ఒకప్పుడు భరత్ నా గురించి నిజం తెలుసుకుంటాడు నాకు ఆ విషయంలో ఎలాంటి భయం లేదు అని ఆమె అంటుంది. అయితే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని లక్ష్మణ్ అడిగితే నేను ఎలాగో బాధపడుతున్నాను కదా చెప్పి నిన్ను కూడా బాధ పెట్టడం ఎందుకు అని నేను చెప్పలేదు అని శైలు అంటుంది.

వసూళ్లకు పంపి

వసూళ్లకు పంపి

మరోపక్క రఘురాం భరత్ డబ్బు ఏమైనా తెస్తారా లేదా? అని సీత, సిరి ఇద్దరు ఎదురుచూస్తూ ఉంటారు. వెళ్లి చాలాసేపు అయింది కానీ ఇద్దరు ఇంకా రావడం లేదు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో రఘురాం రావడం, వచ్చిన తర్వాత 40 వేల రూపాయల బాకీలు వసూలు అయ్యాయి అని చెప్పడం జరుగుతుంది. ఇంటి యజమానికి పాతిక వేల రూపాయల డబ్బులు ఇచ్చి వస్తున్నాను మిగతా పదిహేను వేల తో రేపు కావలసిన సరుకులు తీసుకు వద్దాము అని అంటాడు.

ఇంతలో వచ్చిన భరత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ జనార్ధన్ కి పుట్టగతులు ఉండవు మనం కష్టపడి సంపాదించిన డబ్బు వసూలు చేసుకునే రమ్మని పుస్తకంతో లింగాన్ని వసూళ్లకు పంపారట. నేను అదే చోటకి వసూలు కి వెళితే నన్ను వింతగా చూసారు అని తన బాధ వ్యక్త పరుస్తాడు. అయిందేదో అయింది గట్టిగా మాట్లాడితే లక్ష్మణ్ వింటాడు, మళ్లీ బాధపడతాడు అని రఘురాం అంటాడు.

షాపు లాక్కున్నారా?

షాపు లాక్కున్నారా?

15 వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంట్లో కావలసిన సరుకులు తీసుకురమ్మని భరత్ ను కోరతాడు. దీంతో భరత్ డబ్బు తీసుకుని సరుకులు తీసుకురావడం కోసం బయటకు వెళ్తాడు. అయితే తన భార్య అవమాన పడి బాధపడుతుంటే చూడలేక లక్ష్మణ్ భరత్ మీద అరవడం కోసం వస్తాడు కానీ ఈ లోపు భరత్ షాపుకు వెళ్లడంతో రఘురాం సీతతో మాట్లాడతాడు లక్ష్మణ్.. వాడు ఎక్కడ వాడితో నేను మాట్లాడాలి అంటూ ఉండగానే భరత్ వస్తాడు.

వచ్చిన తర్వాత ఏంటో మాట్లాడాలి, తేల్చాలి అంటున్నావు ఏంటి సంగతి చెప్పమంటే నా భార్యను అనుమానించాల్సిన అవసరం ఏమొచ్చింది నేను ఇవ్వమంటే ఆ కాగితాలు ఆమె నీకు ఇచ్చింది అని అంటాడు. అయితే నువ్వు లాక్కో మంటేనే? షాపు లాక్కున్నారా అని భరత్ ప్రశ్నిస్తాడు.

చాలెంజ్?

చాలెంజ్?

నువ్వు మూర్ఖుడు లాగా మాట్లాడుతున్నావు నీకు ఏమీ తెలియదు అని లక్ష్మణ్ అనేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. కానీ ఊరి పెద్దలు విరాళం కోసం రఘురాం ఇంటికి వస్తారు. రఘురాం లేడు అని తెలుసుకుని బాధపడుతూ వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రతి ఏడాది లక్ష 16 వేల డబ్బు విరాళంగా ఇచ్చే వారని కానీ ఈ ఏడాది ఇచ్చేందుకు కనపడకపోవడం బాధగా ఉందని అంటారు కానీ శైలు తాను రెండు లక్షల 16 వేల రూపాయలు ఇస్తానని నేనే ఇంటి పెద్ద కోడలిని చెబుతుంది.

దానికి వాళ్ళు సంతోషంగా సీతమ్మ లాగానే నువ్వు కూడా మంచి మనసున్న దాని లాగా ఉన్నావు అని ఒక పది రోజులలో ఆ అమౌంట్ తీసుకు వెళ్తామని చెప్పి వెళతారు అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం భరత్ ని శైలు ఎదో అనడంతో భారత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఏం జరిగింది అని సీత అడిగితే ఇలా చాలెంజ్ చేసింది అని చెబుతాడు, అయితే సీత కూడా మన ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నాను అని చెప్పు గెలిస్తే మళ్ళీ అందరం కలిసి ఉండాలి అంటుంది. మరి చూడాలి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X