Vadinamma : ఛాలెంజ్ కోసం రఘురాం అండ్ కో తంటాలు.. 'సీత'ను అలా చూసి షాక్ అయిన రఘురాం?
కుటుంబ సభ్యుల మధ్య గుడికి విరాళం ఇచ్చే విషయం మీద ఒక ఛాలెంజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. రెండు లక్షల 16 వేల రూపాయలను భరత్, రఘురాం కుటుంబాలు ఇస్తాయా లేక లక్ష్మణ్, నాని కుటుంబాలు ఇస్తాయా అనే విషయం మీద చాలెంజి చేసుకున్నారు. ఒకవేళ రఘురాం భరత్ కలిసి రెండు లక్షల 40 వేల రూపాయలు గాని ఇవ్వలేకపోతే భరత్ తన భార్య సిరితో కలిసి లక్ష్మణ్ కుటుంబసభ్యులు నివసిస్తున్న వైపు వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాని పక్షంలో ఇంటి మధ్యలో గోడ బద్దలుకొట్టి అంతా కలిసి ఉండేలా ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో భరత్, రఘురాం కలిసి ఒకచోట బియ్యం మోసే పనికి వెళ్తున్న సంగతి తెలిసిందే. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మిల్లులో బస్తాలు మోసి
ఇంటికి వెళ్లే ముందు తాను మిల్లులో బస్తాలు మోయడానికి వచ్చాను అన్న సంగతి ఇంట్లో చెప్పవద్దు అని రఘురాం భరత్ ను కోరతాడు. దానికి సరేనన్న భరత్ నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని షరతు విధిస్తాడు. సరేనని వేరే పని వెతుక్కుంటానని రఘురామ్ అంటాడు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత సీత అనుకోకుండా భరత్ మిల్లులో పని చేస్తానికి వెళ్తాను అని చెప్పాడు కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు సంపాదించిన డబ్బు ఎక్కడ అని అడగడంతో ముందు సంయమనం కోల్పోయినట్లు కనిపించినా ఆ తర్వాత సరదాగా ఆ మాటలు అన్నట్లు అర్థమవుతుంది.

సాధ్యమయ్యే పనికాదు
భరత్, రఘురామ్ ఇద్దరూ కలిసి తాము సంపాదించిన 1500 రూపాయలను సీతకు ఇస్తారు. దీంతో సీత చీమ ఒక్కొక్క బియ్యం గింజ తీసుకువెళ్లి పేర్చినట్లు మనం ఇలా సంపాదిస్తే పది రోజుల్లో రెండు లక్షల 40 వేల రూపాయలు సంపాదించడం అనేది సాధ్యమయ్యే పనికాదు అని అంటుంది. ఇది మొదటి రోజు కదా ఏదో పని చేసి తీసుకువచ్చాం రేపటి నుంచి వేరే విషయాల మీద ఫోకస్ పెడతాము అని రఘురాం, భరత్ అంటారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా శిల్ప, శైలు ఇద్దరూ వాళ్ళే నయం ₹1500 తీసుకువెళ్లి హుండీలో వేశారు మనం ఇంకా ఆ డబ్బు కూడా వేయలేదు అని అనుకుంటూ ఉంటారు.

డెలివరీ చేయడానికి
ఇంతలో శైలు మాట్లాడుతూ నా భర్తకు 40 వేల రూపాయల జీతం, నీ భర్తకు 35 వేల రూపాయల జీతం వాళ్ళ జీతాలు వచ్చే రోజు దగ్గర పడింది కాబట్టి రెండు రాగానే మన హుండీలో 70 వేల రూపాయలు ఒక్కసారే పడిపోతాయి అని చెబుతుంది. వాళ్ళందరూ అలా అనుకుంటూ ఉండగానే భరత్, రఘురాం పనికి వెళతారు. మిల్లులో సూపర్వైజర్ వచ్చి భరత్ ను తాము వదులుకున్న షాపులోనే బియ్యం డెలివరీ చేసి రావాల్సిందిగా ఆర్డర్ వస్తాడు. ముందు తటపటాయించి వెళ్ళలేను అని చెప్పిన భరత్ ఆ తరువాత మాత్రం అక్కడికి వెళ్లి డెలివరీ చేయడానికి సిద్ధం అవుతాడు.

పాపం శైలు
బియ్యం తీసుకుని షాపుకి వెళ్లడంతో అక్కడ జనార్ధన్ భరత్ ను అవమానించే విధంగా ముఖం మీద చెప్పులు పెట్టి చూపిస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత లింగం కూడా అలాగే చేయబోతే లింగం కాళ్ళ మీద బియ్యం బస్తా పడేస్తాడు భరత్. ఇది మా షాపు మా షాపులోనే మీరు పని చేస్తున్నారు అంటూ వాళ్ళ అవమానానికి తగిన సమాధానం కూడా చెబుతాడు భరత్. ఇక ఆ రోజు సాయంత్రం లక్ష్మణ్ తనకు జీతం రావడంతో 40 వేల రూపాయలు తీసుకువచ్చి ఇస్తాడు లక్ష్మణ్ అలా చేతికి ఇచ్చాడో లేదో, పాల బిల్లు, పేపర్ బిల్లు కలెక్షన్ల కోసం మనుషులు రావడంతో వాళ్లకు క్లియర్ చేస్తూ ఉంటారు.

ఏం జరగబోతోంది?
లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ జీతం డబ్బులతో పది రోజుల్లో రెండు లక్షల రూపాయలు సంపాదించడం అనేది కానీ పని కాబట్టి నేను ఎక్స్ట్రా పని చేయడం కోసం ఒక ప్రాజెక్టు ఒప్పుకున్నాను. ఆ ప్రాజెక్టు పని మీద అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి ఉంది అని చెబుతూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అయితే ఎలా అయినా పందెంలో తామే నెగ్గాలి అని భావిస్తున్న ఇరు వర్గాల వారు తమ తమ ప్లాన్ లను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కానీ ఏం జరగబోతోంది అనే విషయం మీద మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు.

వంటపనికి సీత?
తరువాత ఎపిసోడ్ లో జరగబోతున్న కమింగ్ అప్ లో చూపించిన దాని ప్రకారం రఘురాం మెడికల్ షాప్ లో మందులు కూడా డెలివరీ చేస్తున్నట్లుగా చూపించారు. ఒక ఇంటికి మందులు డెలివరీ చేయడం కోసం వెళ్లడంతో అక్కడి వారు ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని అడగటంతో నడుచుకుంటూ రావడంతో ఆలస్యమైందని రఘురాం చెబుతాడు. అదే ఇంట్లో వంట పని కోసం వెళ్లిన సీత భర్తను చూసి వెంటనే టీ పెట్టి తీసుకువచ్చి రఘురాం చూడకుండా ఆయన పక్కన పెట్టి వెళ్లి పోతుంది. టీ తాగిన వెంటనే అది సీత చేతితో చేసిన టి అని అర్థమైన రఘురాం ఇంట్లోకి చూడగానే సీత అక్కడ పని చేస్తూ కనిపిస్తుంది. దీంతో రఘురాం ముందు షాక్ అవుతాడు, ఆ తరువాత బాధపడతాడు.


Click it and Unblock the Notifications











